
హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో హోలీ సంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం దష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్ పిటిషన్‌లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్ బారిన పడకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ వైరస్ విభృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రజలు కూడా వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్‌లో తన సందేశాన్ని ట్వీట్ చేశారు.
చదవండి : కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తో ప్రభాస్
Comments
Please login to add a commentAdd a comment