భువనగిరి : హైదరాబాద్- విజయవాడ మధ్యన కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీబూరనర్సయ్యగౌడ్ రైల్వే శాఖకు సూచించారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ వాత్సవతో జరిగిన సమావేశంలో ఎంపీ ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం విజయవాడకు వరంగల్, ఖమ్మం మీదుగా రైలు మార్గం ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి ఉంది. ఇది కాచిగూడ చౌటుప్పల్, చిట్యాల సూర్యాపేట, కోదాడ, నందిగామ, జగ్గయ్యపేట మీదుగా వెళ్తుంది. జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతం నల్లగొండ జిల్లాలో అధికంగా ఉంది. హైవే వెంట రైలు మార్గం వస్తే జిల్లాలో మరో రైలు మార్గం రావడం ద్వారా సూర్యాపేట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. త ద్వారా ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్- ఖాజీపేట- విజయవాడ మార్గంలో 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుం ది. అలాగే సికింద్రాబాద్ - ఖాజీపేట మార్గంలో అత్యాధునిక బుల్లెట్ రైలును ప్రవేశపెట్టాలని కోరారు.
ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా
రైల్వేకు అధిక ఆదాయం తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్నా నిధులు మాత్రం ఆమేరకు రావడం లేదు. ఇక నుంచి మన వాటా ప్రకారం నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోర తాం. కొత్త ప్రతిపాదనల్లో హైదరాబాద్- విజయవాడ కొత్త రైలు మార్గం వేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులన్నింటికీ బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించి పూర్తి చేయాలని, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకు విన్నవించాం. కేంద్రం దృష్టికి కూడా ఈ ప్రతిపాదనలను తీసుకెళ్తా.
-డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, ఎంపీ, భువనగిరి
రాయగిరి స్టేషన్ పేరు మార్చాలి
రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదగిరి రైల్వే స్టేషన్‌గా మార్చాలి.
రాయగిరి రైల్వే స్టేషన్ స్థాయిని పెంచి మాడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలి.
ఇక్కడి నుంచి వెళ్లే అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రాయగిరి స్టేషన్‌లో ఆపాలి.
ఎంఎంటీఎస్ రైళ్లను రాయగిరి వరకు కొనసాగించాలి.
భువనగిరి వరకు ప్రతిపాదనలో ఉన్న మూడో లైను పనులకు నిధులు మంజూరు చేయాలి. దాన్ని వరంగల్ వరకు పొడిగించాలి. భవిష్యత్‌లో బుల్లెట్ రైళ్లను ఏర్పాటకు కృషి చేయాలి.
వ్యాపార అభివృద్ధికి భువనగిరిలో కంటైనర్ కార్బో ఏర్పాటు చేయాలి.
బీబీనగర్- నడికుడి మార్గంలో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తి చేయాలి.
హైదరాబాద్ టు విజయవాడ
Published Tue, Jan 20 2015 3:33 AM | Last Updated on Thu, Aug 9 2018 5:32 PM
Advertisement
Advertisement