ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన | rain areas the collector Tour in YALAMANCHILI | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

Published Mon, Oct 28 2013 3:17 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

rain areas  the collector Tour in YALAMANCHILI

 యలమంచిలి, న్యూస్‌లైన్ : అధిక వర్షాలతో ముంపునకు గురైన వరిచేలను ఆదివారం కలెక్టర్ సిద్ధార్థజైన్ పరిశీలించారు. తొలుత కాంభొట్లపాలెం, గుంపర్రు, చింతదిబ్బలో మునిగిన వరి పొలాలను పరిశీలించిన కలెక్టర్ అనంతరం వడ్డిలంక స్లూయిజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు డ్రెయిన్ తవ్వారు కానీ సబ్ డ్రెయిన్‌లకు షట్టర్లు పెట్టలేదని ఫిర్యాదు చేశారు. షట్టర్లు లేకపోవడం వల్ల డ్రెయిన్‌లో నీరు ఎదురొచ్చి చేలను ముంచుతుందని చెప్పారు.
 
 వడ్డిలంక స్లూయిజ్ తలుపులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పారు. రైతుల ఫిర్యాదులను విన్న కలెక్టర్ డీఆర్‌సీ సమావేశంలో సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. ఆయన వెంట ఎంపీ కనుమూరు బాపిరాజు, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, ఏఎంసీ చైర్మన్ ఉన్నమట్ల కబర్థి, సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షుడు కడలి గోపాలరావు, మాజీ ఎంపీపీ చిలుకూరి బాపిరాజు, సర్పంచ్‌లు చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, సత్తినీడి నరసింహరాజా, బుంగా వెంకట్రావు, పాలపర్తి కుమారరత్నం, పూరిళ్ల సత్యవతి, గోడి అశోక్‌కుమార్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement