Komatireddy Rajagopala reddy
-
ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడు
-
బీజేపీకి రాం రాం..
-
‘ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ ప్రమాణం చేస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. కాగా, మునుగోడు ఎన్నికల్లో సీఎం కేసీఆర్.. కాంగ్రెస్‌కు రూ. 25కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. దీంతో, ఈటల తన ఆరోపణలు నిరూపించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణానికి రేవంత్ సిద్దమయ్యారు. కాగా, భాగ్యలక్ష్మి ఆలయానికి ఈటల రావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. తాజాగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ ప్రమాణం చేస్తారా?. ఈటల రాజేందర్ చెప్పింది నూటికి నూరు శాతం నిజం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ సహకరించింది. దుబ్బాక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటైన మాజ నిజం కాదా? వాస్తవం చెబితే రేవంత్‌కు ఎందకంత ఉలికిపాటు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్.. భాగ్యలక్ష్మి గుడికి రావొద్దని ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ గత చరిత్ర ప్రజలందరికీ తెలిసిందే. పబ్లిక్‌లో రేవంత్‌కు బ్లాక్ మెయిలర్ అనే పేరుంది. రాజకీయాల్లోకి వచ్చాక పదవులను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్న రేవంత్ ఇప్పుడు భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణాలంటే నమ్మేదెవరు?. లెక్కలేనన్ని తప్పుడు పనులు చేస్తున్న రేవంత్ భాగ్యలక్షి గుడిలో అడుగు పెడితే, ఆ దేవాలయం అపవిత్రం అవుతుందనేది భక్తుల భావన. ఈటల రాజేందర్, నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరలేదని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుకున్నాడు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితతో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్తవం కాదా?. ఆమెతో నీకు వ్యాపార భాగస్వామ్యం లేదా, ఓటుకు నోటు కేసులో లక్షల రూపాయల నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్‌ది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, బీజేపీ నేతల ఆరోపణలపై కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి స్పందించారు. తాజాగా స్రవంతి మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇస్తే ఏం చేస్తున్నారు?. బీజేపీలోకి చేరికలు లేకపోవడంతో ఈటల రాజేందర్ ఆవేదనలో ఉన్నారు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. -
మునుగోడులో ముగిసిన ప్రచారం (ఫొటోలు)
-
మునుగోడు: రాజగోపాల్‌రెడ్డికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట దక్కింది. రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. సుమారు రూ.5.24 కోట్ల బదిలీ జరిగిందని టీఆర్ఎస్ పార్టీ, రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే టీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారమైనవని ఈసీ తేల్చింది. రాజగోపాల్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాల్లేవని ఈసీ వెల్లడించింది. అంతేకాదు.. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. పలువురు వ్యక్తులు, సంస్థలకు నగదు బదిలీ చేశారన్నది టీఆర్ఎస్ ఆరోపణ. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డికి చెందిన సంస్థ నుంచి సుమారు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. నగదు లావాదేవీలపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలంటూ రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈసీ నోటీసులకు రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన ఎన్నికల కమిషన్.. రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలి..: బండి సంజయ్ -
ఓట్ల కొనుగోలుకు రూ. 5.22 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెందిన కంపెనీ ఖాతాల నుంచి నియోజకవర్గ పరిధిలోని వివిధ వ్యక్తుల ఖాతాల్లోకి బదిలీ చేసిన రూ. 5.22 కోట్లను ఫ్రీజ్ చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎలాంటి వ్యాపారాలు లేకున్నా డబ్బు పొందిన బీజేపీ నేతలతోపాటు పలు సంస్థలు, కంపెనీల ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలని చేయాలని కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్ గుప్తా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలతోపాటు మునుగోడు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటర్లను కొనుగోలు చేసేందుకే బీజేపీ అభ్యర్థి ఈ డబ్బు బదిలీ చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని 23 బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బు బదిలీ అవగా ఖాతాదారులంతా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వారేనంటూ వారి వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. లబ్ధి పొందిన డబ్బుతో ఓట్ల కొనుగోలుకే.. రాజగోపాల్‌రెడ్డి డబ్బు జమ చేసిన ఖాతాదారులెవరికీ ఆయన కంపెనీతో ఎలాంటి లావాదేవీలు లేవని టీఆర్ఎస్ తన ఫిర్యాదులో పేర్కొంది. డబ్బు బదిలీ పూర్తిగా అక్రమమని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతోపాటు శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కోరింది. ఈ ఖాతాల నుంచి మరిన్ని లావాదేవీలు జరగకుండా వెంటనే ఖాతాలను స్తంభింపజేయడంతోపాటు ఇప్పటికే జరిగిన లావాదేవీలపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఖాతాల్లోని సొమ్మును స్థానిక వ్యాపారులు నగదుగా మార్చి ఓట్ల కొనుగోలుకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పోలింగ్‌కు ఉన్న కొద్ది సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. రూ. 18 వేల కోట్ల బొగ్గు కాంట్రాక్టు కోసం సుశీ ఇన్ఫ్రా మైనింగ్ కంపెనీతో సంబంధమున్న రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఈ కాంట్రాక్టు ద్వారా లబ్ధి పొందిన డబ్బుతో ఓటర్ల కొనుగోలు సరికాదని... తక్షణమే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని కోరింది. టీఆర్ఎస్ పేర్కొన్న లావాదేవీలివే... ►ఈ నెల 29న సుశీ ఇన్ఫ్రా నుంచి మేకల పారిజాతకు రూ. 28 లక్షలు, నీల మహేశ్వర్, అక్షయ సీడ్స్‌కు రూ. 25 లక్షల చొప్పున ►ఈ నెల 18న పబ్బు అరుణ, పబ్బు రాజుగౌడ్ (రెండు అకౌంట్లు) ఖాతాలకు రూ. 50 లక్షల చొప్పున.. ►ఈ నెల 14న చింతల మేఘనాథ్‌రెడ్డికి రూ. 40 లక్షలు, కె.వినయ్‌వర్దన్‌రెడ్డి, కేఎస్ఆర్ ట్రేడింగ్, ఎ.నవ్యశ్రీ, కె.వెంకట రమణ, దిండు మహేశ్, దిండు భాస్కర్, పాలోజు రాజ్‌కమల్, దిండు యాదయ్య, శ్రీనివాస్ టెంట్‌హౌస్ ఖాతాలకు రూ. 16 లక్షల చొప్పున ►ఈ నెల 14న డి.దయాకర్‌రెడ్డి, తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్, శివకుమార్ బుర్ర, ఉబ్బు సాయికిరణ్, మణికంఠ బిల్డింగ్ మెటీరియల్, టంగుటూరి లిఖిత ఖాతాలకు రూ. 16 లక్షల చొప్పున. -
‘హుజురాబాద్, దుబ్బాక మాదిరిగా మునుగోడులోనూ డ్రామాలు షురూ’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశానని, హుజురాబాద్, దుబ్బాకలో అభ్యర్థులకు జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని ఎద్దేవా చేశారు. తాము ముందు నుంచే ఇలా జరుగుతుందని ఊహించామని, మునుగోడు ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి తలసాని. ‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ్టి నుంచి డ్రామాలు స్టార్ట్ అయ్యాయి. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశాను. హుజురాబాద్, దుబ్బాక లో అభ్యర్థులకు జరిగినట్టే జరుగుతుంది. ఇవాళ జ్వరం వచ్చింది, రేపు గుండె నొప్పి రావొచ్చు. ఇలాగే కుటుంబం రోడ్డు మీదికి వచ్చి నిరసనలు చేసి సింపతి క్రెయేట్ చేసే ఏడుపులు మొదలవుతాయి. మేము ముందు నుంచి ఇదే చూస్తున్నాం. మేము ఊహించిందే జరిగింది. మునుగోడు ప్రజలు గమనించాలి. మునుగోడు అభివృద్ధి ఏ మేరకు చేసామో గమనించండి. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ డ్రామాలను మునుగోడు ప్రజలు నమ్మకండి. జ్వరం ఒక్కటే కాదు, రేపు తన పైన దాడి చేయించుకొని చేతులు కాళ్ళు విరగొట్టుకుంటాడు. మేము స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నాం’ అని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదీ చదవండి: Munugode Bypoll 2022: ఎల్బీ నగర్లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ? -
మునుగోడుపై ఢిల్లీకి చేరిన నివేదికలు.. సంజయ్‌జీ హస్తినకు రండి అంటూ కాల్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ నాయకత్వం పిలుపుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురు, శుక్రవారాల్లో ఆయన పలువురు పార్టీ నేతలను కలుసుకోనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ ప్రచారం, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై మాట్లాడనున్నట్టు తెలిసింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నిక సందర్భంగా ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపాలు, ఇతర లోటుపాట్లపై అధినాయకత్వం దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై మునుగోడు ఫలితాలు ప్రభావం చూపనున్నందున, ఈ మేరకు కచ్చితమైన చర్యలు సూచించనున్నట్టు సమాచారం. నివేదికల ఆధారంగా కార్యాచరణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరుపై బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించున్నట్టు తెలుస్తోంది. పార్టీతో సంబంధం లేని స్వతంత్ర సంస్థలు, బృందాల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఈ నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా తెలంగాణలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను అధినాయకత్వం రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వివిధ స్థాయిల నాయకుల పనితీరు, కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు ఏ మేరకు అమలౌతున్నాయి, పార్టీ ప్రచారం ప్రజలపై ప్రభావం చూపించేలా జరుగుతోందా అన్న అంశాలపై నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ను ఢిల్లీకి రమ్మనమంటూ వర్తమానం పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మునుగోడు: అందరి లెక్కలు తేలుస్తాం.. కోమటిరెడ్డి, ఈటల సంచలన కామెంట్స్
సాక్షి, యాదాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి అధికార టీఆర్ఎస్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రచారంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల మంది ప్రజలకు మధ్య జరిగే పోరాటం ఇది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలి. తెలంగాణ ద్రోహులు కేసీఆర్ వంచన చేరారు. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్‌తో ఉన్న ఈటల రాజేందర్‌ను బయటకు పంపారు. ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నవారందరూ తెలంగాణ ద్రోహులే. నీ వెనుకా నేనున్నా అంటూ ఈటల రాజేందర్.. మన దగ్గరకు వచ్చారు. ఈరోజు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరులో ఈటల నాకు సపోర్టుగా నిలిచారు. మునుగోడు ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘ఖబడ్దార్ నా కొడుకుల్లారా బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. కేసీఆర్ చెప్పుడు పనులు చేసే బానిసల్లారా.. మీరు అనుకోవచ్చు కేసీఆర్ కలకాలం అధికారంలో ఉంటాడని.. కానీ రాబోయే కాలం మాది. అందరికీ తగిన బుద్ధి చెబుతాము గుర్తుపెట్టుకోంది. మునుగోడులో అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నా రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి. చౌటుప్పల్ మండలానికి ఒక మంత్రి వచ్చి మందు తాగుతూ.. మా చుట్టాల ఇంట్లో తాగుతున్నా అని అంటున్నారు. నువ్వు తాగితే తాగు కానీ.. ఇక్కడి యువతను పాడు చేయకు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా దెబ్బకు మంత్రులు మీ ఇళ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. మంత్రులను పంపించి ప్రజలకు తాగుడుకు బానిస చేసే నీచమైన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేడు. మీ గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టి ముప్పై ఏళ్లకే యువత చనిపోవడానికి కారణం అవుతున్నారు. ముఖ్యమంత్రికి ఓటు వేసింది మంచిగా పరిపాలించమని కానీ బెల్టు షాపులు పెట్టి మహిళల పుస్తెలు తెంచడానికి కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
మునుగోడులో మరో ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రెండు నెలల్లోనే పాతిక వేలు దాటిందని పేర్కొంది. ఈ తతంగంపై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందు 7 నెలల కాలంలో 1,474 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు 6 నెలల్లోనే పెద్ద మొత్తంలో 24,781 దరఖాస్తు రావడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని చెప్పింది. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్లో పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి కోరారు. ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేపట్టలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉందని, ఓటర్ల జాబితాను ఖరారు చేయనున్నారని రచనారెడ్డి తెలపడంతో.. ఈ నెల 13న విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. -
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో " స్ట్రెయిట్ టాక్ "
-
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఈసీకి పిర్యాదు
-
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
‘మునుగోడులో బీజేపీదే విజయం.. సర్వేలన్నీ మాకే అనుకూలం’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌తో తెలంగాణలో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. కాగా, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి.. మునుగోడు బరిలో నిలవగా.. అధికార టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీలో ఉంటే అవకాశం ఉంది. కాగా, మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ను స్వాగతిస్తున్నాము. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ సర్వసన్నద్ధంగా ఉంది. మునుగోడులో భారీ మెజార్టీతో బీజేపీ విజయం సాధిస్తుంది. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎవరికి మొదటి స్థానం.. ఎవరికి మూడో స్థానం ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే మా నిర్ణయం. మునుగోడులో చేపట్టిన సర్వేలన్నీ బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. విజయం మాదే’ అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. కాగా, తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం బండి సంజయ్ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర నాలుగు విడతలను పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి ఐదో విడత పాదయాత్రను చేపట్టాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
మునుగోడులో టీఆర్ఎస్కు భారీ షాక్.. రాజగోపాల్ మాస్టర్ ప్లాన్స్ సక్సెస్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బలం పెంచుకునేందుకు పూర్తిగా చేరికపైనే దృష్టి పెట్టారు. వారం రోజుల నుంచి ప్రజా ప్రతినిధులను, నాయకులను రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపైనే దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశంను, మరికొంత మంది నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. వారం రోజులుగా పలువురు సర్పంచ్‌లను, వార్డు సభ్యులను, ఇతర పార్టీ కార్యకర్తలను పదుల సంఖ్యలో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. గత ఆదివారం హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేరికల్లో ఎలుకలగూడెం గ్రామానికి చెందిన 30 మంది , మునుగోడు నుంచి 11 మంది, మరో గ్రామానికి చెందిన 20 మంది బీజేపీలో చేరారు. అదేవిధంగా చౌటుప్పల్ మండలంలోని అల్లాపురం, అంకిరెడ్డిగూడెం, గుండ్లబావి గ్రామాల సర్పంచ్‌లు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. గురువారం ఎల్లంబావి శివారులోని హోటల్ వద్ద కోయలగూడెం, నాగారం, పంతంగి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్ఎస్కు షాక్.. ఇటీవల చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కంగుతింది. దీంతో మిగతా క్యాడర్ పార్టీని వీడకుండా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శవయాత్రలు చేసి వలసలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్నాటి వెంకటేశంతోపాటు గట్టుప్పల్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్, చెరుపల్లి భాస్కర్, ఉడతలపల్లి సర్పంచ్ తులసయ్యలు కూడా బీజేపీలో చేరారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరగడంతో మరింత ఉత్సాహంతో బీజేపీ నాయకులు ముందుకు పోతున్నారు. కార్యాచరణపై నిర్ణయం మాజీ ఎంపీ వివేక్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి కోఆర్డినేటర్‌గా 14 మంది సభ్యులతో నియమించిన స్టీరింగ్ కమిటీ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యింది. ఈ క్రమంలో మునుగోడులో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, కమిటీలు చేపట్టాల్సిన కార్యాచరణపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. -
20 రోజులు ఓపిక పట్టా.. మునుగోడులో అడుగుపెట్టవ్: రేవంత్‌కు వార్నింగ్
సాక్షి, నల్గొండ : తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య మాటల వార్ నడుస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటల దాడి చేస్తున్నారు. హస్తం నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్. నా జోలికొస్తే నీ చరిత్ర మొత్తం బయట పెడతాను. నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో అన్ని తెలుసు. వాటిని బయట పెడితే ముఖం చూపించుకోలేవు. పోయేకాలం వచ్చిందా రేవంత్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మునుగోడులో కూడా అడుగు పెట్టవ్. సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు వెనకేసుకున్నది నువ్వు కాదా?. హైదరాబాద్‌లో వంద మందిని బ్లాక్ మెయిల్ చేసి ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశావు. డబ్బులిచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నావు. నీలాంటి మనిషిని పీసీసీ చేయడమా?. నీది నేర, అవినీతి చరిత్ర నీకు పార్టీ జెండా కావాలి. నేను ఇండిపెండెంట్‌గా పోటీచేసినా గెలుస్తాను. మునుగోడుకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. పోనీలే అని ఇరవై రోజులుగా ఓపికపడుతున్నా. నా మంచితనాన్ని చేతగానితనంగా అనుకోవద్దు. నేను అమ్ముడుపోయినట్లు నీ దగ్గర పత్రాలు ఉంటే మీడియాకు ఇవ్వు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక సోషల్ మీడియాలో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్‌లో గోల్మాల్.. గోవాలో సీక్రెట్‌గా పరీక్షలు! -
మునుగోడులో ఏ పార్టీ బలమెంత?.. ‘గులాబీ’కి కష్టమేనా?.. బీజేపీ పరిస్థితి ఏంటి?
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు ఉద్యమాల ఖిల్లా. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది గతంలో. కాల క్రమంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పోటీ కారు, హస్తం గుర్తుల మధ్యే ఉంటోంది. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న బీజేపీకి మునుగోడు రూపంలో బలం పరీక్షించుకునే ఛాన్స్ వచ్చింది. మునుగోడు ఫలితమే రాష్ట్ర భవిష్యత్‌ని, ఉమ్మడి జిల్లా భవిష్యత్‌ను తేల్చుతుందా? చదవండి: రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో 12కి 9 స్థానాలు గెలుచుకోగా.. తర్వాత మరో రెండు కలిసాయి. ఎంపీగా గెలిచిన అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్నగర్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయగా ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో ఉత్తమ్ నిలిపిన అభ్యర్థి ఓడిపోయి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మునుగోడు ఒక్కటే కాంగ్రెస్‌కి మిగిలింది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ సీటుకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను అనేక మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి గతంలో వచ్చినన్ని స్థానాలు రావనే టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కొంతమంది ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఇదే విషయం గులాబీ బాస్ దృష్టికి కూడా వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దీనికి తోడు నియోజకవర్గాల్లో వర్గపోరు కూడా టీఆర్ఎస్కు సంకటంగా మారింది. జిల్లాలో వర్గపోరు లేని సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది సూర్యాపేట మాత్రమే. తుంగతుర్తి, నల్లగొండ, హుజూర్ నగర్లో గ్రూప్ తగాదాలు ఉన్నా అవి బయటకి కనిపించే స్థాయిలో లేదు. ప్రతీ నియోజకవర్గంలో పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది. నల్లగొండలో కమలం జెండా ఎగరేస్తాం అని ఆ పార్టీ నేతలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం పన్నెండు సెగ్మెంట్లలో నాలుగు స్థానాల్లో మాత్రమే కమలం పార్టీ అంతో ఇంతో పోటీ ఇస్తుంది కానీ అది గెలిచేందుకు సరిపోదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఆలేరు, భువనగిరి, మునుగోడు, సూర్యాపేట మాత్రమే బీజేపీ కనీస పోటీనిచ్చే స్థితిలో ఉంది. నల్లగొండ జిల్లాలో కనీసం ఐదు స్థానాల్లో విజయం సాధించాలని రాష్ట్ర నేతలు ఆలోచిస్తూ తరచుగా పర్యటిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో నేతలు అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారనే టాక్ ఉంది. కాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో మునుగోడులో కమలం పార్టీ అదృష్టాన్ని పరిక్షించుకునే అవకాశం దక్కింది. నల్గొండ జిల్లాలో ఉన్న సీట్లను కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్నికల్లో అన్ని సీట్లూ తమవారికే కావాలని కోరుతున్నారు. గతంలో జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేది. కురువృద్ధులు ఆ పార్టీకి దన్నుగా ఉండేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వైభవం గత చరిత్రగా మిగిలిపోతోంది. గత ఎన్నికల్లో మూడు సీట్లు గెలుచుకోగా ఉప ఎన్నికలో ఒకటి కోల్పోయింది. మరొకరు గులాబీ పార్టీలోకి జంప్ చేశారు. చివరికి మిగిలిన మునుగోడు ఎమ్మెల్యే పీసీసీ చీఫ్ రేవంత్ కారణంగా పార్టీకి, పదవికి గుడ్ బై చెప్పి.. కమలం తీర్థం తీసుకోబోతున్నారు. అంటే ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా మిగల్లేదని చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీకి కేడర్ పటిష్టంగానే ఉంది. అసెంబ్లీ స్థానాలు పోయినా.. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ సీట్లను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే రేవంత్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కమలం గూటికి చేరడం కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టే అంశమే. అయితే అన్ని సెగ్మెంట్లలో వర్గపోరుతో పాటు.. సీట్లు అడిగేవారి సంఖ్య కూడా కాంగ్రెస్‌లో ఎక్కువగానే ఉంది. ఉత్తమ్‌కుమార్, జానారెడ్డి తదితర సీనియర్ నాయకులు తమకు తమ కుటుంబానికి ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మునుగోడులో సర్పంచ్‌లకు ఫోన్లు చేస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి ఫైర్
Munugode Politics.. మునుగోడు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడాక్కాయి. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. నా రాజీనామా తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నా రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు. అందరు సర్పంచ్‌లకు ఫోన్లు చేస్తున్నారు. నా రాజీనామాతోనే ఫండ్స్ రిలీజ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రభుత్వం నిధులను అడ్డుకుంటోంది. ప్రభుత్వం వివక్షతో ప్రవర్తిస్తోంది. మొన్నటి వరకు మునుగోడుపై మాట్లాడితే సీఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ, నా రాజీనామా తర్వాత సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు కేటాయించలేదు. కానీ.. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. -
డబ్బులిచ్చి రేవంత్‌రెడ్డి పీసీసీ కొనుక్కున్నాడు: రాజగోపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం ఢిల్లీకి వెళ్లి బీజేపీ సీనియర్ నేత, కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగిస్తాం. ఈ ఉప ఎన్నికతో రాష్ట్రంలో మార్పు వస్తుంది. అమిత్ షా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 21న తెలంగాణకు అమిత్ షా వస్తారు. అదే రోజు బీజేపీలో చేరతాను. బహిరంగ సభ పెట్టి మరీ చేరతాను. ఈ నెల 8వ తేదీన స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తాను. బీజేపీకి అమ్ముడు పోయినట్లు రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. లేకుంటే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? అని రేవంత్‌కు సవాల్ విసిరారు రాజగోపాల్‌రెడ్డి. అంతేకాదు డబ్బులు ఇచ్చి పీసీసీ కొనుకున్నారంటూ రేవంత్‌పై ఆరోపణలు గుప్పించారు. రేవంత్ భాష, వ్యవహారశైలి అందరూ అస్యహించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బయటకు వెళ్లగొడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు వస్తున్నాయి. వెంకట్‌రెడ్డి అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా ’ అని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఇదీ చదవండి: హోం మంత్రి అమిత్ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్ -
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు: బండి సంజయ్
తెలంగాణలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. పొలిటికల్ లీడర్లు పార్టీలు మారుతూ సడెస్ ట్విస్టులు ఇస్తున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండితో రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం, నల్లగొండ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. అలాగే, మునుగోడు అభ్యర్థి ఎవరనేది పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు. మహాబూబ్ నగర్ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ బలమెంటో అర్థం అయింది. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలతో కాంగ్రెస్ ఖతమైందని ఎద్దేవ చేశారు. ఆర్థిక నేరాలు చేస్తే ఈడీ తప్పకుండా ప్రశ్నిస్తుంది. ఈడీ విచారణ చేయవద్దని కాంగ్రెస్ నేతలు అనడం హాస్యాస్పదం అని చురకలు అంటించారు. కాగా, రాజగోపాల్ రెడ్డి కాషాయతీర్థం పుచ్చుకుంటున్నారన్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. రాజగోపాల్ రెడ్డి వచ్చే వారంలో ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు -
మంత్రి మునుగోడుకు వచ్చినా సరే.. నన్ను సూర్యాపేటకు రమ్మన్నా సరే!
సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడుకు వచ్చినా సరే.. నన్ను సూర్యాపేటకు రమ్మన్నా సరే! నాపై పోటీకి సిద్ధమా?’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయిం ట్లో మాట్లాడుతూ, అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని, తనను వ్యక్తి గతంగా కాంట్రాక్టర్ అనడం బాధాకరమని అన్నారు. తెలంగాణ కోసం వ్యాపారాలు నష్ట పోయామని, మంత్రి పదవి సైతం వదులుకు న్నామని గుర్తుచేశారు. 2014 ముందు జగదీశ్ రెడ్డి ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత? అని ప్రశ్నిం చారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకు నేం దుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సభలో కోరితే మంత్రి సమాధానంలో తన పేరు ప్రసా వించ కుండా శ్రీధర్‌బాబు, భట్టి పేర్లనే చెప్పి తనను కించపరచారని దుయ్యబట్టారు. మాకు పార్టీ గుర్తింపు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధి ష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతోనే తాము పార్టీకి కొంత దూరంగా ఉంటున్నామని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. సీఎల్పీలో మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నుంచి వాళ్లకు పదవులు ఇస్తే ఏం లాభమని, తెలంగాణ కోసం కొట్లా డిన వారికి ప్రాధాన్యమివ్వాలన్నారు. అలా చేయకపోతే పాత కాంగ్రెస్ నేతలు దూరం అవుతారని చెప్పారు. పదవుల విష యంలో తమకు పార్టీ గుర్తింపు ఇవ్వలేద న్నారు. తనకు పార్టీలో ఎవరితో విభేదాలు లేవని, రేవంత్‌తో వ్యక్తిగత విభేదాలు లేవన్న రాజగోపాల్‌రెడ్డి సమర్థత ఉన్న వారికే మాత్రమే పదవులివ్వా లన్నది తన ఉద్దేశమని చెప్పారు. -
ఇప్పుడు ఏ వ్యాఖ్యలూ చేయను: రాజగోపాల్‌రెడ్డి
సంస్థాన్ నారాయణపురం: ‘కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను.. ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలూ చేయను’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని బోటిమిదితండా శివారులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు మా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మాట్లాడి రాజకీయ భవిష్యత్ నిర్ణయించుకుంటానని అన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగాలా, వీడాలా అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. అధికారంలోకి రాలేకపోయామని బాధతో రెండు, మూడుసార్లు మాట్లాడానన్నారు. -
బీజేపీలో చేరతా : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, తిరుమల: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు గుర్తిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆయన వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని మొదట చెప్పిన వ్యక్తిని తానేనన్నారు. ఇందుకు నిదర్శనం దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనమని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని, అన్నదమ్ములు గా కలిసే ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారివేనని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు. తెలంగాణ పీసీసీ పీఠం కోసం రేవంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నా ఎవరు విజయవంతమవుతారో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఆయనతో పాటు తెలంగాణ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సాక్షి.హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతానన్న వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగ ణిస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పార్టీ వర్గాలను ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి వ్యవహా రంపై ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డితోనూ అధిష్టాన దూతలు మాట్లాడినట్టు తెలిసింది. తన సోదరుడి తీరు తనకూ అంతుచిక్కడం లేదని, అయితే ప్రస్తుత పరిణామాలకు తనకు ఎలాం టి సంబంధం లేదని వెంకట్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. తాజాగా రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడానికి సంబంధించి వెలిబుచ్చిన అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవేనని.. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. గతంలోనూ రాజగోపాల్‌రెడ్డి పలు మా ర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఏకంగా అప్పటి పార్టీ ఇన్చార్జి ఆర్సీ కుంతియాపైనా సంచ లన ఆరోపణలు చేయడం వంటివి చోటుచేసుకున్న తాజా పరిణామాలను పార్టీ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. వచ్చే 3, 4 రోజుల్లోనే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు వెల్ల డించాయి. రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నందున ఆయనపై చర్యకు ఏఐసీసీ, అధిష్టానం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున, హై కమాండ్ స్పందన కోసం పార్టీ నేతలు వేచి చూస్తున్నట్టు సమాచారం. ఆ ఉప్పందడంతోనే పార్టీ మార్పా? ఇటు టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం వెంకట్‌రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి ఈ విధంగా వ్యవహరించడం వెంకట్ రెడ్డికి నష్టం కలగజేస్తుందనే అభిప్రాయాన్ని పార్టీ నేత లు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం పార్టీని ఇరుకున పెట్టడంతో పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగినందున తాను ఆ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవినిచ్చే విషయంలో ఉప్పందడంతోనే రాజగోపాల్‌రెడ్డి ఈ విధంగా స్పందిస్తున్నారా అన్న సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. వెళ్లినా ఆ ఒక్కడే! ఇక ఒకవేళ రాజ్‌గోపాల్‌రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నా, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లే సీనియర్లు, ఇతర నాయకుల సంఖ్య పెద్దగా ఉండదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క అసలు పార్టీ మారే అవకాశాలే లేవని, ఎమ్మెల్యే పోడెం వీరయ్య విషయంలో శషభిషలున్నా ఆయన కూడా బీజేపీలోకి వెళ్లలేరని అంటున్నారు. ఎమ్మెల్యేలే కాకుండా జిల్లాల నుంచి ఇతర సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరడం వంటిది జరగకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. -
వైఎస్ జగన్ మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలి
-
ఉద్రిక్తత.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్టు..!
సాక్షి, యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇక్కడ హంగ్ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపాలిటీ కేంద్రం రణరంగాన్ని తలపించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీపీఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. 20 వార్డులున్న చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది. ఇక టీఆర్ఎస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో ద్వంద్వ విధానాల సీపీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. -
‘పార్టీ మార్పుపై సరైన సమయంలో నిర్ణయం’
సాక్షి, తిరుమల: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కశ్మీర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలందరూ హర్షించారని తెలిపారు. మోదీ, అమిత్ షా నేతృత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. మోదీ కృషి వల్ల అమెరికా, చైనా తర్వాత భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారిందన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలందరూ మోదీ వైపు చూస్తున్నారని తెలిపారు. పార్టీ మార్పుపై సరైన సమసయంలో నిర్ణయం తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ పేరు నిలిపేలా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు రాజోపాల్ రెడ్డి. -
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారు!
సాక్షి, హైదరాబాద్: సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌గా నిలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సరికొత్త విషయాలు వెల్లడించి రాజకీయంగా కాక పుట్టించారు. తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరనున్నారనే సంచలన విషయం వెల్లడించారు. అయితే, తన తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని వెంకట్‌రెడ్డి ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీలో చేరినా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయబో నని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళుతున్నారంటే టీఆర్ఎస్కు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని పదేపదే చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి మరోసారి దానిని పునరుద్ఘాటించారు. తనలాంటి వాడు చేరితే బీజేపీ మరింత బలపడుతుందని, ఆ పార్టీలో ఎలాంటి పదవి ఆశించడంలేదని ఆయన పేర్కొన్నారు. టైటానిక్‌లో తనలాంటి హీరో ఉన్నా మునకే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, టైటానిక్‌లో తనలాంటి హీరో ఉన్నా మునగక తప్పదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గడువు ముగిసిన ఔషధం మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసువెళ్లేందుకు ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదన్నారు. కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అంటే తనకు గౌరవమని, రాష్ట్రంలో నాయకత్వలోపం వల్లే కాంగ్రెస్‌కి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. చిరుమర్తికి నెలకు రూ.50 వేల జీతమిచ్చా... తమకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ద్రోహం చేశారని, కష్టాల్లో ఉంటే నెలకు రూ.50 వేలు జీతమిచ్చి బతికిచ్చానని, ఆయనను ఎమ్మెల్యే చేసింది కూడా తానేనని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మీ గొంతు మీరు కోసుకున్నట్టే: సోలిపేట అసెంబ్లీ ఆవరణలో రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామచంద్రారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. ‘బీజేపీలో చేరితో మీ గొంతు కోసుకున్నట్టే’అని రాజగోపాల్‌ను ఉద్దేశించి సోలిపేట వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇప్పటికే ఓవర్లోడై ఉందని, తమది కూడా ఓవర్ వెయిటని, దాంతో మునుగుతారని రాజగోపాల్ బదులిచ్చారు. పార్టీ మారిన ‘చిరుమర్తిని తప్పుపడుతున్నారు, మరి బీజేపీలోకి మీరెలా వెళతారు’అని సోలిపేట ప్రశ్నించగా ఆయనను ఎమ్మెల్యే చేసింది కూడా తానేనని రాజగోపాల్‌రెడ్డి సమాధానమిచ్చారు. తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే: కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లేదిలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరిన తర్వాత తన సోదరుడు వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వస్తారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. తన తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని, మరో జన్మ ఉంటే అప్పుడూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. -
రాజగోపాల్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారో నాకు చెప్పారు
సాక్షి, న్యూఢిల్లీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో పార్టీ వీడుతున్నారో తనకు చెప్పారన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏఐసీసీ సమావేశం నిమిత్తం గురువారం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్.. మీడియాతో మాట్లాడారు. రాజకీయ కారణాలతో పార్టీ మారే వారికి ఏదైనా చెప్పొచ్చన్నారు. కానీ ఆర్థికపరమైన కారణాలతో వెళ్లే వారికి ఏం చెప్పగలమని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో పార్టీ వీడుతున్నారో తనకు చెప్పారని తెలిపారు. వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా చెబుతారన్నారు. సమావేశం అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు ఉత్తమ్. -
కోమటిరెడ్డి ఎదురుపడటంతో.. కలిశానంతే!
సాక్షి, భువనగిరి: భువనగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నరసయ్య ఓడిపోవడం చాలా బాధాకరమని ఆ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బూర ఓటమికి తానే కారణమంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బూర నరసయ్య ఓడిపోతారని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. ఈ అంశంపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోడ్డురోలర్ గుర్తువల్లే భువనగిరి లోక్‌సభ స్థానంలో తాము ఓడిపోయాం తప్ప వేరే కారణం లేదన్నారు. ‘బూర ఓటమికి నేనే కారణమంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని చూస్తే చాలా బాధేస్తోంది’ అని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక హోటల్లో టాయిలెట్‌కు వచ్చిన సందర్భంలో ఎదురుపడ్డారని, అక్కడే ఉండటంతో తనను కాకతాళీయంగా కలిశారని అన్నారు. ఇది రహస్యంగా జరిగింది కాదని, అక్కడ అందరూ ఉన్నారని, ఇదంతా కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే జరిగిందని వివరించారు. తమ మధ్య ఎలాంటి ఇతర సంభాషణ జరగలేదని, ఇలా కలిసి అలా వెళ్లిపోయామని పేర్కొన్నారు. బొమ్మల రామరం మండలంలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్న మాటల్ని ఎంపీ పీఏ, ఎమ్మెల్యే మధ్య సంభాషణగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇంత ఘోరంగా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఈ సంభాషణను వైరల్ చేసిన సైకోను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తానెంటో భువనగిరి ప్రజలకు తెలుసని, ఎంపీ బూర గెలుపుకోసం అందరమూ కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనమీద ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భువనగిరిలో వందశాతం ఎగిరేది గులాబీ జెండాయేనని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలు రక్షసానందం పొందుతున్నాయన్నారు. ఫోన్ సంభాషణలో మాట్లాడుకున్న వ్యక్తులైన బాలనర్సింహ యాదవ్, మల్లారెడ్డి కూడా ఈ ప్రెస్మీట్లో మాట్లాడారు. జన సమీకరణ కోసమే మల్లారెడ్డితో తాను ఫోన్లో మాట్లాడానని, సన్నిహిత సంబంధాలు కారణంగా తాము సరదాగా మాట్లాడుకున్నామని బాలనర్సింహ యాదవ్ పేర్కొన్నారు. తాము మాట్లాడుకున్న దానిని సోషల్ మీడియాలో ఇలా వక్రీకరించి వైరల్ చేయడం బాధాకరమని, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన అంశంపై తాము మాట్లాడుకున్నామని, భువనగిరి నియోజకవర్గానికి ఈ సంభాషణ విషయంలో ఎలాంటి సంబంధం లేదన్నారు. -
‘టీఆర్ఎస్ ప్రభుత్వం 6 మాసాల్లో పడిపోతుంది’
యాదాద్రి భువనగిరి జిల్లా : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిని బట్టబయలు చేసి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాక్యానించారు. మంగళవారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఆరు మాసాల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోబోతుందని జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రఖజానాలో డబ్బులు లేవు.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వముందని విమర్శించారు. 2023లో ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్‌ది ప్రజావ్యతిరేక పాలన
మునుగోడు : కేసీఆర్‌ది ప్రజావ్యతిరేక పాలన అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మునుగోడులోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే మునుగోడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేదని, తాము వైఎస్ అభిమానులమని, ఆయన చలువతోనే ఉదయసముద్రం ప్రాజెక్టు మంజూరు చేయించి 90 శాతం పనులు పూర్తి చేయించామన్నారు. కానీ ప్రాజెక్టు పూర్తయితే కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఎక్కడ పేరు వస్తుందోనని సీఎం కేసీఆర్ స్వార్థంతో 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, రానున్న రోజులల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు. ప్రతి కార్యకర్త ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. బరిలో నిలిచే అభ్యర్థులను 15 మందితో ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు ఎంపిక చేస్తారని, వారి సూచనల ప్రకారం గెలుపునకు శ్రమించాలన్నారు. ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అందరిని కలుపుకొని ఆయా గ్రామాల్లోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్నేత, రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పొలగోని సత్యంగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు జాల వెంకన్నగౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గుర్రం సత్యం, బూడిద లింగయ్య యాదవ్, పాలకూరి యాదయ్యగౌడ్, దేశిడి యాదయ్యగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, చెరుపల్లి వెంకన్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
‘కేటీఆర్ రూపాయి సిద్దిపేటలో చెల్లుతుందా?’
చౌటుప్పల్: నల్లగొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా? అంటూ పదేపదే విమర్శిస్తున్న కేటీఆర్ రూపాయి సిద్దిపేటలో చెల్లుతుందా? అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దామెర గ్రామంలో శనివారం ఆయన చౌటుప్పల్, నారాయణపురం మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లకు దమ్ముంటే మాజీ మంత్రి హరీశ్‌రావుపై సిద్దిపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. సొంత ఊర్లను వదిలి తండ్రీకొడుకులిద్దరూ.. వలస వెళ్లారన్నారు. తన సోదరుడు వలస రాలేదని, తమ స్వగ్రామం బ్రాహ్మణవెల్లంల భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి 6 ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయని, కేసీఆర్‌కు సైతం ఈ విషయం ఇప్పటికే తెలిసిందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
అక్కడ గెలిచారు ...! ఇక్కడా గెలిచారు !!
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన వివిధ ఎన్నికల్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు.. పార్లమెంట్‌కు ఎన్నికై ఎంపీలుగా కూడా పనిచేశారు. జిల్లాలో ఆ ఘనత ఐదుగురు నాయకులకు దక్కగా బయటి జిల్లాల నుంచి ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన వారు మరో ఇద్దరున్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధులు రావినారాయణ రెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేశారు. వడ్డేపల్లి కాశీరాం కూడా మొదట ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తొలుత ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. అటు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారే కాకుండా, ఎమ్మెల్యేలుగా విజయాలు సాధించాక, ఎమ్మెల్సీలుగా శాసన మండలి, రాజ్యసభ సభ్యులుగా పార్లమెంటు గడప తొక్కిన వారూ ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి నల్లగొండకు వలస వచ్చి దేవరకొండ ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రనాయక్ వరంగల్ జిల్లాలో ఎంపీగా పనిచేశారు. మిర్యాలగూడెం ఎంపీగా రెండు పర్యాయాలు వరుసగా గెలిచిన ఎస్.జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యేగా కూడా పలుమార్లు గెలిచారు. వీరే కాకుండా.. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేయగా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన 2009 ఎన్నికల్లోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో అదే స్థానంలో ఓడిపోయిన ఆయన స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యుడిగా విజయం సాధించారు. మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేసి 2018 శాసన సభ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వడ్డేపల్లి కాశీరాం కాంగ్రెస్ టికెట్‌పై వడ్డేపల్లి కాశీరాం నల్లగొండ పార్లమెంట్ స్థానానికి 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ఆ తర్వాత 1962లో మిర్యాలగూడెం నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. కానీ రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం (రద్దయింది) నుంచి కాశీరాం 1967, 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. బొమ్మగాని ధర్మభిక్షం సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం సైతం రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన నకిరేకల్ నియోజకవర్గం నుంచి 1957 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, నల్లగొండ నియోజకవర్గం నుంచి 1962 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. ఆ తర్వాత నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరసగా 1991, 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. చకిలం శ్రీనివాసరావు నల్లగొండ ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన చకిలం శ్రీనివాస్‌రావు మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. నల్లగొండ శాసనసభా నియోజకవర్గం నుంచి ఆయన 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972 ఎన్నికల్లోనూ ఆయన ఇదే రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత నల్లగొండ నుంచి మిర్యాలగూడెం అసెంబ్లీ స్థానం నుంచి 1983 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1989 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభా స్థానం (పూర్వపు మిర్యాలగూడెం) నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ ? రావినారాయణరెడ్డి సాయుధపోరాటయోధుడు రావినారాయణరెడ్డి 1952 ఎన్నికల్లో ఎంపీగా అత్యధిక మెజార్టీ సాధించి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా రెండు పదవులకు పోటీచేసి రెండు చోట్లా గెలిచారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. ఆయన 1957 ఎమ్మెల్యేగా, 1962లో రెండోసారి ఎంపీగా విజయాలు నమోదు చేసుకున్నారు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి సాయుధపోరాట సేనాని భీమిరెడ్డి నర్సింహారెడ్డి శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో విజయాలు నమోదు చేసుకున్నారు. ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1967లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత మిర్యాలగూడెం పార్లమెంట్ నియోజకవర్గం (2009 ఎన్నికల నుంచి రద్దు అయింది) సీపీఎం అభ్యర్థిగా 1971, 1984, 1991 ఎన్నికల్లో గెలిచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన నేతగా రికార్డు నెలకొల్పారు. -
సార్వత్రిక ఎన్నికలకు ఐదు కమిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ విజయశాంతి నియమితులయ్యారు. పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మీడియా సమన్వయ కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్లను నియమించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొత్తం 5 కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం రాత్రి ఆయా కమిటీల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కమిటీ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ్‌కుమార్, మహ్మద్ అజారుద్దీన్, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఎస్.జైపాల్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, డాక్టర్ జె.గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ, రవీందర్‌నాయక్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డి.సుధీర్‌రెడ్డి. ఎన్నికల కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులు.. గూడూరు నారాయణరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శులు, తెలంగాణ నుంచి ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు. ప్రచార కమిటీ.. విజయశాంతి (చైర్పర్సన్), డీకే అరుణ (కో చైర్పర్సన్), టి.జగ్గారెడ్డి, అనిల్ యాదవ్, ఎన్.శారద, ఎస్.కె.అబ్దుల్లా సొహైల్, బెల్లయ్య నాయక్, వెంకటేశ్, కిరణ్ రెడ్డి, మానవతారాయ్, విజయ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, హెచ్.వేణుగోపాల్, దీపక్ జాన్, అమర్, రామ్మోహన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఆత్రం సక్కు ఆసిఫా, టి.నాగయ్య. పబ్లిసిటీ కమిటీ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (చైర్మన్), ఎస్.గంగారాం(కో చైర్మన్), మల్లు రవి (కన్వీనర్), సురేంద్రరెడ్డి (కన్వీనర్), సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, సబితాఇంద్రారెడ్డి, హరిప్రియా నాయక్, సీతక్క, వనమా వెంకటేశ్వరరావు, పోడెం వీరయ్య, చిరుమర్తి లింగయ్య, కె.హర్షవర్ధన్‌రెడ్డి, భిక్షపతి యాదవ్, గూడూరు నారాయణరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్. మీడియా సమన్వయ కమిటీ.. మధుయాష్కీ గౌడ్(చైర్మన్), దాసోజు శ్రవణ్‌కుమార్(కన్వీనర్), మల్లు రవి, సురేశ్ కుమార్, ఇందిరా శోభన్. కో ఆర్డినేషన్ కమిటీ.. ఆర్సీ కుంతియా (చైర్మన్), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కన్వీనర్), భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, రేవంత్‌రెడ్డి, ఎండీ అజారుద్దీన్, జెట్టి కుసుమ్‌కుమార్, గీతారెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, డీకే అరుణ, టి.జీవన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బలరాంనాయక్, జైపాల్‌రెడ్డి, రేణుకా చౌదరి, మర్రి శశిధర్‌రెడ్డి, సబి తా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, డి.శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, రాపోలు ఆనంద్ భాస్కర్, మల్లు రవి, గండ్ర వెంకట రమణారెడ్డి, జగ్గారెడ్డి, రేగా కాంతారావు, ఎం.రంగారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కె.గౌరీశంకర్, సీతక్క, డాక్ట ర్ వినయ్‌కుమార్, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ తెలంగాణ కార్యదర్శులు ఎక్స్ అఫీషియో సభ్యులు. -
కేసీఆర్‌నే కాంగ్రెస్‌లోకి తీసుకొస్తా
మునుగోడు: టీఆర్ఎస్ పార్టీకి భయపడి తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తూ పార్టీ లోనే కొనసాగుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే సీఎం కేసీఆర్‌నే కాంగ్రెస్‌లోకి తీసుకొస్తానని పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన నియోజకవర్గస్థాయి కృతజ్ఞతాభినందన సభలో ఆయన మాట్లాడారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతానన్న ప్రచారం అవాస్తవం అని అన్నారు. సీఎం కేసీఆర్ జిమ్మిక్కులు చేసి ఈ ఎన్నికల్లో గెలిచారని, ఆ పార్టీకి అన్ని సీట్లు ఎలా వచ్చాయో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. కోదాడ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నంలలో ఓటర్లు వేసిన ఓట్ల కంటే అదనంగా పోలైయినట్లు ఆరోపించారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని, రానున్న పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధాని చేసి తీరుతానన్నారు. ఇందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ గతంలో, ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా అసెంబ్లీలో నిలదీస్తానన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటు కు గురైన మునుగోడుని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే తాను ఎమ్మెల్సీ పదవిని వదులుకొని వచ్చానని పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు మహాకూటమి అభ్యర్థులతో కలిసి సీఎంపై పోరాడి చెర్లగూడెం రిజర్వాయర్ పనులు పూర్తి చేయించి సాగునీరు అందిస్తానని తెలిపారు. సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్నేత, పల్లె రవికుమార్, కర్నాటి వెంకటేశం, వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడును అభివృద్ధి చేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, సంస్థాన్ నారాయణపురం : మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ, రోడ్‌షో మండలంలోని గుడిమల్కాపురం, సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక గ్రామాల మీదుగా మునుగోడు మండలం వరకు సాగింది. అంతకు ముందు స్థానిక ప్రాచీన శివాలయంలో రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తానన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ గడ్డం మురళీ«ధర్‌రెడ్డి, నయీంషరీఫ్, కె.లింగయ్య, బుజ్జి, వెలిజాల రామచంద్రం, ఏపూర్ సతీష్, మందుగుల బాలకృష్ణ, బచ్చనగోని గాలయ్య, కుందారపు యాదయ్య, శంకర్, శంకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, గడ్డం యాదయ్య, వంగూరు సత్తయ్య, యాదయ్య, రఘు, వెంకన్న తదితరులున్నారు. సర్వేల్లో ఉద్రిక్తత.. సర్వేల్ గ్రామంలో రాజగోపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తల ర్యాలీ అక్కడికి చేరుకుంది. ప్రజాకూటమి, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురెదురు పడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్ఐ మల్లీశ్వరి, తన సిబ్బందితో జోక్యం చేసుకొని ర్యాలీని అక్కడి నుంచి పంపించారు. గుజ్జలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీగా నువ్వు ఏం అభివృద్ధి చేశావు అంటూ రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. దీంతో కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రికంగా మారుతుండటంతో పోలీస్‌లు జోక్యం చేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడంతో ఉద్రికత్త సద్దుమణింది. అనంతరం రాజగోపాల్‌రెడ్డి ప్రచారం కొనసాగింది. మరిన్ని వార్తాలు... -
కాంగ్రెస్‌వైపే ప్రజాదరణ : కోమటిరెడ్డి లక్ష్మి
సాక్షి, నాంపల్లి: కాంగ్రెస్‌వైపే ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. రానున్నది మహాకూటమి ప్రభుత్వమని అన్నారు. కార్యకర్తలకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంత రాజుగౌడ్, జెడ్పీటీసీ మేతరి యాదయ్య, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, బీమానాయక్, పాక నగేష్, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులున్నారు. కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేయక తప్పదు మునుగోడు : రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సీఎం కేసీఆర్ ఎన్నికల అనంతరం ప్రగతి భవన్ ఖాళీ చేయకతప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్నేత జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజగోపాల్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని శుక్రవారం మండలంలోని సింగారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మహాకూటమి నాయకులు జిల్లా వెంకటేశం, కుంభం భూపాల్‌రెడ్డి, జంగం రాములు, రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, సోమగోని రమేష్, కుంభం సురేందర్‌రెడ్డి, మునగాల పోతులూరాచారి, ఉప్పునూతల రమేష్, వట్టి వెంకట్‌రెడ్డి, కోడి చం ద్రయ్య, కోరే రామచంద్రం పాల్గొన్నారు. రాజగోపాల్‌రెడ్డికే తమ మద్దతు డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు ఇస్తుం దని ఆ సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కొమిరె స్వామి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేయి గుర్తుకు ఓటువేయాలని కోరుతూ శుక్రవారం మునుగోడులో సంఘం నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పందుల మల్లేష్, సంపత్‌కుమార్, గోసుకొండ శంకర్, దుబ్బ భాస్కర్, పోలే వెంకన్న, పందుల సైదులు, దుబ్బ గోపాల్, పందుల పర్వతాలు, లింగస్వామి పాల్గొన్నారు. చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చండూరు: చెయ్యి గుర్తుకు ఓటు వేసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ చండూరు కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కోడి గిరిబాబు, కోడి శ్రీనివాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
చిరుమర్తి లింగయ్యకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు
-
ఆయనకు టికెట్ రాకపోతే.. నేను పోటీ చేయను..!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ టికెట్ ఆశిస్తున్న చిరుమర్తి లింగయ్యకు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ‘లింగయ్యకు నకిరేకల్ టికెట్ తప్పక వస్తుంది. అలా జరగని పక్షంలో నేను మునుగోడు నుంచి పోటీచేసే ప్రసక్తే లేదు. నా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్లగొండ నుంచి పోటీ చేయడు’ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇంటిపార్టీకి ఒక సీటు కేటాయిస్తామని కుంతియా చేసిన ప్రకటనతో ఈ అయోమయం నెలకొందని అన్నారు. ‘గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని నమ్ముతున్నాను. భక్త చరణ్‌దాస్ నిజాయితీపరుడు. ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణల్లో నిజం లేదు. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, ఓయూ జేఏసీ నేత మానవత రాయ్‌కు టికెట్లు ఇవ్వనున్నారు’ అని రాజగోపాల్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. టికెట్ల ఎంపిక ప్రక్రియ చాలా బాగా జరిగిందని అన్నారు. టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని అన్నారు. పాల్వాయి స్రవంతికి నా సహకారం ఎప్పుడూ ఉంటుందనీ, ఆమె రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. -
‘మీపై కూడా నకిలీ పాస్‌పోర్టు కేసు ఉంది.. జాగ్రత్త’
నల్గొండ: నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్యకు, మునుగోడులో తనకు టికెట్ రాదని దుప్ర్పచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ.. చిరుమర్తి లింగయ్యకు, తనకు కచ్చితంగా టిక్కెట్ వస్తుందని, మమ్మల్ని గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. రేవంత్ రెడ్డిపై , జగ్గారెడ్డిలపై అధికారం ఉంది కదా అని కేసులు పెట్టడం, దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. తాము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో రోజులుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు..ఇప్పుడే గుర్తొచ్చిందా ఈడీ అధికారులకు రేవంత్ కుటుంబం వ్యాపారం చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్‌రావులపైన కూడ నకిలీ పాస్‌పోర్టు కేసు ఉంది.. జాగ్రత్త.. పాత కేసులు తిరగదోడి కేసులు పెట్టాలంటే ఒక్క నిమిషం పట్టదని టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. -
టికెట్లు అమ్ముకునే వాళ్లా షోకాజ్లిచ్చేది?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొందరు సొంత ప్రయోజనాలు, స్వార్థం కోసం తమ లాంటి యువకులను, తెలంగాణ కోసం కొట్లాడిన వారిని బలిచేస్తున్నారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. తనను చూసి ఓర్వలేని వ్యక్తులు ఏదో ఒకటి చేసి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టికెట్లు అమ్ముకునే వారితో షోకాజ్ నోటీసులు పంపుతారా? అని నిలదీశారు. ‘పార్టీలో పోస్టులు అమ్ముకుంటారు. కమిటీలు వేసేందుకు డబ్బులు తీసుకుంటారు. టికెట్లు అమ్ముకుంటారు. పక్క పార్టీలతో కుమ్మక్కవుతారు. అలాంటి వాళ్లా నాకు షోకాజ్ నోటీసులిచ్చేది’అని ప్రశ్నించారు. కార్యకర్తల మనోభావాలు ఏమిటో తెలియని వారు నాకు నోటీసులిస్తారా? కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని గుర్తించకుండా రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలంటారా? అని ప్రశ్నలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్చార్జి ఆర్.సి. కుంతియాతోపాటు పార్టీ కమిటీలపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపిన నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేసేందుకుగల కారణాలను వివరించారు. కేసీఆర్‌ను తిడితేనే పదవులా? పార్టీలో అంతర్గతంగా మాట్లాడి సూచనలు చేస్తే పట్టించుకోరని, బలంగా ఏదైనా చెబితే పక్కనపెడతారని, అందుకనే బహిరంగంగా మట్లాడాల్సి వచ్చిందని రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, కేవలం ఆవేదనతో కూడినవేనని చెప్పారు. తన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందో లేదో పార్టీ సీనియర్లు గుండెలపై చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీకి సేవ చేస్తామని, తమ లాంటి యువ నాయకులను, కేసీఆర్‌పై గట్టిగా కొట్లాడుతున్న వారిని ముందు పెట్టాలని అడిగడం తప్పేనా? అని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు తమను బలంగా కోరుకుటంన్నారని, అది మరచిపోయి అనర్హులు, పార్టీ మారిన వారు, జైళ్లకు పోయిన వారిని కమిటీల్లో నియమించారని దుయ్యబట్టారు. కమిటీలో కేవలం 25 శాతం మందే అర్హులున్నారని, మిగతా వారంతా అనర్హులేనన్నారు. బూతు పురాణం మాట్లాడితే, కేసీఆర్‌ను తిడితేనా పదవులు ఇస్తారా? అని అడిగారు. రాష్ట్రంలో బలంగా టీఆర్ఎస్ వ్యతిరేక వపనాలు వీస్తున్నాయని, ఈ సమయంలో సత్తా ఉన్న నేతలను ముందుపెట్టాలని కోరారు. ‘మీరే ముఖ్యమంత్రులు, మంత్రులు అవ్వండి. మాకెలాంటి పదవులు వద్దు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం. కానీ మాలాంటి యువకులను ప్రోత్సహించండి. మా సేవలు వాడుకోండి. మంచి వాళ్లకు టికెట్లివ్వండి’అని రాజగోపాల్‌రెడ్డి సూచించారు. పార్టీ నిద్రపోతోంది... కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాల్సిన బాధ్యత సీనియర్లపై ఉందని, అయితే పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించడంలో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లోనూ సమన్వయం లేకనే పార్టీ ఓడిందన్నారు. పార్టీలో అందరూ ముఖ్యమంత్రి, మంత్రులు కావాలని కోరుకుంటున్న వారు తప్పితే కష్టపడ్డ వారిని ప్రోత్సహించే ఆలోచన ఎవరిలోనూ లేదన్నారు. టీఆర్ఎస్లో చేరిన కె.ఆర్. సురేశ్‌రెడ్డి పేరు పార్టీ కమిటీల్లో ఉందంటేనే పార్టీ నిద్రపోతోందని అర్థమవుతోందని, కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారని, కమిటీలు ఇష్టారీతిగా నియమించారని ఆరోపించారు. ఎన్నికల కమిటీలో 41 మంది ఏమిటని, అంత మంది ఉంటే వారు కొట్టుకోవడానికే సరిపోతుందన్నారు. ఇప్పటికైనా కమిటీని 9 మందికి కుదించాలన్నారు. ఎన్నికల హామీలన్నీ ఉత్తమ్ చెప్పేశాక మేనిఫెస్టో కమిటీ ఎందుకని ప్రశ్నించారు. రూ. 2 లక్షల చొప్పున రుణ మాఫీ, అందరికీ సన్న బియ్యం, ఉద్యోగాలు, పింఛన్లు పెంపు తదితర హామీలను ప్రకటించాక మెనిఫెస్టో కమిటీ ఏం చేస్తుందన్నారు. వ్యతిరేక శక్తులను ఉత్తమ్ తయారు చేశారు ... పార్టీ నుంచి తనను బయటకు పంపే ఆలోచన రాష్ట్ర ఇన్చార్జి కుంతియాకుగానీ, అధిష్టానానికి కానీ లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తన ఎదుగుదలను ఓర్వలేని వ్యక్తులే బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే తనను పార్టీ నుంచి బయటకు పంపే దమ్ము, ధైర్యం స్వార్ధపరులకు లేదన్నారు. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో తనకు వ్యతిరేక శక్తులుగా కొందరిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తయారు చేశారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కార్యకర్తల మనోభావాలు చెబితే బయటకు పంపి మీ కళ్లను మీరే పొడుచుకుంటారా..? అని ప్రశ్నించారు. తనలాంటి వారిని బయటకు పంపితే పార్టీకే నష్టమన్నారు. సీనియర్ నేతలను సమన్వయం చేయడంలో కుంతియా విఫలమవుతున్నారని, తనలాంటి యువకుల సూచనలు వినకుండా ఉత్తమ్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని విమర్శించారు. దీనిపై హైకమాండ్ ఆలోచించాలన్నారు. పార్టీలో కోవర్టులున్నారు... కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారని రాజగోపాల్‌రెడ్డి మరో బాంబు పేల్చారు. ఎదుటి పార్టీ అభ్యర్థిపై బలహీన వ్యక్తలను రంగంలోకి దింపే ప్రయత్నాలను కోవర్టులు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గత ఎన్నికల్లో పార్టీని ఓడించారని, ఇప్పుడూ అదే చేయబోతున్నారన్నారు. తాను పార్టీ మారబోతున్నానన్నది ప్రచారమేనని, తాను పార్టీ మారనని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా మరో మూడేళ్ల పదవి ఉందని, అయితే పార్టీ పోటీ చేయమంటేనే మునుగోడు నుంచి చేస్తానని లేదంటే చేయనన్నారు. తనకు అందిన షోకాజ్ నోటీసుపై లేఖ రూపంలో వివరణ ఇస్తానని, దానిపై పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడతానన్నారు. -
శనిలా తగిలావు కుంతియా..
సాక్షి, యాదాద్రి: ‘ఎక్కడి నుంచి వచ్చావు.. మాకు శనిలాగా తగిలావు నాయనా.. ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం, కార్యకర్తల కోసం కష్టపడుతున్న నాయకులను కాదని బ్రోకర్‌నా కొడుకులను ఎక్కడి నుంచి తెచ్చావు.. అని ఫోన్ చేసి కుంతియాను నిలదీశా.. నాకు కుంతియా అంటే భయమా.. కుంతియాకు భయపడాలా.. వంద మంది కుంతియాలు వచ్చినా నన్నేం చేయలేరు, నా బీఫారం ఆపలేరు. చాలా బాధగా ఉంది.. ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం కష్టపడేవారికి టికెట్లు ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుంది తప్ప గాంధీభవన్‌లో టీవీల ముందు కూర్చుని మాట్లాడేవారికి, నమస్తే పెడితే ప్రతి నమస్కారం చేయనివారికి టికెట్లు ఇస్తే పార్టీ గెలుస్తుందా? పైరవీకారులను దూరంగా పెట్టాలని, కోమటిరెడ్డి బ్రదర్స్ అవసరమా.. లేదా.. అని నిలదీశాను’ అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్వరంతో అధిష్టానంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. బుధవారం కాంగ్రెస్ ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ అధిష్టానంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పైరవీకారులను పక్కన పెట్టాలని, మామూలు వ్యక్తులను కాకుండా ప్రజల్లో మమేకమైనవారికి టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఏఐసీసీ ప్రకటించిన వివిధ కమిటీల్లో వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తులకు పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. కమిటీని చూసి నివ్వెరపోయానని, ఇదే విషయాన్ని రాష్ట్ర ఇన్చార్జి కుంతియాకు ఫోన్ చేసి నిలదీశానని తెలిపారు. తెలంగాణకు శనిలా తగిలావని నిలదీశానన్నారు. ప్రజలకు ఎవరు అవసరమో తెలుసుకోకుండా బ్రోకర్లను ఎక్కడి నుంచి తీసుకువచ్చావని కుంతియాను ప్రశ్నించానని చెప్పారు. కాంగ్రెస్ నేతలే అవమానించారు... ప్రజల కోసం బతుకుతున్నానని, ప్రజల మధ్యన ఉంటానని, అంతకుమించి ఎవరికీ భయపడాల్సిన, తలవంచాల్సిన అవసరం లేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉన్నా తప్పుడు నిర్ణయాలతో ఓడిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలిచినా, రెండున్నరేళ్లుగా తనను వందసార్లు కాంగ్రెస్ నాయకులే అవమానించి ఇంట్లో కూర్చోబెట్టారని ధ్వజమెత్తారు. పార్టీ గెలవాలంటే మీరైతేనే కుదురుతుందని కార్యకర్తలు బతిమిలాడితే మునుగోడులో పోటీ చేసేందుకు ముందుకు వచ్చానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి చెంచాలను పెట్టుకున్నా, నయీం ముఠాను అడ్డు ఉంచుకున్నా, 150 మందిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసినా రెండు వందల ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్పై విజయం సాధించానని గుర్తుచేశారు. ఆ విజయం వల్ల జిల్లా, తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో గుర్తింపు వచ్చిందన్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా సేవ చేసేందుకే వస్తున్నానని, పదవీకాంక్షతో కాదని తెలిపారు. కార్యకర్తలకు జీవితం అంకితం కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుని వారి వెంటే ఉంటూ తన జీవితాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తానని రాజగోపాల్‌రెడ్డి ఉద్వేగంగా ప్రకటించారు. ‘మన ప్రభుత్వ ఏర్పాటు ద్వారా మనందరం బాగుంటాం, మన పార్టీ బాగుంటుంది, మన ప్రాంతం బాగుపడుతుంది’ అంటూ వివరించారు. ఎవరినీ విమర్శించకుండా మంచి మనసుతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు సూచించారు. సోనియాగాంధీ, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన తనను 2009 ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలందిస్తున్న తరుణంలో గ్రూప్ తగాదాల మూలంగా 2014లో ఓటమి ఎదురైందని తెలిపారు. ఏది ఏమైనా మునుగోడు బరిలో నిలిచి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘మీ అందరి మనసులో ఏముందో నాకు తెలుసు. మనందరి లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటేన’ని ఆయన అన్నారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. ఎవరినో విమర్శించాలన్నది తన ఆలోచన కాదని, మంచి మనసుతో ముందుకు సాగుదామని అన్నారు. మనందరి లక్ష్యం ఒక్కటేనని, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటేనని అన్నారు. -
అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు నుంచి పోటీ..
యాదాద్రి భువనగిరి : అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి పోటీచేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ..నయీమ్ ఎన్కౌంటర్ జరిగి రెండేళ్లు అవుతున్నా ...అతని వల్ల లబ్ధిపొందిన వారిని అరెస్ట్ చేయలేదని విమర్శించారు. 24 గంటల కరెంటు వల్ల భూస్వాములకే లాభమన్నారు. మునుగొడు, భువనగిరి నియోజకవర్గాలలో పీసీసీ పెట్టిన ఇంచార్జిలను తాము గుర్తించటం లేదని అన్నారు. పార్టీ హైకమాండ్... పీసీసీ బాధ్యతలను కోమటిరెడ్డి సోదరులకు అప్పగిస్తే తెలంగాణలో పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తామని తెలిపారు. -
సోనియా రుణం తీర్చుకుందాం: కోమటిరెడ్డి
నల్లగొండ సభలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి పిలుపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు 60 ఏళ్లలో ఎన్నో పోరాటాలు జరిగాయి. వేలాది మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేశారు. ఈ ఆరు దశాబ్దాల్లో ఎందరో ప్రధానమంత్రులు వచ్చారు, పోయారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం సోనియాగాంధీయే. ఇచ్చిన హామీని ఆమె నిలబెట్టుకున్నారు. ఈ ప్రాంత ప్రజల కలలను నిజం చేసిన దేవత సోనియమ్మ. ఆమె రుణాన్ని ఈ ఎన్నికల ద్వారా తీర్చుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం’ అని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం నల్లగొండ అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , భువనగిరి లోక్‌సభా స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం కోమటిరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రె స్ జయభేరి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాకారమవుతుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరిగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీలది అనైతిక పొత్తు అని అన్న ఆయన, టీడీపీకి ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టేనని వ్యాఖ్యానించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, రాహుల్‌ను ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.