సార్వత్రిక ఎన్నికలకు ఐదు కమిటీలు | Five committees for before elections | Sakshi
Sakshi News home page

సార్వత్రిక ఎన్నికలకు ఐదు కమిటీలు

Feb 1 2019 1:15 AM | Updated on Mar 18 2019 9:02 PM

Five committees for before elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ విజయశాంతి నియమితులయ్యారు. పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మీడియా సమన్వయ కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌లను నియమించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొత్తం 5 కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గురువారం రాత్రి ఆయా కమిటీల వివరాలను మీడియాకు వెల్లడించారు. 

ఎన్నికల కమిటీ.. 
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ్‌కుమార్, మహ్మద్‌ అజారుద్దీన్, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఎస్‌.జైపాల్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, డాక్టర్‌ జె.గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ, రవీందర్‌నాయక్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డి.సుధీర్‌రెడ్డి. 

ఎన్నికల కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులు.. 
గూడూరు నారాయణరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శులు, తెలంగాణ నుంచి ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు. 

ప్రచార కమిటీ.. 
విజయశాంతి (చైర్‌పర్సన్‌), డీకే అరుణ (కో చైర్‌పర్సన్‌), టి.జగ్గారెడ్డి, అనిల్‌ యాదవ్, ఎన్‌.శారద, ఎస్‌.కె.అబ్దుల్లా సొహైల్, బెల్లయ్య నాయక్, వెంకటేశ్, కిరణ్‌ రెడ్డి, మానవతారాయ్, విజయ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, హెచ్‌.వేణుగోపాల్, దీపక్‌ జాన్, అమర్, రామ్మోహన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఆత్రం సక్కు ఆసిఫా, టి.నాగయ్య. 

పబ్లిసిటీ కమిటీ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (చైర్మన్‌), ఎస్‌.గంగారాం(కో చైర్మన్‌), మల్లు రవి (కన్వీనర్‌), సురేంద్రరెడ్డి (కన్వీనర్‌), సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, సబితాఇంద్రారెడ్డి, హరిప్రియా నాయక్, సీతక్క, వనమా వెంకటేశ్వరరావు, పోడెం వీరయ్య, చిరుమర్తి లింగయ్య, కె.హర్షవర్ధన్‌రెడ్డి, భిక్షపతి యాదవ్, గూడూరు నారాయణరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌. 

మీడియా సమన్వయ కమిటీ.. 
మధుయాష్కీ గౌడ్‌(చైర్మన్‌), దాసోజు శ్రవణ్‌కుమార్‌(కన్వీనర్‌), మల్లు రవి, సురేశ్‌ కుమార్, ఇందిరా శోభన్‌.

కో ఆర్డినేషన్‌ కమిటీ.. 
ఆర్సీ కుంతియా (చైర్మన్‌), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కన్వీనర్‌), భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, రేవంత్‌రెడ్డి, ఎండీ అజారుద్దీన్, జెట్టి కుసుమ్‌కుమార్, గీతారెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, డీకే అరుణ, టి.జీవన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బలరాంనాయక్, జైపాల్‌రెడ్డి, రేణుకా చౌదరి, మర్రి శశిధర్‌రెడ్డి, సబి తా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, డి.శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, రాపోలు ఆనంద్‌ భాస్కర్, మల్లు రవి, గండ్ర వెంకట రమణారెడ్డి, జగ్గారెడ్డి, రేగా కాంతారావు, ఎం.రంగారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కె.గౌరీశంకర్, సీతక్క, డాక్ట ర్‌ వినయ్‌కుమార్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ తెలంగాణ కార్యదర్శులు ఎక్స్‌ అఫీషియో సభ్యులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement