Star-function hall
-
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
► మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి ►వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఉట్నూర్ : ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేయూలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని, పార్టీ బలోపేతానికి కలిసి వచ్చే వారందరితో పని చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపేతంపై అధి నాయకత్వం దృష్టి సారించిందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పార్టీ పటిష్టత కోసం నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల ఒకటి వరకు మండల కమిటీలు, పదో తేదీ వరకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసేలా మండల నాయకత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. నార్నూర్ మండలంలో కొత్తగా ఏర్పడిన గాదిగూడ మండల కమిటీ ఎన్నిక బాధ్యతను నార్నూర్ మండల పార్టీ అధ్యక్షుడికి, ఖానాపూర్ నియోజకవర్గంలో కమిటీల నియూమక బాధ్యతను పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తొడసం నాగోరావ్కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయూల్లో మార్పులు యువత వల్లే సాధ్యమవుతుందని, పార్టీ అధినేత వైఎస్.జగన్ యువతకు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తిలక్‌రావ్, కార్యదర్శి రమేశ్, భోథ్ నియోజకవర్గం కార్యనిర్వాహక సభ్యుడు ప్రవీణ్‌నాయక్, నార్నూర్, ఉట్నూర్ మండలాల అధ్యక్షులు యూసుఫ్‌ఖాన్, ముజాయిద్, ఉట్నూర్ మండల ప్రధాన కార్యదర్శి గణేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు హకీమ్, యూత్ అధ్యక్షుడు మోసిన్, రాష్ట్ర, జిల్లా నాయకులు షెక్ జిలానీ, హారీఫ్, సందీప్‌కుమార్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు. -
పడో ఔర్ ఆగే బడో : ఎంపీ
నల్లగొండ రూరల్ : పడో ఔర్ ఆగే బడో(చదువుకోండి.. ముందుకు దూసుకెళ్లండి) అని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ ముస్లింమైనార్టీలకు సూచిం చారు. మంగళవారం నల్లగొండలోని స్టార్‌ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతి సభలో ఆయన మాట్లాడారు. బాగా చదువుకుంటే కలెక్టర్, ఇంజినీర్, డాక్టర్లు కావచ్చని.. బాగా ఆడితే సానియా మీర్జాలా మంచి క్రీడాకారులుగా ఎదగవచ్చన్నారు. అమ్మాయి చదివితే ఇంటికి వెలుగని, అబ్బాయి చదివితే ఒక్కరికే వెలుగన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు. వక్ఫ్‌భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మౌలనా అబుల్ కలాం ఆజాద్ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం పనిచేశారన్నారు. కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కాలో జన్మించినా భారత స్వాతంత్య్ర పోరాటంలో పనిచేశారన్నారు. మతపరంగా భారత్‌ను విడదీయం ఇష్టపడని వ్యక్తి అని పేర్కొన్నారు. అతని మరణానంతరం కూడా ప్రభుత్వం భారత రత్న ఇచ్చిందని తెలిపారు. ముస్లిం మైనార్టీల కోసం ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులు, పలువురు ముస్లిం మైనార్టీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్రీరాములు, ఏడీ సిరాజుల్లా, ఆర్డీఓ జహీర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, ఫయీజ్‌ఖాన్, అఫాన్‌అలీ, మొయినుద్దీన్, ఫరీద్, ఖాజా ఖుత్బుద్దీన్, అహ్మద్ కలీం, డీఈఓ విశ్వనాథరావు, జమాల్, జియాఉద్దీన్, సలీం, ముంతాజ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.