సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం నియమించిన జిల్లా స్థాయి కమిటీ రోహిత్ వేములది వడ్డెర కులమని, దళితుడు కాదని నిర్ధారించగా, దానిని గుంటూరు కలెక్టర్ కాంతి లాల్ దండే ధ్రువీకరించడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో ఖండించింది. నిందితులను ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం నుంచి కాపాడేందుకు కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య ఆరోపించారు.
కులాంతర వివాహాల్లో పుట్టిన పిల్లలకు తల్లి లేదా తండ్రి కులం ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు నిర్ధారించిందని తెలిపారు. విద్యాసంస్థ ల్లో కుల వివక్ష, అణిచివేతలను అధిగమిం చేందుకు రోహిత్ చట్టాన్ని తేవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోహిత్ కేసును నీరుగార్చే ప్రయత్నం: సీపీఎం
Published Wed, Feb 15 2017 1:25 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
Advertisement