
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు.
తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా?. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు?. రంజాన్ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.
ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలి అంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్‌గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని చెప్పుకొచ్చారు.

Comments
Please login to add a commentAdd a comment