దామెరభీమనపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న కోమటిరెడ్డి లక్ష్మి,
సాక్షి, నాంపల్లి: కాంగ్రెస్‌వైపే ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. రానున్నది మహాకూటమి ప్రభుత్వమని అన్నారు. కార్యకర్తలకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంత రాజుగౌడ్, జెడ్పీటీసీ మేతరి యాదయ్య, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, బీమానాయక్, పాక నగేష్, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులున్నారు.
కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేయక తప్పదు
మునుగోడు : రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సీఎం కేసీఆర్ ఎన్నికల అనంతరం ప్రగతి భవన్ ఖాళీ చేయకతప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌నేత జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజగోపాల్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని శుక్రవారం మండలంలోని సింగారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మహాకూటమి నాయకులు జిల్లా వెంకటేశం, కుంభం భూపాల్‌రెడ్డి, జంగం రాములు, రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, సోమగోని రమేష్, కుంభం సురేందర్‌రెడ్డి, మునగాల పోతులూరాచారి, ఉప్పునూతల రమేష్, వట్టి వెంకట్‌రెడ్డి, కోడి చం ద్రయ్య, కోరే రామచంద్రం పాల్గొన్నారు.
రాజగోపాల్‌రెడ్డికే తమ మద్దతు
డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు ఇస్తుం దని ఆ సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమిరె స్వామి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేయి గుర్తుకు ఓటువేయాలని కోరుతూ శుక్రవారం మునుగోడులో సంఘం నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పందుల మల్లేష్, సంపత్‌కుమార్, గోసుకొండ శంకర్, దుబ్బ భాస్కర్, పోలే వెంకన్న, పందుల సైదులు, దుబ్బ గోపాల్, పందుల పర్వతాలు, లింగస్వామి పాల్గొన్నారు.
చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం
చండూరు: చెయ్యి గుర్తుకు ఓటు వేసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ చండూరు కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కోడి గిరిబాబు, కోడి శ్రీనివాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment