rain areas
-
కిల్లర్స్.. గెటౌట్!
వాలెన్సియా: ఇటీవలి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వాలెన్సియా నగరంలో స్పెయిన్ రాజ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం వరద బాధిత ప్రాంతంలో పర్యటనకు వచి్చన రాజు ఫిలిప్ పైకి వరద బాధితులు బురద విసురుతూ దూషించారు. వాలెన్సియా శివారులోని పైపోరా్టకు చేరుకున్న సమయంలో రాజు వెంట ఉన్న ప్రభుత్వాధికారులు స్థానికులతో మాట్లాడుతుండగా, కొందరు బిగ్గరగా ‘గెటౌట్! గెటౌట్!, కిల్లర్స్!’అంటూ కేకలు వేశారు. రాచకుటుంబీకులు, అధికారులపైకి గుడ్లు, బురద విసిరేందుకు ప్రయతి్నంచగా రక్షక సిబ్బంది గొడుగులతో వారిని కాపాడారు. పోలీసులు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. ఈ సమయంలో కింగ్ ప్రశాంతంగా బాధితులతో సంభాíÙంచేందుకు ప్రయతి్నంచారు. ఓ వ్యక్తి ఆయన భుజంపై తల ఆనించి, రోదించారు. రాజు వెంట రాణి లెటిజియా, వాలెన్సియా ప్రాంత ప్రెసిడెంట్ కార్లో మజోన్ ఉన్నా రు. గ్లవుజులతోపాటు ముంజేతిపై పడిన బురదతోనే రాణి స్థానికులతో మాట్లాడారు. ప్రధాని పెడ్రో సాంచెజ్ రాజు వెంట ఉన్నదీ లేనిదీ తెలియరాలేదు. ఇటీవలి భీకర వరదల్లో 200మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలమవ్వడం వల్లే ఇంతటి స్థాయిలో నష్టం జరిగిందని జనం ఆగ్రహంతో ఉన్నారు. -
చూసేందుకు వచ్చాను.. రాజకీయాలకు కాదు
-
'చూసేందుకు వచ్చాను.. రాజకీయాలకు కాదు'
♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాహుల్ సూచన ♦ తమిళనాడు, పుదుచ్చేరి వరద బాధితులకు పరామర్శ చెన్నై, సాక్షి ప్రతినిధి: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలు సర్వం కోల్పోయారని, సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. భారీ వ ర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మంగళవారం రాహుల్ పర్యటించారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి కడలూరు, కారైక్కాల్ జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించి వస్తు సామాగ్రిని అందజేశారు. సాయంత్రం చెన్నైకి చేరుకుని ముడిచ్చూరు, మణిమంగళంలలో వరదబాధితులను కలుసుకున్నారు. విల్లివాక్కంలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. అనంతరం విలేకర్లతో రాహుల్ మాట్లాడుతూ.. సహాయ కార్యక్రమాల్లో రాజకీయాలు తగవని పేర్కొన్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదన్న ఆయన సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. తక్కువ సమయంలో వీలైనంత మందికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. -
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
యలమంచిలి, న్యూస్‌లైన్ : అధిక వర్షాలతో ముంపునకు గురైన వరిచేలను ఆదివారం కలెక్టర్ సిద్ధార్థజైన్ పరిశీలించారు. తొలుత కాంభొట్లపాలెం, గుంపర్రు, చింతదిబ్బలో మునిగిన వరి పొలాలను పరిశీలించిన కలెక్టర్ అనంతరం వడ్డిలంక స్లూయిజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు డ్రెయిన్ తవ్వారు కానీ సబ్ డ్రెయిన్లకు షట్టర్లు పెట్టలేదని ఫిర్యాదు చేశారు. షట్టర్లు లేకపోవడం వల్ల డ్రెయిన్‌లో నీరు ఎదురొచ్చి చేలను ముంచుతుందని చెప్పారు. వడ్డిలంక స్లూయిజ్ తలుపులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పారు. రైతుల ఫిర్యాదులను విన్న కలెక్టర్ డీఆర్సీ సమావేశంలో సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. ఆయన వెంట ఎంపీ కనుమూరు బాపిరాజు, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, ఏఎంసీ చైర్మన్ ఉన్నమట్ల కబర్థి, సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు కడలి గోపాలరావు, మాజీ ఎంపీపీ చిలుకూరి బాపిరాజు, సర్పంచ్‌లు చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, సత్తినీడి నరసింహరాజా, బుంగా వెంకట్రావు, పాలపర్తి కుమారరత్నం, పూరిళ్ల సత్యవతి, గోడి అశోక్‌కుమార్ ఉన్నారు.