జపాన్‌లో భారీ వరదలు
టోక్యో: జపాన్‌ను వరద ముంచెత్తుతోంది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కినుగవా నది ఉధృత రూపం దాల్చడంతో దేశ రాజధాని టోక్యోకు ఉత్తర ప్రాంతంలో ఉన్న జోసో నగరం వరద నీటిలో చిక్కుకుంది. బాధితులను మిలటరీ హెలికాప్టర్లలో సహాయక సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. సహాయం కోసం ప్రజలు మిద్దెలపైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే నగరాన్ని వరద నీరు ముంచెత్తినా ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. కాగా టోక్యో నగరంతో పాటు ఇబరాకీ, టోచిగీ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణమండల తుపాను ‘ఇటాయి’ కారణంగా వర్షాలు పడుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ సర్వీసును పాక్షికంగా నిలిపేశారు. తుపానులో 15 మంది గాయపడ్డారని, అందులో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.