సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రెండు పార్టీల నేతలు కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.ఇక, ప్రధాని మోదీ నిన్న(శనివారం) తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన సభల్లో మోదీ.. టీఆర్‌ఎస్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలనను అంతమొందిచాలని పిలుపునిచ్చారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని హామీ కూడా ఇచ్చారు. కాగా, మోదీ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
అయితే, ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. మంత్రి హరీష్ ట్విట్టర్ వేదికగా.. ‘ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ. దేశానికీ తెలంగాణకు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోడీ జీ. అంటూ కామెంట్స్ చేశారు.
ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ..దేశానికీ తెలంగాణ కు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోడీ జీ..
— Harish Rao Thanneeru (@trsharish) November 13, 2022
Comments
Please login to add a commentAdd a comment