సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీగా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్దాం. ప్రజలు రేవంత్‌ను శభాష్ అంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీంతో.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు రాజకీయం మారిపోయింది.
మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైరం ఉంటే మూసీ బాధితుల వద్దకు ఇద్దరం కలిసే వెళ్దాం. సెక్యూరిటీ లేకుండా అక్కడికి పోదాం. మూసీ పరివాహక ప్రాంత ప్రజల రేవంత్‌ను శభాష్ అంటే నేను అక్కడే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతాను. అలాగే, రాజకీయ సన్యాసం తీసుకుంటా. రేవంత్.. ప్రజల చేత ఇంతలా తిట్టించుకున్న నాయకుడు ఎవరూ లేరు.
గర్భిణీ అని చూడకుండా ఇళ్లు ఖాళీ చేయమని బెదిరించారు. కడుపు మండి మాట్లాడిన పేదలను ఐదు వేలకు అమ్ముడుపోయారని రేవంత్ అన్నారు. అద్దాల మేడలో కూర్చొన్న రేవంత్‌కు అధికారం నెత్తికెక్కింది. మూసీ ప్రక్షాళన రోడ్ మ్యాప్ ఏంటీ ? డీపీఆర్ ఏంటీ?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులే లేవు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైందని రేవంత్ చెబుతున్నారు. మరి.. లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుండి తెస్తున్నారు. కేసీఆర్ కూడా గతంలో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రేవంత్ అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. మోసం, అబద్ధానికి మారుపేరు రేవంత్’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment