డిసెంబర్‌ 7న నిండు చంద్రుడు వస్తాడు: బూర | Bura narsaiah goud commented over congress | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 7న నిండు చంద్రుడు వస్తాడు: బూర

Published Mon, Oct 8 2018 1:21 AM | Last Updated on Mon, Oct 8 2018 1:21 AM

Bura narsaiah goud commented over congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది డిసెంబర్‌ 7న అమావాస్య రోజున నిండు చంద్రుడు ఉదయిస్తాడని, కేసీఆర్‌ తెలంగాణకు మరోసారి సీఎం అవుతారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత డీకే అరుణ ఇరువురూ మెమొరీలాస్‌తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌వి దింపుడుకళ్లెం ఆశలని, ఆ పార్టీ నేతలంతా పదవులు ఉన్నప్పు డు ఒకలా.. పదవులు లేనప్పుడు ఒకలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యం కావడానికి తీవ్ర యత్నాలు చేశారని, కాంగ్రెస్‌ నేతలు ప్రజాక్షేత్రాన్ని వదిలి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఓటర్ల జాబితాపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మర్రి శశిధర్‌రెడ్డి, అంతర్జాతీయ కోర్టుకు పోతారేమో అని ఎద్దేవా చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement