ఇల్లందకుంట (హుజురాబాద్): పదవుల కోసం పెదవులు మూసుకోలేదని, రైతులు, ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు తనను పార్టీ నుంచి పంపించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం విలాసాగర్‌లో సోమవారం పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తాను రాజీనామా చేస్తేనే సీఎం ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చారని, దళిత బంధు, పెన్షన్‌లు వచ్చాయన్నారు. ఎంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినా తన మీద ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానం తీసుకుపోలేరన్నారు.
చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం
చదవండి: తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించొద్దు
మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల
Published Tue, Aug 31 2021 9:03 AM | Last Updated on Tue, Aug 31 2021 9:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment