సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్దం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. కాగా, కేంద్రం విమర్శలు ఎక్కుపెట్టేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, రాజేందర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ పెట్టి కేంద్రాన్ని దూషించే స్థాయికి కేసీఆర్ దిగజారారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. కేంద్రం వసూలు చేసిన పన్నులలో 41 శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. ప్రజల డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీష్‌తో బహిరంగ చర్చకు సిద్ధం. కేసీఆర్‌కు దమ్ముంటే అప్పులు, కేటాయింపులను వెబ్‌సైట్‌లో పెట్టాలి అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment