
సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడుకు వచ్చినా సరే.. నన్ను సూర్యాపేటకు రమ్మన్నా సరే! నాపై పోటీకి సిద్ధమా?’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయిం ట్‌లో మాట్లాడుతూ, అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని, తనను వ్యక్తి గతంగా కాంట్రాక్టర్ అనడం బాధాకరమని అన్నారు. తెలంగాణ కోసం వ్యాపారాలు నష్ట పోయామని, మంత్రి పదవి సైతం వదులుకు న్నామని గుర్తుచేశారు. 2014 ముందు జగదీశ్ రెడ్డి ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత? అని ప్రశ్నిం చారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకు నేం దుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సభలో కోరితే మంత్రి సమాధానంలో తన పేరు ప్రసా వించ కుండా శ్రీధర్‌బాబు, భట్టి పేర్లనే చెప్పి తనను కించపరచారని దుయ్యబట్టారు.
మాకు పార్టీ గుర్తింపు ఇవ్వలేదు
కాంగ్రెస్ పార్టీ అధి ష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతోనే తాము పార్టీకి కొంత దూరంగా ఉంటున్నామని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. సీఎల్పీలో మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నుంచి వాళ్లకు పదవులు ఇస్తే ఏం లాభమని, తెలంగాణ కోసం కొట్లా డిన వారికి ప్రాధాన్యమివ్వాలన్నారు. అలా చేయకపోతే పాత కాంగ్రెస్ నేతలు దూరం అవుతారని చెప్పారు. పదవుల విష యంలో తమకు పార్టీ గుర్తింపు ఇవ్వలేద న్నారు. తనకు పార్టీలో ఎవరితో విభేదాలు లేవని, రేవంత్‌తో వ్యక్తిగత విభేదాలు లేవన్న రాజగోపాల్‌రెడ్డి సమర్థత ఉన్న వారికే మాత్రమే పదవులివ్వా లన్నది తన ఉద్దేశమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment