20 ఏళ్లు టీఆర్‌ఎస్‌దే: హరీశ్
టీఆర్‌ఎస్ వార్షికోత్సవం సందర్భంగా 27న వరంగల్‌లో బహిరంగ సభ
సాక్షి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణలో మరో 20 ఏళ్లపాటు టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ నగరంలో నిర్వహిం చనున్న బహిరంగసభ ప్రదేశాన్ని మంత్రి హరీశ్‌రావు శనివారం పరిశీలించారు. బహి రంగసభ స్థలం వద్ద విలేకరులతో మాట్లా డారు. అనంతరం నగరంలో జరిగిన వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమం కీలక సమయంలో ఇదే చోట బహిరంగసభ నిర్వహించాం.
2010 డిసెంబర్ 16న వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డిపేటలో నిర్వ హించిన సభ ప్రపంచంలోనే అయిదో పెద్ద బహిరంగసభగా, దేశంలోనే అతిపెద్ద సభగా గుర్తింపు పొందింది. అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాంలింకన్ ఎన్నికైన అనంతరం నిర్వ హించిన సభ ప్రపంచంలో పెద్దది. స్వాతం త్య్రోద్యమ కాలంలో గాంధీ నాయకత్వంలో నిర్వహించిన దండి ఉప్పు సత్యాగ్రహం సభ రెండోది. పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో బహిష్కరణ తర్వాత... మళ్లీ పాకిస్తాన్‌కు చేరుకున్న సభ మూడోది. ఈజిప్టులో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరిగిన సభ నాలుగోది. తెలంగాణ రాష్ట్ర సాధనకు వరం గల్‌లో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన సభ ప్రపంచంలో అయిదో పెద్ద సభ. నాటి సభ ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు మళ్లీ ఇక్కడే సభ నిర్వహిస్తున్నాం. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగసభ గత చరిత్రను బద్దలు కొట్టేలా ఉండాలి. దీని కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి.’ అని హరీశ్‌రావు అన్నారు.
సభ్యత్వాలు పూర్తి చేయండి: కడియం
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి కోరారు. సభ్యత్వ నమోదును వేగంగా పూర్తి చేసి... పుస్తకాలు, రుసుము మొత్తాన్ని తెలంగాణ భవన్‌లో అందించాలని సూచించారు. తర్వాత మహబూబాబాద్ జిల్లాలో కంబాలపల్లి పెద్ద చెరువు, అనంతారం మైసమ్మ చెరువు అభివృద్ధి పనులకు శనివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.