Eatala Rajendar
-
రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల, అనుచరుల దాడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తెలియక కబ్జా స్థలాలను కొంటున్నారు. పేదల భూములకు కబ్జా చేయడం నేరం. పేదల భూములను కబ్జా చేసి వ్యాపారం చేసుకుంటున్న బ్రోకర్లు. పేదల భూములను కబ్జా చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. బ్రోకర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ. అనేక పేదల కాలనీలకు రూపశిల్పి బీజేపీనే. పేదలు కొనుక్కున్న భూములకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడదు. అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను. తప్పు భూములు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు బ్రోకర్లది. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. చిన్న జిల్లాలు ఏర్పాటు చెస్తే పాలన సులభం అవుతుంది. కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం. కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమిషనర్‌కి మనకు కలవడానికి సమయం ఉండదు కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
రేవంత్‌కు ఈటల సవాల్.. ముక్కు నేలకు రాస్తా అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీగా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్దాం. ప్రజలు రేవంత్‌ను శభాష్ అంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీంతో.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు రాజకీయం మారిపోయింది.మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైరం ఉంటే మూసీ బాధితుల వద్దకు ఇద్దరం కలిసే వెళ్దాం. సెక్యూరిటీ లేకుండా అక్కడికి పోదాం. మూసీ పరివాహక ప్రాంత ప్రజల రేవంత్‌ను శభాష్ అంటే నేను అక్కడే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతాను. అలాగే, రాజకీయ సన్యాసం తీసుకుంటా. రేవంత్.. ప్రజల చేత ఇంతలా తిట్టించుకున్న నాయకుడు ఎవరూ లేరు.గర్భిణీ అని చూడకుండా ఇళ్లు ఖాళీ చేయమని బెదిరించారు. కడుపు మండి మాట్లాడిన పేదలను ఐదు వేలకు అమ్ముడుపోయారని రేవంత్ అన్నారు. అద్దాల మేడలో కూర్చొన్న రేవంత్‌కు అధికారం నెత్తికెక్కింది. మూసీ ప్రక్షాళన రోడ్ మ్యాప్ ఏంటీ ? డీపీఆర్ ఏంటీ?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులే లేవు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైందని రేవంత్ చెబుతున్నారు. మరి.. లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుండి తెస్తున్నారు. కేసీఆర్ కూడా గతంలో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రేవంత్ అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. మోసం, అబద్ధానికి మారుపేరు రేవంత్’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
ఈటల Vs విజయశాంతి: ట్విట్టర్లో పొలిటికల్ పంచాయితీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ నేతల మధ్య మరోసారి కోల్డ్‌వార్ బహిర్గతమైంది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ మహిళా నేత విజయశాంతి మధ్య విభేదాలు ట్విట్టర్ వేదికగా బయటకు వచ్చాయి. కొద్దిరోజులుగా ఈటలను టార్గెట్ చేసి విజయశాంతి పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయశాంతి మరోసారి ఈటలపై సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో చేరికల కమిటీతో ఇప్పటి వరకు విజయాలు రాలేదని విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలు చేరికల కమిటీతో రాలేదని ట్విట్టర్లో విజయశాంతి ప్రస్తావించారు. బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలేనని అన్నారు. బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్వశ్రేణుల పోరాటాలు మాత్రమే బీజేపీని గెలిపిస్తున్నాయని తెలిపారు. నాటి ఆ దుబ్బాక, జిహెచ్ఎంసి, నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా...! చేరికల కమిటీతో వచ్చాయా..? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా...! విశ్లేషించుకోవాలి.. — VIJAYASHANTHI (@vijayashanthi_m) May 30, 2023 మరోవైపు.. గతంలో అన్ని పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఈటల రాజేందర్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈటలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో కోవర్ట్‌లు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పొలిటికల్ పంచాయితీ ముదిరింది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్ లో ఈటల చెప్పారు, చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ..... pic.twitter.com/G8ulVzUyTf — VIJAYASHANTHI (@vijayashanthi_m) May 30, 2023 ఇక, అంతకుముందు మంత్రి హరీష్ రావు.. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్‌లో ఈటల చెప్పారు అని కామెంట్స్ చేశారు. దీనిపై విజయశాంతి స్పందించారు. హరీష్ కామెంట్స్‌పై ట్విట్టర్లో విజయశాంతి పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. ‘చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు.. చేరికల కమిటీ పేరు చెబుతూ, చిట్చాట్లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం నిలవదు. ఇది హరీష్‌రావుకు తెలియంది కాదు’ అంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: కవిత అసలైన పెట్టుబడిదారు! -
పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. ఈటలకు బిగ్ షాక్!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో పేపర్ లీకేజీల వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పలు ట్విస్టుల మధ్య బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చారు పోలీసులు. వివరాల ప్రకారం.. పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ప్రశాంత్ అనే వ్యక్తి పేపర్‌ను మొదట ఈటలకు వాట్సాప్‌లో పంపించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈటలకు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, బండి సంజయ్‌కు పేపర్ పంపే కంటే ముందే.. ఈటలకు ప్రశాంత్ పేపర్ పంపించాడని అన్నారు. అంతకుముందు.. ఈటలకు కూడా ఈ పేపర్లను పంపించారని వరంగల్ సీపీ వ్యాఖ్యానించారు. -
కమలంతో టచ్‌లోకి ‘హస్తం’ నేతలు!.. 20 మంది జంప్?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ముఖ్యనేతలతో పలువురు కాంగ్రెస్ నాయకులు టచ్‌లోకి వచి్చనట్టు విశ్వసనీయ సమాచారం. వీరిలో మాజీ మంత్రులు మొదలుకుని మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరస్థాయిల నాయకులు 15 నుంచి 20 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలతో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు సాగించినట్టు తెలుస్తోంది. పలువురు కాంగ్రెస్ నాయకులకు దగ్గరగా ఉన్నవారు, వారి అనుచరులు ఈటలతో ఆయన నివాసంలో భేటీ అయ్యి సంబంధిత నాయకులతో ఫోన్లో మాట్లాడించినట్టు సమాచారం. బీజేపీ చేరికల కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా పలువురు కాంగ్రెస్ నేతలు సంప్రదించినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగిన మాజీ మంత్రులు డీకే అరుణ, మర్రిశశిధర్‌రెడ్డి కూడా చేరికలపై హస్తం పార్టీ నేతలతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. టికెట్‌పై దక్కని హామీ బీజేపీలో చేరే వారికి మాత్రం టికెట్ల కేటాయింపుపై అటు సంజయ్, ఈటల, కొండా ఇతర నేతలు ఎవరూ కూడా ఎలాంటి హామీనివ్వడం లేదు. పారీ్టలో చేరాక సంబంధిత నియోజకవర్గంలో పలుకుబడి, రాజకీయ ప్రాబల్యం, ప్రజల్లో మద్దతు వంటి అంశాలపై పార్టీపరంగా చేసే సర్వే ఆధారంగానే బలమైన అభ్యరి్థకి టికెట్ ఇస్తామని బీజేపీ నాయకత్వం స్పష్టంచేస్తోంది. ఇదిలాఉంటే తనతో సంప్రదింపులు జరిపిన నేతలు, వారికి సంబంధించిన సమాచారాన్ని ఈటల రాజేందర్ సోమవారం రాత్రి పార్టీ జాతీయకార్యదర్శి, రాష్ట్రపార్టీ సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్‌కు తెలియజేసినట్టు పారీ్టవర్గాల సమాచారం. జాతీయ, రాష్ట్ర నాయకత్వాల కు ఆయా పేర్లను తెలియజేసి తదుపరి చేపట్టే కార్యాచరణకు గ్రీన్ సిగ్నల్ కోసం రాష్ట్ర పార్టీ నేతలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి, అసంతృప్త స్వరాలు ఒక్కసారిగా పెరగడంతోపాటు అధికార టీఆర్ఎస్లోనూ తొలిసారిగా ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డిపై బహిరంగ తిరుగుబాటును ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ప్రకటనలు చేయడం.. రేవంత్‌కు అనుకూలంగా ఆయన వర్గం నేతలు ఆయా కమిటీలకు రాజీనామా చేయడం వంటి పరిణామాలను బీజేపీ నాయకత్వం సునిశితంగా గమనిస్తోంది. ఆ మంత్రి వద్దు ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒక టీఆర్ఎస్ నేతను చేర్చుకునేందుకు బీజేపీ నేతలు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివాదాస్పద మంత్రిగా ముద్రపడిన ఆ నేతను చేర్చుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల తన దుందుడుకు వైఖరితో విమర్శల పాలైన ఆ మంత్రిని చేర్చుకుంటే బీజేపీ బెదిరింపులతో ఈ కార్యక్రమం చేస్తోందనే ప్రచారాన్ని టీఆర్ఎస్ చేసే అవకాశమున్నట్లు అంచనా వేస్తోంది. ఇది తదుపరి టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ముఖ్యనేతలను చేర్చుకోవడానికి ప్రతిబంధకంగా మారొచ్చునని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ మంత్రితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు, ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నేతలను సంప్రదించినట్టు పారీ్టవర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ముగ్గురు దాకా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే విషయంపై ప్రాథమిక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. -
పొలిటికల్ హీట్.. హరీష్ రావుకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. కాగా, కేంద్రం విమర్శలు ఎక్కుపెట్టేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, రాజేందర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ పెట్టి కేంద్రాన్ని దూషించే స్థాయికి కేసీఆర్ దిగజారారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. కేంద్రం వసూలు చేసిన పన్నులలో 41 శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. ప్రజల డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీష్‌తో బహిరంగ చర్చకు సిద్ధం. కేసీఆర్‌కు దమ్ముంటే అప్పులు, కేటాయింపులను వెబ్సైట్లో పెట్టాలి అని సవాల్ విసిరారు. -
సంచలనాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇప్పుడు అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు, ఎమ్మెల్యేల ఎరపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) గురించే జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో ప్రతీరోజూ పతాకశీర్షికన కథనాలు వస్తుండగా.. ఈ వ్యవహారాలన్నీ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ.. వీరు విచారిస్తున్న ప్రతీ కేసులోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ► ఉద్యమకాలం నుంచి రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర అవతరణ అనంతరం కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్రంలో టీఆర్ఎస్–బీజేపీ మధ్య రాజకీయవైరం పతాకస్థాయికి చేరడం, కేంద్ర దర్యాప్తు సంస్థలు జోరు పెంచడం, రాష్ట్ర దర్యాప్తు బృందాలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ వ్యవహారంలోనూ కరీంనగర్ వ్యక్తులే కీలకంగా మారుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ► ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ సంస్థలపై ఈడీ, ఐటీ ఆకస్మిక దాడులు నిర్వహించడం.. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అదే సమయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పార్టీలు మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలోనూ ఉమ్మడి జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ రమణకు ఈడీ సంస్థ నోటీసులు ఇవ్వడం.. శుక్రవారం ఆయన విచారణకు హాజరవడం జరిగాయి. తొలుత ఎన్ఐఏ.. నిజామాబాద్‌లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఉ గ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థలో క్రియాశీలక సభ్యుడు జగిత్యాల వాసిగా గుర్తించా రు. ఈ క్రమంలో సెప్టెంబరు 19వ తేదీన దేశవ్యాప్తంగా సదరు సంస్థపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో సదరు జగిత్యాల వాసిని కరీంనగర్‌లోని నాఖా చౌరస్తా సమీపంలోని ఓ ఇంటి నుంచి అరె స్టు చేసి తీసుకెళ్లారు. ఆ రోజు తెల్లవారుజామున కరీంనగర్ పట్టణంలో పలువురి అనుమానితుల ఇళ్లపైనా ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపి, అనుమానాస్పద ఫైళ్లను తీసుకెళ్లారని సమాచారం. జగిత్యాల, కరీంనగర్లో ఉగ్ర సంస్థతో సంబంధాలు బయటపడటం అప్పట్లో కలకలం రేపింది. ఈడీ, ఐటీ.. ఆకస్మిక సోదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి తరువాత అతిపెద్దది గ్రానైట్ పరిశ్రమ. ఈ క్రమంలో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు విదేశాలకు తరలించారన్న ఆరోపణలపై పలు కంపెనీలపై ఈ నెల 9వ తేదీన తరలించారన్న ఫిర్యాదులతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. రెండురోజులపాటు జరిగిన ఈ సోదాల్లో దాదాపు 10కిపైగా కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ► చీకోటి ప్రవీణ్ కేసినో కేసులోనూ రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. తొలుత ఈ కేసుకు కరీంనగర్‌తో సంబంధాలు లేవనుకున్నప్పటికీ.. తాజాగా ఎమ్మెల్సీ రమణకు నోటీసులు జారీ చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ► మరోవైపు ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కాంలోనూ పలువురు సిరిసిల్ల, కరీంనగర్ పట్టణవాసుల ప్రమేయం ఉందన్న ప్రచారం అప్పుడే మొదలైంది. కరీంనగర్లో ఇటీవల జరిగిన ఈడీ దాడుల సమయంలోనూ తొలుత లిక్కర్ స్కాంలో సోదాలుగానే ప్రచారం జరిగాయి. ► మరోవైపు అధికార పార్టీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’ కూడా జాతీయస్థాయిలో చర్చ లేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ పార్టీపై స్వయంగా సీఎం చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు కరీంనగర్‌తో ఉన్న లింకులు బయటపెట్టారు. కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు విమాన టికెట్లు బుక్ చేసిన ఆరోపణలపై సిట్ అధికారులు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేయడంతో మరోసారి కరీంనగర్ వార్తల్లోకెక్కింది. రాజకీయ సమరానికీ ఇక్కడే ఆజ్యం..! కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ–టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు బహిరంగంగానే పరస్పర ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీస్థాయి వరకు ఇరు పార్టీ నాయకులు తమకు ఏమాత్రం చిన్న అవకాశం లభించినా ప్రత్యర్థి వర్గాన్ని ఆరోపణలతో చీల్చిచెండాడుతున్నారు. ఈ సమరానికి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే వేదికగా నిలవడం విశేషం. ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేసే క్రమంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి చేసే ఎవరినీ వదలమంటూ హెచ్చరికలు జారీచేశారు. ► మరోవైపు సోషల్‌మీడియాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల విషయంలో పూటకో ప్రచారం వెలుగుచూస్తోంది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై, హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి సొంతగూటికి వెళ్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ‘ఘర్‌వాపసీ’ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఈటల ఖండించారు. ► శుక్రవారం ఉదయం నుంచి మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ పుట్ట మధు పార్టీ మారుతున్నారన్న సందేశం వైరల్‌గా మారింది. టీవీలు, వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పుట్ట మధు హడావిడిగా అక్కడే విలేకరుల సమావేశం పెట్టి ప్రచారాన్ని ఖండించారు. అంతకుముందు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన ఆయన తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. తాను సొంత పనుల మీద నియోజకవర్గం వీడిన ప్రతీసారి ప్రతిపక్షాలు రాస్తున్న ప్రేమలేఖలు చదివి నవ్వుకుంటున్నానని చమత్కరించారు. (క్లిక్: ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?) -
ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమిపై కాషాయ పార్టీ నేతలు అధికార టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం గులాబీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, ఈటల రాజేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు చావుతప్పి కన్నులొట్టపోయినట్టుంది. కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ సత్తా చాటింది. ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకముందే మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో మోహరించారు. ఓటమి భయంతోనే మాపై దాడులకు పాల్పడ్డారు. హుజురాబాద్‌లోనూ నన్ను ఓడించేందుకు అనేక కుట్రలు చేశారు. ఎనిమిదేళ్లుగా సీపీఎం, సీపీఐ నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఓటమి భయంతోనే కమ్యూనిస్టులను మచ్చిక చేసుకున్నారు. కేసీఆర్ తీరు అందితే జుట్టు లేదంటే కాళ్లు అనే చందంగా ఉంటుంది. వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచింది. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టారు. అధికార పార్టీకి పోలీసులు కూడా సహాకరించారు. టీఆర్ఎస్ను గెలిపించడానికి వాళ్లు కృషిచేశారు. ఇంత చేసినా స్వల్ప మెజారీటీనే వచ్చింది’ అని ఎద్దేవా చేశారు. -
మునుగోడు: ఈటల అత్తగారి గ్రామంలో బీజేపీకి బూస్ట్.. దెబ్బకొట్టిన ఆ రెండు గుర్తులు!
సాక్షి, మునుగోడు: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పూర్తి స్థాయి ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు 11వ రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. 11వ రౌండ్ వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక, మునుగోడు నియోజకవర్గంలోని ఈటల రాజేందర్ అత్తగారి గ్రామమైన పలివేల గ్రామంలో బీజీపీ.. టీఆర్ఎస్ పార్టీపై 207 ఓట్ల లీడ్ సాధించింది. ఇక, ఈ గ్రామానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఓట్ల లెక్కింపులో ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ సత్తా చాటారు. ముఖ్యమైన పార్టీలకు భారీ షాకిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో ఈవీఎంలలో కారు మాదిరిగా ఉన్న చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులకు భారీగా ఓట్లు పడ్డాయి. ఏడో రౌండ్ ముగిసే వరకు చపాతీ రోలర్‌కు 994, రోడ్డు రోలర్ గుర్తుకు 746 ఓట్లు పోలయ్యాయి. కాగా, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తుల కారణంగా పార్టీలకు కొంత ఎదురుదెబ్బ తగిలింది. -
మునుగోడు: అందరి లెక్కలు తేలుస్తాం.. కోమటిరెడ్డి, ఈటల సంచలన కామెంట్స్
సాక్షి, యాదాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి అధికార టీఆర్ఎస్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రచారంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల మంది ప్రజలకు మధ్య జరిగే పోరాటం ఇది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలి. తెలంగాణ ద్రోహులు కేసీఆర్ వంచన చేరారు. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్‌తో ఉన్న ఈటల రాజేందర్‌ను బయటకు పంపారు. ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నవారందరూ తెలంగాణ ద్రోహులే. నీ వెనుకా నేనున్నా అంటూ ఈటల రాజేందర్.. మన దగ్గరకు వచ్చారు. ఈరోజు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరులో ఈటల నాకు సపోర్టుగా నిలిచారు. మునుగోడు ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘ఖబడ్దార్ నా కొడుకుల్లారా బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కేసీఆర్ చెప్పుడు పనులు చేసే బానిసల్లారా.. మీరు అనుకోవచ్చు కేసీఆర్ కలకాలం అధికారంలో ఉంటాడని.. కానీ రాబోయే కాలం మాది. అందరికీ తగిన బుద్ధి చెబుతాము గుర్తుపెట్టుకోంది. మునుగోడులో అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నా రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి. చౌటుప్పల్ మండలానికి ఒక మంత్రి వచ్చి మందు తాగుతూ.. మా చుట్టాల ఇంట్లో తాగుతున్నా అని అంటున్నారు. నువ్వు తాగితే తాగు కానీ.. ఇక్కడి యువతను పాడు చేయకు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా దెబ్బకు మంత్రులు మీ ఇళ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. మంత్రులను పంపించి ప్రజలకు తాగుడుకు బానిస చేసే నీచమైన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేడు. మీ గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టి ముప్పై ఏళ్లకే యువత చనిపోవడానికి కారణం అవుతున్నారు. ముఖ్యమంత్రికి ఓటు వేసింది మంచిగా పరిపాలించమని కానీ బెల్టు షాపులు పెట్టి మహిళల పుస్తెలు తెంచడానికి కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
హుజురాబాద్‌లో గన్ కలకలం.. నాకేం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత: ఈటల షాకింగ్ కామెంట్స్
సాక్షి, హుజురాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓ నాయకుడి వద్ద గన్ కనిపించడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బహిరంగ కార్యక్రమంలో ఇలా గన్‌తో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. అయితే, దీనికి సంబంధించిన వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో గన్ లైసెన్స్‌లు విచ్చలవిడిగా ఇస్తున్నారు. నాకు, నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. మా రక్తం బొట్టు చిందినా సీఎందే పూర్తి బాధ్యత. ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదు. నాపై నయిమ్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినప్పుడే భయపడలేదన్నారు. ఇక, గన్ లైసెన్స్‌లపై కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో సీపీ మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో హుజురాబాద్‌లో కేవలం ఇద్దరికి మాత్రమే గన్ లెసెన్స్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఒక్కరూ కూడా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తున చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇక, గన్‌తో కనిపించిన నేతను సైతం పోలీసులు స్టేషన్‌కు పిలిపించుకుని మరోసారి ఇలా జరిగితే లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. -
కేసీఆర్‌కు ఈటల కౌంటర్.. ఆస్తులు అమ్మకుండా జీతాలు ఇవ్వగలరా?
సాక్షి, మునుగోడు: టీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా దీవెన సభలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సభ వేదిక నుంచి కేసీఆర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పే చిల్లర మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.. ప్రజలను మెప్పించే శక్తిని కేసీఆర్ కోల్పోయారు. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వం. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ మాటలకు రేపటి సభలో తప్పకుండా సమాధానం చెబుతాము. మీటర్లు పెట్టాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. బీజేపీకి ఓటెస్తే మీటర్లు వస్తాయన్నది అబద్ధం. రైతులను ఒక దోషిగా బజారులో నిలిబెట్టింది కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వపరమైన ఆస్తులు అమ్మకుండా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సీపీఐ పార్టీని నేరుగా ప్రశ్నిస్తున్నాను. ప్రజల పక్షం అని చెప్పుకునే సీపీఐ నేతలు మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సమస్యలు చెప్పారా?. కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఇతర సమస్యలపై సీఎం కేసీఆర్‌కు కలిశారా?. ప్రగతి భవన్‌కు మీరు వెళ్లారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది కూడా చదవండి: మల్లారెడ్డా మజాకా మామూలుగా ఉండదు.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు.. -
హుజురాబాద్‌లో ఈటల పవర్
-
30 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా
-
ఈటలకు మార్మోగిన చప్పట్లు: అమిత్ షా సభలో స్పెషల్ అట్రాక్షన్
సాక్షి, నిర్మల్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో బీజేపీ శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఈటల రాజేందర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈటల పేరు ఎత్తగానే పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి స్పందన లభించింది. సభ ప్రారంభంలోనే అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఈటల రాజేందర్ పేరు పలికారు. వెంటనే ఈటల లేచి నిలబడగా ‘ముందుకు రాజేందరన్న’ అంటూ అమిత్ షా పిలిచారు. ఈటల కోసం ప్రత్యేకంగా చప్పట్లు కొట్టించారు. ‘రాజేందర్ ఎన్నిక వస్తోంది. రాజేందర్‌ను గెలిపిస్తున్నాం కదా! వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాం కదా’ అని అమిత్ షా ఈటలకు కార్యకర్తలతో జేజేలు పలికించారు. ఈ బహిరంగ సభ ఈటల ఎన్నిక సభ మాదిరి కనిపించింది. ఈ సభ ఉత్సాహంతో బీజేపీ, ఈటల రాజేందర్ వర్గం హుజురాబాద్‌లో ఎన్నికలకు సంసిద్ధమవుతోంది. చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? -
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. నేను గెలిస్తే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. గురువారం హుజూరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి రోడ్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్‌తో కలిసి పరిశీలించారు. హుజూరాబాద్ శివారులోని సిర్సపల్లి రోడ్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ తీరు మోచేతికి బెల్లంపట్టి అరచేతిని నాకించే విధంగా ఉందని, ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి చాలా గొప్పగా అనేక ముచ్చట్లు చెప్పాడన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎలా కట్టించాలనే విషయంలో ఉపసంఘం వేసినా, నివేదిక ఇవ్వకముందే కాలనీల రూపంలో కట్టాలని జీవో ఇచ్చాడని తెలిపారు. గ్రామాల్లో స్థలాలు దొరకవని, కాలనీల రూపంలో డబుల్ బెడ్ రూం కట్టడం సాధ్యం కాకపోవచ్చని చెప్పామని, వినకుండా ఊరికి 400 ఇండ్లు కట్టాలని చెప్పారని తెలిపారు. ఇవి ఎవరికీ సరిపోవని చెప్పడంతో మరో వెయ్యి ఇళ్లు ఇచ్చారన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో వేలాది ఇళ్లు మంజూరు చేస్తే, తాను కూడా హుజూరాబాద్‌కు మరిన్ని ఇళ్లు కావాలని అడిగానని.. దీంతో 3,900 ఇళ్లు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ మాటాలు కోటలు దాటుతాయి తప్ప, కాళ్లు మాత్రం గడప దాటవని ఎద్దేవా చేశారు. ‘హరీశ్ రావు నా దగ్గరకి వచ్చి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేదని చిల్లర ఆరోపణలు చేస్తున్నాడు. నీవు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరు. ఎంత పిచ్చి ప్రేలాపనలు పేలినా కర్రు కాల్చి వాతపెడతారని’ హెచ్చరించారు. టీఆర్ఎస్కు దుబ్బాకలో మించిన పరాభవం ఇక్కడ తప్పదని జోస్యం చెప్పారు. -
కాషాయ జెండా పట్టుకొని ఎర్ర జెండా డైలాగులా ఈటలా?: మంత్రి హరీశ్‌రావు
జమ్మికుంట (హుజూరాబాద్): కాషాయ జెండా చేతిలో పట్టుకొని ఎర్ర జెండా డైలాగులు కొడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రజలు నమ్మరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీయూసీ కార్మిక సంఘాలు, టీడీపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. చదవండి: కాటేసిన అప్పులు.. ఇద్దరు రైతులు బలవన్మరణం ప్రజల బాధను తన బాధగా భావించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అందుకే వారి బాధలు దూరం చేసే అనేక పథకాలను తీసుకువచ్చారని, కానీ ఈటల రాజేందర్ మాత్రం తన బాధను ప్రజల బాధగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ ఆరోపించారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ పరిధిలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చారా అని ప్రశ్నించారు. జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లో కార్మికులు, ఇల్లు లేని పేదకుటుంబాలకు డబుల్బెడ్రూం మంజూరు చేస్తామని, సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునేలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు బాటలో ఉన్నారని, బీజేపీని చిత్తుగా ఓడించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మిక, రైతు వ్యతిరేకత, వ్యవసాయ మార్కెట్ యార్డు బంద్ అనే పాలన చేస్తున్న బీజేపీకి కార్మికులు, రైతులు గుణపాఠం చెప్పాలని సూచించారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పాడి కౌశిక్‌రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: హుజురాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం -
మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల
ఇల్లందకుంట (హుజురాబాద్): పదవుల కోసం పెదవులు మూసుకోలేదని, రైతులు, ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు తనను పార్టీ నుంచి పంపించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం విలాసాగర్లో సోమవారం పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తాను రాజీనామా చేస్తేనే సీఎం ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చారని, దళిత బంధు, పెన్షన్లు వచ్చాయన్నారు. ఎంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినా తన మీద ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానం తీసుకుపోలేరన్నారు. చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం చదవండి: తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించొద్దు -
దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే: మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశారో సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అసలు హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చూపించాలని అన్నారు. ఆదివారం హుజూ రాబాద్ పట్టణంలోని వెంకటసాయి గార్డెన్లో పీఆర్డీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించినందుకు కృతజ్ఞతసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిని మరిచారని అన్నారు. నియోజకవర్గానికి వైద్య కళాశాల కోసం రాజీనామా చేశారో.. పీజీ కళాశాల కోసం రాజీనామా చేశారో ప్రజలకే సమాధానం చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలో 60 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పనిచేసినప్పుడు కృతజ్ఞతతో ఉండడం అనేది మంచి దృక్పథమని హితవు పలికారు. అలాంటివి చేసినప్పుడు రాజకీయ నాయకులకు కొంత ప్రోత్సాహం ఇచ్చినట్లుగా అవుతుందన్నారు. (చదవండి: కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టేది హుజురాబాద్ ఎన్నిక) పీఆర్టీయూ లక్ష్యం.. ప్రభుత్వ లక్ష్యం ఒకటనని.. రాష్ట్రంలోని ఉద్యోగులను సీఎం కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ వేతనం ఇచ్చేది బీజేపీ పాలిత గుజరాత్ అని, అత్యధిక జీతాలు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండి టీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, జనార్దన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బీరెల్లి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా అధ్యక్షుడు పొలంపల్లి ఆదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముస్కు తిరుపతిరెడ్డి, నాయకులు రవికుమార్, రాధాకృష్ణ, శివారెడ్డి, మధు, తిరుపతి, లక్ష్మారెడ్డి, రాజేంద్రప్రసాద్, మల్లేశ్, ప్రభాకర్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. చదవండి: రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది -
కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టేది హుజురాబాద్ ఎన్నిక: ఈటల
ఇల్లందకుంట (హుజురాబాద్): హుజూరాబాద్‌లో జరుగనున్నది కేసీఆర్ దొరతనాన్ని, అహంకారాన్ని బొందపెట్టే ఉప ఎన్నిక అని.. కేసీఆర్ నిరుంకుశ పాలన గెలుస్తుందా.. ప్రజలు గెలుస్తారా అని యావత్ తెలంగాణ హుజూరాబాద్ వైపు చూస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఈటల సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వయం పాలన కోసం కొట్లాడితే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో లిక్కర్ మీదనే సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలు వస్తాయని, ఇప్పుడు సర్కార్ ఇచ్చే ప్రతీ పైసా మనదే అని పేర్కొన్నారు. చైతన్యాన్ని, ప్రశ్నించే వాడిని రక్షించుకోపోతే సమాజం బానిసత్వంలోకి జారిపోతుందన్నారు. మూడు నెలలుగా కేబినెట్‌ను ఏర్పాటు చేయకుండా కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని విమర్శించారు. ఉద్యమంలో తనతో పాటు లెఫ్ట్ రైట్‌గా పనిచేసిన వాళ్లు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, గతాన్ని మరిచి మాట్లాడవద్దని హితువు పలికారు. ముఖ్యమంత్రి మొదటిసారిగా జై భీమ్ అంటూ దళితులతో కలిసి భోజనం చేస్తూ కపట ప్రేమ చూపిస్తున్నారని.. ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌కు పోలీసుల బెదిరింపులు కొత్తకాదని, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు. చదవండి: రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది -
బడుగుల ఆత్మగౌరవ మార్గం ఇదేనా?
మొన్న వివేక్, నిన్న స్వామిదాసు, నేడు ఈటల రాజేందర్ పదమూడేళ్లు నిరంతర పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ను వదిలి బీజేపీలో చేరారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో వుండి ఉంటే బీజేపీ తెలంగాణను ఇచ్చిఉండేది కాదన్నది వాస్తవం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలపై బీజేపీ చూపుతున్న సవతితల్లి ప్రేమ లేదా ప్రేమరాహిత్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విభజన హామీలను కూడా ఇవ్వకుండా, తెలంగాణకు రావాల్సిన నిధులనివ్వడంలోనూ వేధిస్తూ బీజేపీ ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తోంది. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా తెలంగాణ లోలా సబ్బండ వర్ణాలను పట్టించుకొని పాలన సాగిస్తున్న వైనముందేమో ఈ నాయకులే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్యం ఈ ఏడేళ్ళలో చేపట్టిన పథకాలు, సంక్షేమ చర్యలు తెలంగాణలోని ప్రతి గడపనూ ఏదో విధంగా తాకుతున్న నగ్నసత్యం వీరికి తెలియంది కాదు. అయినా సరే టీఆర్ఎస్ పార్టీలో తమ ఆత్మగౌరవం పోయిందని, తమకు ప్రాముఖ్యత లేదని చిలకపలుకులు పలికే వీరు బీజేపీలో పొందుతున్న ఆత్మగౌరవం ప్రాముఖ్యత ఏంటో చెబితే బాగుం టుంది. మార్గనిర్దేశకులైన మేధావులు తమ మాటలకు, రాతలకు జవాబుదారీ కలిగివుండాలి. రాజకీయ విషయాల గురించి మాట్లాడినప్పుడు, స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు, చర్యలు చేసినప్పుడు తమ రాష్ట్రానికి లేదా దేశానికి ఏ పార్టీ ఏం చేసిందో, ఏం చేస్తోందో, ఏం చేయగలదో అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద, మానవ కేంద్రక పాలననిచ్చే పార్టీ విషయంలో క్లారిటీ లేని మేధావులే ఎక్కువ ఉన్నారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో గందరగోళ పరి స్థితులేర్పడి ఈ నేలను రాజకీయ ప్రయోగశాలగా మార్చుతున్నారు. ఐఏఎస్ పదవి వదిలిపెట్టి పార్టీ స్థాపించి మూడు సార్లు ఢిల్లీ సీఎంగా గెలిచాడు అరవింద్ కేజ్రీవాల్. ఇతనికి ఏ రాజకీయ దృక్పథమూ లేదు. అవినీతి రహితపాలనే ఎజెండా. ప్రజల కనీసావసరాలైన విద్యుత్తు, నీరు, ప్రభుత్వ పాఠశాలలు, ఉత్తమ వైద్యం, మంచి రోడ్లు, మురికివాడలు లేకుండా చూడటం, అధికార్లంతా ప్రజలకు అవసరాల్లో అందుబాటులో ఉండటం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ తానే రాజు, తానే మంత్రిగా, అన్నీ నిర్వహిస్తూ వస్తున్నాడు. జయప్రకాష్ నారాయణ అనే మరో ఐఏఎస్ అధికారి పదవి వదలి రాజకీయ పార్టీ స్థాపించాడు. నీతి గల రాజకీయాలు నడపడం ఆశయంగా పెట్టుకున్నారు. అతికష్టంగా ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినా ఏ దృక్పథంలేని పార్టీగా మిగిలిపోయి పార్టీ దాదాపు అంతర్ధానమైంది. మరో ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నం చెయ్యబోయి విఫలమయ్యాడు. ఆకునూరి మురళి ఐఏఎస్ అధికారి. రాజకీయాభిప్రాయమున్నా, ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఉత్తమ సలహాలిచ్చి మెప్పుపొందాడు. కాన్షీరాంగారు ఐఏఎస్ ఆఫీసర్ కాదు గాని విద్యాధికుడైన సైంటిస్ట్. నిరుపేద కుటుంబంనుంచి వచ్చిన దళితుడు. దళిత బహుజన రాజకీయాల కోసం ఉద్యోగం వదిలి, బ్రహ్మచారిగానే ఉండి తనను తాను ప్రజల కోసం అంకితం చేసుకున్నవాడు. కాలినడకన, సైకిల్‌పై దేశమంతా తిరిగి బహుజన రాజకీయాలను వ్యాప్తి చేసినవాడు. బీఎస్పీ పార్టీ స్థాపించి దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో ఆ పార్టీని మూడుసార్లు అధికారంలోకి తెచ్చిన సిద్ధాంతకర్త. ఒంటిచేత్తో పార్టీని దేశ వ్యాప్తం చేసి, బహుజన రాజకీయాలను దేశవ్యాప్తం చేసి అందుకోసమే జీవించి, మరణించినవాడు. కాన్షీరాం తర్వాత మాయావతి బీఎస్పీ అధినేత్రి అయినా కాన్షీరాం స్థాయిలో పార్టీని విస్తృతం చెయ్యలేకపోవడం వల్ల ఆ పార్టీ ఉత్తరప్రదేశ్‌కే పరిమితమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత మేధావి, దళిత ఆర్తి ఉన్నవాడు. చాలామంది దళితులు, బీసీలు, పేదవారి లాగే ఆతని జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నోకష్టనష్టాలకోర్చి, చదువునే ప్రేమించి, కఠోర పరిశ్రమచేసి తన జీవిత లక్షమైన ఐపీఎస్ సాధించాడు. పోలీసాఫీసరుగా ఉన్నతోన్నత స్థానాలకెదిగాడు. పదహారు సంవత్సరాలు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశాడు. ప్రభుత్వ ఉత్తర్వులను సవినయంగా పాటించి, వీలైనంత వరకు ప్రజలతో సఖ్యంగా ఉండి అటు ప్రభుత్వ మన్ననలు, ఇటు ప్రజలమెప్పు పొందాడు. దళితులకు, పేదలకు మంచి చదువును ఇవ్వడం ఆయన తాత్విక స్వప్నం. పోలీసు అధికారిగా ఉంటే తన పేదల చదువుకల నెరవేరదని గురుకుల సంక్షేమ పాఠశాలల సెక్రటరీగా చేరాడు. రెండేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవిలో ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు రెన్యువల్ పొంది మొత్తం తొమ్మిదేళ్ళు ఆ పదవిలో పనిచేశాడు. గురుకుల సంక్షేమ విద్యాలయాల కార్యదర్శిగా ఆయనచేసిన అమూల్యమైన సేవలకు తృప్తిపడేకావచ్చు లేదా ప్రవీణ్ కుమార్ కోర్కె పైనే కావచ్చు కేసీఆర్ అతన్ని తొమ్మిదేండ్లు ఆ పదవిలో ఉంచాడు. సమర్థుడైన అధికారి అయితే ప్రభుత్వనిబంధనలను అతిక్రమించకుండానే ప్రజలకుపయోగపడే అద్భుతమైన పనులు చేయవచ్చని ఈ 9 సంవత్సరాల కాలం నిరూపించింది. ఈ కాలంలో 900 పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలు, మహిళా డిగ్రీ కాలేజీ, సైనిక్ స్కూల్, లా కాలేజ్, కోడింగ్ స్కూల్ తెలంగాణలో నాణ్యమైన విద్యనందించాయి. పేద దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ విద్యా స్వప్నం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాశాలలో చదువుకునే అవకాశం, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యే అవకాశం ఈ విద్యాలయాలవల్ల లభించింది. ప్రభుత్వం మంచి విద్యాలయాలు స్థాపించి వేల కోట్ల డబ్బులివ్వడం, పేద అణగారిన జాతుల విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రవీణ్‌కుమార్ ఆశయ సిద్ధివల్ల ఈ ఫలితాలు వచ్చాయి. ఈ విజయంలో ప్రభుత్వంగా కేసీఆర్, అధికారిగా ప్రవీణ్‌కుమార్ భాగస్వాములే. ఈ స్వల్పకాలంలో ఇన్ని విద్యాలయాలు, రెండున్నర లక్షలమందికి పైగా నాణ్యమైన విద్య, ఆత్మగౌరవం, బడుగుల్లో ఆత్మగౌరవం కలిగిస్తే.. ఇంకో ఆరేళ్ల పూర్తి కాలంలో మరెన్ని విజయాలు లభించేవో ప్రవీణ్ కుమార్ ఆలోచించాలి. ప్రవీణ్‌కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంవల్ల, అదీ జాతీయపార్టీలో చేరడంవల్ల పరమపద సోపాన రాజకీయ చదరంగంలో ఈ తొమ్మిదేళ్లలో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలు, లభించిన రాజకీయ సహకారం భవిష్యత్తులో లభిస్తాయా అన్నది కోటి డాలర్ల ప్రశ్న. డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త కథా రచయిత మొబైల్ : 91829 18567 -
Eatala: రక్తతర్పణం చేసిన గడ్డ హుజూరాబాద్
కమలాపూర్: ‘కేసీఆర్ డబ్బు, కుట్రలు, అవసరానికి మోసాన్ని నమ్ముకుంటాడే తప్ప ధర్మం, ప్రజలను నమ్ముకోడు.. ఈ కుట్రలకు చరమగీతం పాడేది హుజూరాబాద్ నియోజకవర్గం..’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘కేసీఆర్ వందల కోట్ల డబ్బుపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికల్లో గెలవొచ్చు.. కానీ హుజూరాబాద్‌లో ధర్మమే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఇక్కడ డబ్బు, నిర్బంధాలు, దబాయింపులకు ఆస్కారం లేదని.., రక్తతర్పణం చేసిన గడ్డ హుజూరాబాద్ అని అన్నారు. మండలంలోని ఉప్పల్ ఉద్యమాల గడ్డ అని, ఉద్యమ సమయంలో రైల్‌రోకో చేసినప్పుడు ఫైరింగ్ చేస్తామన్నా కూడా లెక్క చేయలేదని గుర్తుచేశారు. ‘ఒకప్పటి నీ ఉద్యమ సహచరుడిగా అడుగుతున్నా.. 2006లో నీ వెంట ఉన్నదెవరు.. మేము కాదా?’అని కేసీఆర్‌ను ఈటల ప్రశ్నించారు. మీరు ఎంత డబ్బు ఇచ్చి మభ్యపెట్టినా ప్రజలు తన వెంటే ఉంటారన్నారు. రైతుబంధు పేదవాడికే ఇవ్వాలని, డబ్బున్న వారికి ఇవ్వొద్దని తాను చెప్పినట్లు ఈటల తెలిపారు. రైతుల పంటకు గిట్టబాటు ధర ఇవ్వాలనడంలో ఏం నేరముందో చెప్పాలన్నారు. -
మరో కీలక పదవికి ఈటల రాజీనామా: ఆ పోస్టు కేటీఆర్‌కు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా టీఆర్ఎస్ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక పదవికి ఆయన రాజీనామా చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈటల తాజాగా మంగళవారం ఆ పదవిని కూడా వదులుకున్నారు. స్వరాష్ట్రం తెలంగాణ సాధించుకున్న 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఈటల కొనసాగుతున్నారు. రాజీనామా పత్రాన్ని తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా సొసైటీ కార్యదర్శికి ఈటల రాజేందర్ పంపించారు. ఈటల రాజీనామాను సొసైటీ పాలకమండలి సభ్యుల సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఎగ్జిబిషన్ సొసైటీ తదుపరి అధ్యక్షుడిగా మంత్రి కేటీఆర్‌ను నియమించాలనే ఆలోచనలో పాలకమండలి ఉంది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత రానుంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వచ్చిన పదవులన్నింటిని ఈటల వదులుకుంటున్నారు. చదవండి: ఆస్తులపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్ చదవండి: క్షేమంగా ఇంటికి చేరిన ఈటల -
కరోనా.. టెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం, వారం, పది రోజులుగా తెలంగాణలోనూ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గతేడాది మార్చి 2న తొలి కేసు నమోదు కాగా, ఏప్రిల్, మే నుంచి కరోనా విజృంభించింది. ఆగస్టు, సెప్టెంబర్ వరకు రాష్ట్రాన్ని అతలాకు తలం చేసింది. ఇప్పుడూ సరిగ్గా ఏడాది తర్వాత కేసు లు పెరుగుతుండటం గమనార్హం. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు తీవ్రంగా నమోదు అవుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన పట్టిపీడిస్తోంది. ఆయా రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి నిత్యం రాకపోకలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అంతర్గత విమానాల నుంచి ప్రయాణికులు వస్తూపోతుం డటం, కాలేజీలు, స్కూళ్లు, సినిమా హాళ్లు, హో టళ్లు తెరిచి ఉండటం, బ్రిటన్ స్ట్రెయిన్లు, ఇక్కడి కొత్త స్ట్రెయిన్లు చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో సెకండ్ వేవ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. వ్యాక్సిన్ వేస్తున్నా, కేసులు పెరిగితే పరిస్థితేంటన్న ఆందోళన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అన్ని జిల్లాలనూ అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాల ని ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై దృష్టి పెట్టాలని కోరింది. రోజూ 50 వేల పరీక్షలు.. ఏడాదిలో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. మూడు నాలుగు నెలలుగా పెద్దగా కేసులు నమోదు కాకపోవడంతో ప్రజల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం పెరిగిందన్న భావన వైద్య వర్గాల్లో ఉంది. కరోనా సెకండ్ వేవ్ అంటే మనం జాగ్రత్తగా లేకపోవడం వల్ల వైరస్ విస్తరించడమే తప్ప, ప్రత్యేకంగా వేవ్ ఉండదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజుకు కనీసం 50 వేల పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుంటే పరీక్షలు చేసుకోవాలని, యాంటీజెన్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి, లక్షణాలున్న వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. మెడికల్ కాలేజీ భవనాలపై సమీక్ష.. మెడికల్ కాలేజీల భవన నిర్మాణ పనులను మంత్రి ఈటల సమీక్షించారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంతో అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. ఆసుపత్రులను సిద్ధం చేయండి: ఈటల కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఉన్నతాధికారులు, జిల్లాల వైద్యాధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలపై సూపరింటెండెంట్లతో చర్చించారు. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేసులు పెరిగితే అన్ని ఆసుపత్రుల్లో చికిత్సల కోసం వార్డులను సిద్ధంగా ఉంచాలని కోరారు. కరోనా పరీక్షలు పెంచాలన్నారు. మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదారాబాద్, సంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా చూడాలని కోరారు. వైద్యాధికారులు, ప్రజ లు రిలాక్స్ కావొద్దని కోరారు. స్కూళ్ల లో, పరీక్ష కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని వైద్య, ఆరోగ్య అధికారులను కోరారు. 102, 104, 108 వాహనాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని సూచించారు. -
గాలి ద్వారా కరోనా సోకదు : ఈటల
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్(కోవిడ్-19) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్‌పై భయాందోళనలు నెలకొన్న క్రమంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 100 కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. కరోనా వచ్చిన వ్యక్తిని 88 మంది కలిసినట్టు సమాచారం అందిందన్నారు. వారిలో 45 మందికి గాంధీలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా బాధితుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఎబోలా కంటే కరోనా భయంకరమైనది కాదని అన్నారు. 80 వేల మందికి కరోనా సోకితే.. 2 వేలకు పైగా మాత్రమే మృతిచెందారని చెప్పారు. గాలి ద్వారా కరోనా సోకే అస్కారం లేదని ఈటల తెలిపారు. మనిషి మాట్లాడినప్పుడు తుంపిర్ల ద్వారా మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు, శుభ్రత పాటించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నివసించే ఒక్కరికి కూడా కరోనా సోకలేదని చెప్పారు. కరోనా కోసం గాంధీతో పాటు చెస్ట్ హాస్పిటల్, మిలటరీ హాస్పిటల్, వికారాబాద్ అడవుల్లో ఉన్న హాస్పిటల్‌ను వాడతామని పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకినట్టు అనుమానం వస్తే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాని సూచించారు. ప్రైవేటు మెడికల్ కాలేజ్‌ల్లో 3 వేల బెడ్స్‌తో ముందుస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. తెలంగాణలో మాస్క్‌ల కొరత ఉందని, మాస్క్‌లు అందించాల్సిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. (చదవండి : కోవిడ్-19, ట్విటర్ కీలక ఆదేశాలు) అన్ని రకాలు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా అనుమానాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 104ను ఏర్పాటు చేశామని.. రేపటి నుంచి నెంబర్ పనిచేస్తుందని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కరోనా వ్యాప్తి చెందిన దేశాలకు వెళ్లేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. (చదవండి : కరోనా అలర్ట్: ‘మాస్కులకు ఆర్డర్లు ఇస్తే మంచిది’)