కలెక్టర్‌ని కలిసిన వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, అఖిల పక్ష నేతలు
శ్రీకాకుళం పాత» స్టాండ్ : వంశధార నిర్వాసితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంను కోరారు. ఈ మేరకు వారు ఆయన చాంబర్‌లో ఆదివారం కలిసి నిర్వాసితుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నిర్వాసితులు పదకొండేళ్లుగా పునరావాసం కోసం న్యాయమైన నష్ట పరిహారం కోసం కోరుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని తెలిపారు. పోలవరంలో 2013 చట్టం ప్రకారం ప్యాకేజి అమలవుతుందని, అదే విధానం, ప్యాకేజీని వంశధార నిర్వాసితులకు అమలు చే యాలని కోరారు.
ఆ చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితునికి ఐదు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టివ్వాలని, మరో రూ.7లక్షలు ప్యాకేజి ఇవ్వాల్సిండగా, అందుకు విరుద్ధంగా స్థలానికి, ఇంటి నిర్మాణానికి, ప్యాకేజీకి మెుత్తానికి రూ.ఐదు లక్షలు ఇవ్వడం వల్ల నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పెరిగిన నిత్యావసరాలు, గృహ నిర్మాణ సరుకులకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని, దీనిపై ఇంకా ప్రభుత్వ జాప్యం చేయడం, వాయిదాలు వేయడం, తక్కువ ప్యాకేజీని అందజేయడం సరికాదని నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కోరిన చోట ఇవ్వాలని, ఇళ్లకు నష్టపరిహారం, వృత్తి ప్యాకేజీ అందజేయాలని కోరారు. నిర్వాసితుల పునరావాసం సమస్యలు ప్రభుత్వం పరిష్కరించిన తరువాతే పనులు చేయాలని కోరారు. నిర్వాసితులు కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చేయ పూనుకుంటే ధర్నాను భగ్నం చేయడం సరికాదని ఇది ప్రజల హక్కులను హరించడమేనని వారు లె లిపారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నేత టంకాల బాలక్రిష్ణ, కాంగ్రెస్ పార్టీ నేల రత్నల నర్సింహమూర్తి, సీపీఎం సీనియర్ నాయకులు చౌదరి తేజేశ్వరరావు, భవిరి కృష్ణమూర్తి, కొరాడ నారాయణరావు, తాండ్ర ప్రకాష్, తాండ్ర అరుణ తదితరులు ఉన్నారు.
కలెక్టరు తీరు సరికాదు..
వంశధార నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్‌ని కలిసిన అఖిలపక్షం నేతలలో కొందరిని చూసి పథకం జిల్లా కలెక్టర్ చులకనగా వ్యవహరించడం çపట్ల ఆ పార్టీల నేతలు అసంతృప్తిని వ్యక్తంచేశారు. జిల్లాకు పెద్దగా ఆయన వద్ద సమస్యలు తెలియజేయగా, వారికి పరిష్కారం చూపకుండా నాయకులపై చులకనగా మాట్లాడారని ఆది సరికాదని కమ్యూనిస్టు నేతలు అవేదన వ్యక్తం చేశారు.