స్పెయిన్ రాజ దంపతులకు నిరసనల సెగ
గుడ్లు, బురద విసిరి, దూషించిన వాలెన్సియా ప్రజలు
వాలెన్సియా: ఇటీవలి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వాలెన్సియా నగరంలో స్పెయిన్ రాజ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం వరద బాధిత ప్రాంతంలో పర్యటనకు వచి్చన రాజు ఫిలిప్ పైకి వరద బాధితులు బురద విసురుతూ దూషించారు. వాలెన్సియా శివారులోని పైపోరా్టకు చేరుకున్న సమయంలో రాజు వెంట ఉన్న ప్రభుత్వాధికారులు స్థానికులతో మాట్లాడుతుండగా, కొందరు బిగ్గరగా ‘గెటౌట్! గెటౌట్!, కిల్లర్స్!’అంటూ కేకలు వేశారు. రాచకుటుంబీకులు, అధికారులపైకి గుడ్లు, బురద విసిరేందుకు ప్రయతి్నంచగా రక్షక సిబ్బంది గొడుగులతో వారిని కాపాడారు.
పోలీసులు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. ఈ సమయంలో కింగ్ ప్రశాంతంగా బాధితులతో సంభాíÙంచేందుకు ప్రయతి్నంచారు. ఓ వ్యక్తి ఆయన భుజంపై తల ఆనించి, రోదించారు. రాజు వెంట రాణి లెటిజియా, వాలెన్సియా ప్రాంత ప్రెసిడెంట్ కార్లో మజోన్ ఉన్నా రు. గ్లవుజులతోపాటు ముంజేతిపై పడిన బురదతోనే రాణి స్థానికులతో మాట్లాడారు. ప్రధాని పెడ్రో సాంచెజ్ రాజు వెంట ఉన్నదీ లేనిదీ తెలియరాలేదు. ఇటీవలి భీకర వరదల్లో 200మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలమవ్వడం వల్లే ఇంతటి స్థాయిలో నష్టం జరిగిందని జనం ఆగ్రహంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment