కోమటిరెడ్డి మాటలన్నీ అసత్యాలే | MP boora narsayya comments on MLA Komatireddy | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి మాటలన్నీ అసత్యాలే

Published Mon, Feb 20 2017 12:27 AM | Last Updated on Mon, Oct 29 2018 8:31 PM

కోమటిరెడ్డి మాటలన్నీ అసత్యాలే - Sakshi

కోమటిరెడ్డి మాటలన్నీ అసత్యాలే

ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కులవృత్తులకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ చేయూతనిస్తున్నారని, బీసీల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్నారని చెప్పారు.

కేసీఆర్‌ ప్రభుత్వం కులవృత్తులకు ఏం చేయలేదన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయ నకు వింతవ్యాధి వచ్చినట్లు ప్రవర్తిస్తు న్నా రని మండిపడ్డారు. కోమటిరెడ్డి బీసీలంద రికీ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. మత్స్యకార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసిందని, వీటి పెంపకంతో రూ. 4 వేల కోట్ల సంపద  సమకూరుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement