సాక్షి, న్యూఢిల్లీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో పార్టీ వీడుతున్నారో తనకు చెప్పారన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏఐసీసీ సమావేశం నిమిత్తం గురువారం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్.. మీడియాతో మాట్లాడారు. రాజకీయ కారణాలతో పార్టీ మారే వారికి ఏదైనా చెప్పొచ్చన్నారు. కానీ ఆర్థికపరమైన కారణాలతో వెళ్లే వారికి ఏం చెప్పగలమని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో పార్టీ వీడుతున్నారో తనకు చెప్పారని తెలిపారు. వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా చెబుతారన్నారు. సమావేశం అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు ఉత్తమ్.
Comments
Please login to add a commentAdd a comment