మరో కీలక పదవికి ఈటల రాజీనామా: ఆ పోస్టు కేటీఆర్‌కు? | Telangana: Eatala Rajendar Resigns From Exhibition Society | Sakshi
Sakshi News home page

మరో కీలక పదవికి ఈటల రాజీనామా: ఆ పోస్టు కేటీఆర్‌కు?

Published Tue, Jun 15 2021 11:38 PM | Last Updated on Wed, Jun 16 2021 8:15 AM

Telangana: Eatala Rajendar Resigns From Exhibition Society - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా టీఆర్‌ఎస్‌ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక పదవికి ఆయన రాజీనామా చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈటల తాజాగా మంగళవారం ఆ పదవిని కూడా వదులుకున్నారు. స్వరాష్ట్రం తెలంగాణ సాధించుకున్న 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఈటల కొనసాగుతున్నారు. 

రాజీనామా పత్రాన్ని తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా సొసైటీ కార్యదర్శికి ఈటల రాజేందర్‌ పంపించారు. ఈటల రాజీనామాను సొసైటీ పాలకమండలి సభ్యుల సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఎగ్జిబిషన్ సొసైటీ తదుపరి అధ్యక్షుడిగా మంత్రి కేటీఆర్‌ను నియమించాలనే ఆలోచనలో పాలకమండలి ఉంది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత రానుంది. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నప్పుడు వచ్చిన పదవులన్నింటిని ఈటల వదులుకుంటున్నారు.

చదవండి: ఆస్తులపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్‌
చదవండి: క్షేమంగా ఇంటికి చేరిన ఈటల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement