
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(పాత చిత్రం)
యాదాద్రి భువనగిరి జిల్లా : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిని బట్టబయలు చేసి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాక్యానించారు. మంగళవారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఆరు మాసాల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోబోతుందని జోస్యం చెప్పారు.
రానున్న రోజుల్లో తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రఖజానాలో డబ్బులు లేవు.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వముందని విమర్శించారు. 2023లో ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment