holy celebrations
-
హోలీ, రంగుల కేళి : ఇక్కడ పండుగ సంబరాల లెవలే వేరు!
#Holi2024హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. చెడుపై మంచి విజయానికి సూచిక. ఈ ఏడాది మార్చి 25, సోమవారం హోలీ జరుపుకుంటాం. అసలు హోలీ అంటే ఇలా ఉండాలి అనేలా జరుపుకునే ప్రదేశాల గురించి మీకు తెలుసా? హోలి అంటే వివిధ రకాల రంగులు, చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. ప్రతీ రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. మన దేశంలోని కొన్ని చోట్ల అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఉత్తర్ ప్రదేశ్: యూపీ,మథురలోని బర్సానా లత్మార్ హోలీకి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ఈ హోలీ వేడుకలు ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. స్త్రీలు సంప్రదాయబద్ధంగా గోపికల వేషధారణతోనూ, పురుషులు గో పురుషులుగానూ మారి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. మథురలోని రాధా కృష్ణుల ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతారు. భజనలు, సంకీర్తనలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. స్థానికులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా హోలీ వేడుకలతో సందడి చేయడం విశేషం. బృందావన్: ఇక్కడ హోలీ వేడుక వారం రోజుల పాటు సాగుతుంది. పువ్వులు, రంగులతో హోలీని ఆడతారు. బృందావన్‌లోని బాంకీ బిహారీ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీ అనేది ఒకరోజు కార్యక్రమం కాదు. రంగుల్లో మునిగి తేలడంతోపాటు,పురాణ ఇతిహాసాలు, స్థానిక జానపద కథల ప్రస్తావనలతో వారం పాటు వేడుక కొనసాగుతుంది. శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్, బోల్పూర్లో ఉన్న శాంతినికేతన్ హోలీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక్కడ దీనిని బసంత ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. రవీద్ర భారతి యూనివర్శిటీలో నోబెల్ గ్రహీత రవీద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను నిర్వహించడం మొదలెట్టారట. ఈ ప్రేరణతోనే సాధారణ వేడుకలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. పంజాబ్: పంజాబ్‌లో హోలీ పండుగను హోలా మొహల్లాగా జరుపుకుంటారు. 'హోలా-మొహల్లా' అంటే 'యుద్ధ-నైపుణ్యాల సాధన' అని అర్థం. అందుకే హోలీ వేడుకలో కత్తులతో విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నిహాంగ్ సిక్కులు ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీని పౌరుషానికి ప్రతీకగా, ధైర్యవంతుల హోలీగా వేడుక చేసుకుంటారు. ఉదయపూర్, రాజస్థాన్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనూ హోలీ వేడుకలకు పెట్టింది పేరు. అక్కడ ఉండే మేవార్ రాజ వంశస్థులు ఈ పండుగను హోలికా దహన్ కార్యక్రమంతో ప్రారంభిస్తారు. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కూడా హోలీ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఉత్సాహంగా హోలిని జరుపుకుంటారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై నగరాల్లో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణాలో చిన్నా, పెద్ద అంతా,ముఖ్యంగా యువత ఈ రంగుల హోలీని బాగా ఎంజాయ్ చేస్తారు. -
అంబరాన్నంటిన హోలీ సంబరాలు: వైరల్ వీడియోలు
దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సందడి జోరుగా సాగుతోంది. రంగులను చల్లుకుంటూ, డీజే డ్యాన్స్‌లతో పిల్లా పెద్దా అంతా ఆడిపాడుతున్నారు. ‘హ్యాపీ హోలీ’ నినాదాలతో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు అందించుకుంటున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా సంబరాలకు దూరమైన ప్రజలు ఈ హోలీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రంగుల్లో మునిగి తేలుతున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. చిన్నా, పెద్దా, ఆడ, మగ.. అన్న తేడా లేకుండా వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. క శ్మీర్ బారాముల్లా జిల్లాలోని బోనియార్‌లో ఇండియన్ ఆర్మీ జవాన్లు హోలీని జరుపుకున్నారు. అలాగే ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు లాఠ్మార్ పేరుతో హోలీని జరుపుకుంటారు, బిహార్‌లోని పాట్నాలో ఒకరిపై ఒకరు పాదరక్షలు విసురుకుంటూ హోలీ జరుపుకోవడం విశేషంగా నిలిచింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. దీంతోపాటు హోలీ సందర్భంగా కొన్ని ఉత్సవాల వీడియోలు, ఇతర జోయ్ఫుల్ అండ్ ఫన్నీ వీడియోలు కోసం.. #WATCH Assam | Multitudnous crowd of people celebrate #Holi with colours while dancing to the tunes of songs in Guwahati pic.twitter.com/M1CfX1jgBD — ANI (@ANI) March 18, 2022 Holi Celebrations in my college...💥#BheemlaNayak #BlockBusterBheemLaNayak @MusicThaman ❤️ pic.twitter.com/pDDvCF88cX — King of Tollywood 💫💫 (@King_of_Twood) March 17, 2022 #WATCH | Locals of Boniyar, Baramulla district dance and celebrate #Holi with Indian Army jawans in remote areas of the district in Jammu and Kashmir. (Source: Indian Army) pic.twitter.com/R6Poq7HVSH — ANI (@ANI) March 18, 2022 HAPPY MUSICAL HOLI to all !! 🎶❤️🎶 MUSIC is COLOURFUL.. HOLI is MUSICAL !! 💃😁🎶❤️🎶😁🕺 pic.twitter.com/AQfNVZmzew — DEVI SRI PRASAD (@ThisIsDSP) March 18, 2022 How is the day going ? Wishing you all a fun Holi ♥️💙💚💛🧡 🌈🏳️🌈🌊💦💧⛈️ pic.twitter.com/kG93dlg3e5 — Tarana Hussain (@hussain_tarana) March 18, 2022 पटना की ‘चप्पल मार’ होली …ऐसी होली देखी है कहीं? pic.twitter.com/U5xuTN3Lk7 — Utkarsh Singh (@UtkarshSingh_) March 17, 2022 #WATCH Maharashtra | Children play #Holi with each other with colours and water guns in Pune pic.twitter.com/OWcFqFiAoK — ANI (@ANI) March 18, 2022 -
కరోనా భయం : హోలీ వేడుకలపై పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో హోలీ సంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం దష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్ పిటిషన్లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్ బారిన పడకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ వైరస్ విభృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రజలు కూడా వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్లో తన సందేశాన్ని ట్వీట్ చేశారు. చదవండి : కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తో ప్రభాస్ కరోనా ఎఫెక్ట్: అన్నీ రెడీ అయ్యాక వద్దన్నారు! -
హోలీ వేడుకలకు దూరంగా ఉందాం!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తూ...మెల్లగా మన దేశంలో కూడా నేనున్నాంటున్న కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిపై ఉలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనా వైరస్ ఆందోళనల దృష్ట్యా, ఈ సంవత్సరం హోలీ వేడుకలకు దూరంగా వుంటున్నానని ప్రధాని ప్రకటించారు. అలాగే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు హోలీ పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్లో ఒక సందేశాన్ని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామూహిక సమావేశాలను తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇటలీనుంచి వచ్చిన టూరిస్టులు 15 మందికి వ్యాధి సోకినట్టుగా బుధవారం నిర్ధారణ అయింది. దీంతో తాజా కేసులతో భారతదేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 18కి చేరింది. చదవండి : కరోనా కలవరం: ఢిల్లీలో మరో 15 కేసులు, కరోనా ఎఫెక్ట్: ఆ ఎగుమతులపై ఆంక్షలు Experts across the world have advised to reduce mass gatherings to avoid the spread of COVID-19 Novel Coronavirus. Hence, this year I have decided not to participate in any Holi Milan programme. — Narendra Modi (@narendramodi) March 4, 2020 -
పుల్వామా దాడి : హోలీకి కేంద్ర బలగాలు దూరం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన క్రమంలో సీఆర్పీఎఫ్కు బాసటగా పది లక్షల మందికి పైగా సైనికులతో కూడిన కేంద్ర సాయుధ దళాలు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. సరిహద్దు భద్రతా దళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, సస్త్ర సీమా బల్లు ఈ ఏడాది హోలీని జరుపుకోరాదని నిర్ణయించాయి. కాగా, చత్తీస్‌గఢ్‌లోని సుక్మా దాడి ఘటన నేపథ్యంలో 2017లోనూ హోలీ వేడుకలను కేంద్ర బలగాలు రద్దు చేసుకున్నాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై మావోయిస్టులు జరిపిన దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. మరోవైపు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళిగా హోలీ వేడుకలు జరుపుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. -
హోలీ వేడుకల్లో హతమయ్యాడు..!
భీమారం(కరీంనగర్): హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో హోలీ ఆడుతున్న ఓ వ్యక్తిని చంపేశారు. ఈ సంఘటన వరంగల్ నగర పరిధిలోని భీమారంలో జరిగింది. వివరాలివీ...హసన్పర్తికి చెందిన ఎ. రవికుమార్(43) కొంతకాలంగా స్థానిక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై మహిళ కుటుంబ సభ్యులతో గొడవలు కూడా జరిగాయి. కాగా, రవికుమార్ ఆరు నెలల క్రితం తన మకాంను భీమారానికి మార్చాడు. అయితే, సదరు మహిళ బంధువైన ప్రసాద్.. రవికుమార్‌పై కక్ష పెంచుకున్నాడు. హోలీ సంబరాల్లో మునిగి ఉన్న రవితో ప్రసాద్ గొడవ పడి తీవ్రంగా కొట్టాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే రవి చనిపోయాడు. -
పిడికిళ్లు బిగించి... పంచ్‌లు విసిరితే... హోలీ!
బోధన్ (నిజామాబాద్): హోలీ అంటే ‘రంగుపడుద్ధి’ అని చెప్పడం సర్వసాధారణం... కానీ ఇక్కడ మాత్రం పంచ్ పడుద్ధి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజు రంగులు చల్లుకున్నా... చల్లుకోకపోయినా... పిడిగుద్దులు మాత్రం కురిపించుకోవాల్సిందే. అదే ఇక్కడి విశిష్టత. గ్రామ శ్రేయస్సు కోసం 125 ఏళ్ల నుంచి ఇక్కడి వారు దీన్ని ఆచరిస్తున్నారు. శుక్రవారం కూడా ఈ వేడుక చాలా ఉత్కంఠతతో నడిచింది. హనుమాన్ మందిరం ఆవరణలో వేదిక ఏర్పాటు చేయగా... గ్రామస్తులు రెండు బృందాలుగా విడిపోయి తాడుకు ఇరువైపులా నిలిచారు. గ్రామ పెద్దలంతా వేదిక వద్దకు చేరుకోగానే ఒకరిపై మరొకరు పిడి గుద్దులు కురిపించుకోవడం మొదలు పెట్టారు. అరగంట తర్వాత ఈ వేడుక ముగిసింది. దీన్ని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు. -
పోలీసులపై రంగులు చల్లి...బుక్కయ్యారు!
మహబూబ్‌నగర్: సాధారణ దుస్తుల్లో వెళ్తున్న పోలీసులపై రంగులు చల్లిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు గ్రామంలో జరిగింది. గట్టులోని యువకులు హోళీ సంబరాలు చేసుకుంటుండగా ఐడీ పార్టీకి చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ సాధారణ దుస్తుల్లో ద్విచక్ర వాహనంపై అటువైపు వచ్చారు. వారు పోలీసులని తెలియక కొందరు యువకులు వారిపై రంగులు చల్లారు. దీంతో ఆగ్రహానికి గురైన ఏఎస్ఐ, కానిస్టేబుల్ అక్కడున్న వడ్డే భీమేష్ అనే యువకునిపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాది, నిర్బంధించారు. దీంతో స్థానికులు బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం వారంతా పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా అదుపులోకి తీసుకున్న యువకున్ని పోలీసులు వదిలి వేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.