Police Notices To BJP MLA Etela Rajender In Paper Leak Case - Sakshi
Sakshi News home page

పేపర్‌ లీక్‌ కేసులో ట్విస్ట్‌.. ఈటలకు బిగ్‌ షాక్‌!

Published Thu, Apr 6 2023 11:33 AM | Last Updated on Thu, Apr 6 2023 11:51 AM

Police Notices To Etala Rajender In Paper Leakage Case - Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో పేపర్‌ లీకేజీల వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో పలు ట్విస్టుల మధ్య బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చారు పోలీసులు. 

వివరాల ప్రకారం.. పదో తరగతి పరీక్ష పేపర్‌ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ప్రశాంత్‌ అనే వ్యక్తి పేపర్‌ను మొదట ఈటలకు వాట్సాప్‌లో పంపించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈటలకు నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, బండి సంజయ్‌కు పేపర్‌ పంపే కంటే ముందే.. ఈటలకు ప్రశాంత్‌  పేపర్‌ పంపించాడని అన్నారు. అంతకుముందు.. ఈటలకు కూడా ఈ పేపర్లను పంపించారని వరంగల్ సీపీ వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement