
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ నేతల మధ్య మరోసారి కోల్డ్‌వార్ బహిర్గతమైంది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ మహిళా నేత విజయశాంతి మధ్య విభేదాలు ట్విట్టర్ వేదికగా బయటకు వచ్చాయి. కొద్దిరోజులుగా ఈటలను టార్గెట్ చేసి విజయశాంతి పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా విజయశాంతి మరోసారి ఈటలపై సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో చేరికల కమిటీతో ఇప్పటి వరకు విజయాలు రాలేదని విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ విజయాలు చేరికల కమిటీతో రాలేదని ట్విట్టర్‌లో విజయశాంతి ప్రస్తావించారు. బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలేనని అన్నారు. బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్వశ్రేణుల పోరాటాలు మాత్రమే బీజేపీని గెలిపిస్తున్నాయని తెలిపారు.
నాటి ఆ దుబ్బాక, జిహెచ్ఎంసి, నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా...!
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 30, 2023
చేరికల కమిటీతో వచ్చాయా..?
ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా...!
విశ్లేషించుకోవాలి..
మరోవైపు.. గతంలో అన్ని పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఈటల రాజేందర్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈటలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో కోవర్ట్‌లు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పొలిటికల్ పంచాయితీ ముదిరింది.
బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్ లో ఈటల చెప్పారు,
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 30, 2023
చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ..... pic.twitter.com/G8ulVzUyTf
ఇక, అంతకుముందు మంత్రి హరీష్ రావు.. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్‌లో ఈటల చెప్పారు అని కామెంట్స్ చేశారు. దీనిపై విజయశాంతి స్పందించారు. హరీష్ కామెంట్స్‌పై ట్విట్టర్‌లో విజయశాంతి పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. ‘చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు.. చేరికల కమిటీ పేరు చెబుతూ, చిట్‌చాట్‌లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం నిలవదు. ఇది హరీష్‌రావుకు తెలియంది కాదు’ అంటూ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: కవిత అసలైన పెట్టుబడిదారు!
Comments
Please login to add a commentAdd a comment