భీమారం(కరీంనగర్): హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో హోలీ ఆడుతున్న ఓ వ్యక్తిని చంపేశారు. ఈ సంఘటన వరంగల్ నగర పరిధిలోని భీమారంలో జరిగింది. వివరాలివీ...హసన్‌పర్తికి చెందిన ఎ. రవికుమార్(43) కొంతకాలంగా స్థానిక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై మహిళ కుటుంబ సభ్యులతో గొడవలు కూడా జరిగాయి. కాగా, రవికుమార్ ఆరు నెలల క్రితం తన మకాంను భీమారానికి మార్చాడు.
అయితే, సదరు మహిళ బంధువైన ప్రసాద్.. రవికుమార్‌పై కక్ష పెంచుకున్నాడు. హోలీ సంబరాల్లో మునిగి ఉన్న రవితో ప్రసాద్ గొడవ పడి తీవ్రంగా కొట్టాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే రవి చనిపోయాడు.