సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నేరడి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడీ అంటున్నారు. ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా జల వివాదాలు పరిష్కరించుకునేందుకు 9వ తేదీన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ కానున్నారు. ఈ చర్చలు ఫలవంతమై నేరడి నిర్మితమైతే అక్షరాలా రెండున్నర లక్షల ఎకరాల్లో బంగారం పండుతుంది. వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87,88, హిరమండలం రిజర్వాయర్ పనుల కో సం ఇప్పటికే రూ. 1600 కోట్లు ఖర్చు చేయగా, ప నులు పూర్తి చేసేందుకు మరో రూ.600 కోట్లు అవసరం ఉంది. ఈ పనులు చేస్తూనే మరోవైపు నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టనున్నారు. రూ. 585 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే ప్రాజెక్ట్ రూపకల్పన చేయగా, తాజా ధరల మేరకు రివైజ్డ్ అంచనా వేసి ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
వైఎస్సార్ చొరవతోనే..
నేరడికి ఎప్పుడో శంకుస్థాపన పడినా పనుల్లో వేగం చూసింది మాత్రం వైఎస్సార్ హయాంలోనే. 1962 సెప్టెంబర్ 30న ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య 50ః50 ప్రాతిపదికన వంశధార బేసిన్‌లో 115 టీఎంసీల నీటిని పంచుకునేందుకు ఒప్పందం జరిగింది. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రూ. 944.90 కోట్లతో వంశధార ప్రాజెక్ట్ రెండో దశ నిర్మా ణానికి శ్రీకారం చుట్టారు. వంశధారపై నేరడి బ్యారే జీ నిర్మించి, అక్కడి నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు వరద జలాలను తరలించి, గొట్టా బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు కొత్త గా 45 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించా రు. ఒడిశా ప్రభుత్వం నేరడికి అభ్యంతరం చెప్పడంతో భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై సైడ్‌వ్యూయర్ నిర్మించి అక్కడి నుంచి వరద జలాల ను సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు తరలించేలా అలైన్‌మెంట్ మార్చి పనులు చేపట్టారు. వివాదం తేలిన తర్వాత నేరడి బ్యారేజీ నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు.
కన్నెత్తి చూడని బాబు..
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు వంశధార నదీ జలాలను సమానంగా పంచుతూ 2017 సెప్టెంబర్–13న ట్రి బ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలయ్యేలా చూడడంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం వహించారు. అప్పట్లోనే ఒడిశాతో చర్చలు జరిపి ఉంటే ఈ పాటికే ప్రాజెక్ట్ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ వైఎస్సార్‌కు పేరు వస్తుందని బాబు ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జిల్లా రైతులకు నిరీక్షణ తప్పలేదు. వైఎస్సార్ తర్వా త మళ్లీ వైఎస్ జగన్ హయాంలోనే ఈ పనులకు కదలిక వచ్చింది.
చదవండి: (Andhra Pradesh: ఆస్పత్రులకు ఆహ్వానం)
ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే..?
►వంశధార జల వివాదంపై ట్రిబ్యునల్ ఆంధ్రాకు అనుకూలమైన తీర్పునిచ్చింది.
►నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 108 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్ర భుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.
►115 టీఎంసీల నీరు వంశధారలో లభ్యత కాగా, రెండు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవాలని సూ చించింది.
►బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది.
►కాట్రగడ్డ సైడ్ వ్యూయర్ వద్ద ఏర్పాటు చేసే హెడ్ రెగ్యులేటర్‌ను ఏటా జూన్ 1 నుంచి ఎనిమిది టీ ఎంసీలు మళ్లించే వరకూ లేదా నవంబర్ 30 వర కూ తెరిచి ఉంచాలని, డిసెంబర్ –1న మూసి వేయాలని షరతు పెట్టింది.
►నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత కాట్ర గడ్డ సైడ్ వ్యూయర్‌ను పూర్తిస్థాయిలో తొలగించాలని, వంశధార నదీ యాజమాన్యం బోర్డు ఏర్పా టు ఉండాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వం చొరవ..
ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించగలిగింది. దీంతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతి లభించింది. ఏపీ అవసరాల కోసం బ్యారేజీకి కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. రూ. 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒడిశా కోసం ఎడమవైపున కూడా స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రిబ్యునల్ ఎంత మేర నీటి అవసరమో అన్న విషయాన్ని గెజిట్ విడుదల చేసిన ఆరు నెలలు లోగా ఏపీకి తెలియజేయాలని సూచించింది.
ప్రయోజనాలెన్నో..
►నేరడి బ్యారేజీ నిర్మాణంతో ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాలకు, రబీలో 2 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు.
►ఉద్దానం ప్రాంతానికి తాగునీటి సమస్య తీరుతుంది.
►ఇప్పటికే రూ. 700 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయి.
►వంశధార–నాగావళి నదుల అనుసంధానానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది.
►ఒడిశాలో 30 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు.
►హిరమండలం రిజర్వాయర్‌లోకి 19 టీఎంసీల నీరు చేరాలంటే 10 వేల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం 40 రోజుల పాటు రెగ్యులర్‌గా ఉండాలి. అదే నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే ఈ సమస్య తప్పుతుంది.
Comments
Please login to add a commentAdd a comment