Komatireddy And Eatala Rajender Sensational Comments In Munugode Election Campaign - Sakshi
Sakshi News home page

మునుగోడులో స్పీడ్‌ పెంచిన బీజేపీ.. కోమటిరెడ్డి, ఈటల సంచలన కామెంట్స్‌

Published Wed, Oct 12 2022 1:38 PM | Last Updated on Wed, Oct 12 2022 3:19 PM

Komatireddy And Eatala Rajender Sensational Comments In Munugode - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో​ పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి అధికార టీఆర్‌ఎస్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

ప్రచారంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ కుటుంబానికి, నాలుగు కోట్ల మంది ‍ప్రజలకు మధ్య జరిగే పోరాటం ఇది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలి. తెలంగాణ ద్రోహులు కేసీఆర్‌ వంచన చేరారు. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్‌తో ఉన్న ఈటల రాజేందర్‌ను బయటకు పంపారు. ఇప్పుడు కేసీఆర్‌ పక్కన ఉన్నవారందరూ తెలంగాణ ద్రోహులే. నీ వెనుకా నేనున్నా అంటూ ఈటల రాజేందర్‌.. మన దగ్గరకు వచ్చారు. ఈరోజు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరులో ఈటల నాకు సపోర్టుగా నిలిచారు. మునుగోడు ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది’ అని అన్నారు. 

ఈ సందర్భంగా హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ‘ఖబడ్దార్ నా కొడుకుల్లారా బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కేసీఆర్ చెప్పుడు పనులు చేసే బానిసల్లారా.. మీరు అనుకోవచ్చు కేసీఆర్ కలకాలం అధికారంలో ఉంటాడని.. కానీ రాబోయే కాలం మాది. అందరికీ తగిన బుద్ధి చెబుతాము గుర్తుపెట్టుకోంది. మునుగోడులో అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నా రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించండి. 

చౌటుప్పల్ మండలానికి ఒక మంత్రి వచ్చి మందు తాగుతూ.. మా చుట్టాల ఇంట్లో తాగుతున్నా అని అంటున్నారు. నువ్వు తాగితే తాగు కానీ.. ఇక్కడి యువతను పాడు చేయకు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా దెబ్బకు మంత్రులు మీ  ఇళ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. మంత్రులను పంపించి ప్రజలకు తాగుడుకు బానిస చేసే నీచమైన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేడు. మీ గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టి ముప్పై ఏళ్లకే యువత చనిపోవడానికి కారణం అవుతున్నారు. ముఖ్యమంత్రికి ఓటు వేసింది మంచిగా పరిపాలించమని కానీ బెల్టు షాపులు పెట్టి మహిళల పుస్తెలు తెంచడానికి కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement