
చౌటుప్పల్: నల్లగొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా? అంటూ పదేపదే విమర్శిస్తున్న కేటీఆర్ రూపాయి సిద్దిపేటలో చెల్లుతుందా? అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దామెర గ్రామంలో శనివారం ఆయన చౌటుప్పల్, నారాయణపురం మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లకు దమ్ముంటే మాజీ మంత్రి హరీశ్‌రావుపై సిద్దిపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
సొంత ఊర్లను వదిలి తండ్రీకొడుకులిద్దరూ.. వలస వెళ్లారన్నారు. తన సోదరుడు వలస రాలేదని, తమ స్వగ్రామం బ్రాహ్మణవెల్లంల భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి 6 ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయని, కేసీఆర్‌కు సైతం ఈ విషయం ఇప్పటికే తెలిసిందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment