కేసీఆర్‌ పుట్టినరోజు.. కేటీఆర్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌ | BRS KTR Birthday Wishes To KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పుట్టినరోజు.. కేటీఆర్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Published Mon, Feb 17 2025 11:00 AM | Last Updated on Mon, Feb 17 2025 11:45 AM

BRS KTR Birthday Wishes To KCR

సాక్షి, హైదరాబాద్‌: నేడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదినం. ఈ సందర్బంగా కేసీఆర్‌కు ప్రముఖులు, పార్టీ నేతలు, రాజకీయ నాయకుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ప్రతీ తండ్రీ తమ పిల్లల హీరో అని అంటారు. నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కల కనడం.. దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు. తెలంగాణ అనే కలను ప్రేమించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు. మీరు గర్వంగా మీ కొడుకని పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యం. మీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతీక్షణం కృషి చేస్తా’ అంటూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు.

ఇక, కేసీఆర్‌ కుమార్తె కవిత కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్‌తో ఆశీర్వాదం తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు.

మరోవైపు.. తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణభవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

 

 

ఇదిలా ఉండా.. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఆయన మద్దతుదారులు వేడుకల్లు నిర్వహించారు. మరికొన్నిచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను బీఆర్‌ఎస్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement