న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి వరద ఉధృతమైంది. దీంతో ఒక నదిలోని ప్లాస్టిక్ మొత్తం అక్కడున్న బ్రిడ్జి మీద పేరుకుపోవడంతో ఆ చెత్తనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఐ.ఎఫ్.ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే బాగా వైరల్ అయ్యి లక్షల మందికి చేరింది.
కొద్దిరోజులుగా వర్షాలతోనూ, వరదలతోనూ ఉత్తరాది మొత్తం అతలాకుతలమైంది. కొన్ని ప్రాంతాల్లో గతమెన్నడూ లేనంత భారీగా వర్షాలు పడగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉధృతంగా వరదలు కూడా వచ్చాయి. ఈ వరదల్లో మనుషులు నదుల్లో పారేసిన చెత్త మొత్తం తిరిగి భూమి మీదకు చేరింది.
అలా ప్లాస్టిక్ చెత్త చేరిన ఒక బ్రిడ్జిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అక్కడి ఫారెస్టు అధికారి. దీనికి అందరినీ ఆలోచింపజేసే వ్యాఖ్యను జోడించి "ప్రకృతి -1, మనిషి-0.. మనం ఏదైతే ఇచ్చామో అది మొత్తం తిరిగి వచ్చేసింది.." అని రాశారు. నడవటానికి కూడా వీలు లేకుండా ఉన్న ఈ బ్రిడ్జి వీడియోకి నెటిజనుల నుంచి విశేష స్పందన తోపాటు వ్యంగ్యమైన కామెంట్లు కూడా వచ్చాయి. ప్రకృతి ఎప్పుడూ మనుషుల ఋణం ఉంచుకోదని, ఎప్పుడు లెక్క అప్పుడే సరిచేస్తుందని.. ఎప్పటికైనా మనిషిపై ప్రకృతిదే పైచేయని రాశారు.
Nature - 1, Humans - 0.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 11, 2023
River has thrown all the trash back at us. Received as forward. pic.twitter.com/wHgIhuPTCL
ఇది కూడా చదవండి: మహిళని ఎత్తి అవతలకు విసిరేసిన బౌన్సర్లు..
Comments
Please login to add a commentAdd a comment