సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ రాజకీయాల్లో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం, కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
తాజాగా నియోజకవర్గంలోని చండూరులో మరోసారి పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. నేడే విడుదల.. షా సమర్పించు రూ. 18వేల కోట్లు.. కోవర్టురెడ్డి అంటూ పోస్టర్లు వెలశాయి. కాగా, ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికిస్తుండగా బీజేపీ కార్యకర్త గమినించారు. దీంతో, వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కార్లలో దుండగులు పరారైనట్టు బీజేపీ కార్యకర్త తెలిపారు. దీంతో, బీజేపీ వ్యతిరేక పోస్టర్లు ఎవరు అంటించారు అనే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికల వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్‌ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్.. గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ‘‘అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. నాకు సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక దృష్ట్యా నాతో సంప్రదింపులు జరపలేదు. పార్టీకి నా అవసరం లేదని భావిస్తున్నా. నాకు అవమానం జరుగుతుందని తెలిసి కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్‌ను కలవాలంటే ఇప్పుడు తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు తాను మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందకు సిద్ధంగా ఉన్నానని కూడా నర్సయ్య గౌడ్ కామెంట్స్ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment