పడో ఔర్ ఆగే బడో : ఎంపీ | pado Our agey bado: MP | Sakshi
Sakshi News home page

పడో ఔర్ ఆగే బడో : ఎంపీ

Published Wed, Nov 12 2014 5:16 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

పడో ఔర్ ఆగే బడో : ఎంపీ - Sakshi

పడో ఔర్ ఆగే బడో : ఎంపీ

నల్లగొండ రూరల్ : పడో ఔర్ ఆగే బడో(చదువుకోండి.. ముందుకు దూసుకెళ్లండి) అని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ ముస్లింమైనార్టీలకు సూచిం చారు. మంగళవారం నల్లగొండలోని స్టార్‌ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతి సభలో ఆయన మాట్లాడారు.  బాగా చదువుకుంటే కలెక్టర్, ఇంజినీర్, డాక్టర్లు కావచ్చని.. బాగా ఆడితే సానియా మీర్జాలా మంచి క్రీడాకారులుగా ఎదగవచ్చన్నారు. అమ్మాయి చదివితే ఇంటికి వెలుగని, అబ్బాయి చదివితే ఒక్కరికే వెలుగన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.

ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు. వక్ఫ్‌భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మౌలనా అబుల్ కలాం ఆజాద్ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం పనిచేశారన్నారు.  కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ  మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కాలో జన్మించినా భారత స్వాతంత్య్ర పోరాటంలో పనిచేశారన్నారు. మతపరంగా భారత్‌ను విడదీయం ఇష్టపడని వ్యక్తి అని పేర్కొన్నారు. అతని మరణానంతరం కూడా ప్రభుత్వం భారత రత్న ఇచ్చిందని తెలిపారు.

ముస్లిం మైనార్టీల కోసం ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులు, పలువురు ముస్లిం మైనార్టీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్రీరాములు, ఏడీ సిరాజుల్లా, ఆర్డీఓ జహీర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, ఫయీజ్‌ఖాన్, అఫాన్‌అలీ, మొయినుద్దీన్, ఫరీద్, ఖాజా ఖుత్బుద్దీన్, అహ్మద్ కలీం, డీఈఓ విశ్వనాథరావు, జమాల్, జియాఉద్దీన్, సలీం, ముంతాజ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement