minister post
-
అనంతపురం నారాయణ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
-
ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ
-
ఉత్తమ్‌కుమార్ మంత్రిగా అన్‌ఫిట్: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వట్టి దద్దమ్మ అని, ఆయనకు రైతుల బాధలు తెలియవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌నేత జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్‌రెడ్డి అన్‌ఫిట్ అని మండిపడ్డారు. ‘కనీస అవగాహన లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఉత్తంకుమార్ రెడ్డినే. నాగార్జునసాగర్ పరిధిలో కూడా పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నాడు. రాష్ట్రంలో డెకాయిట్ల పాలన నడుస్తున్నది. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులే పెద్ద డెకాయిట్లు. చేయి తడపనిదే ఏ పని కావట్లేదని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. కేసీఆర్ ని డెకాయిట్ అనెంత మొగోడీవా నువ్వు.పనిచేతగాక హెలికాప్టర్లలో తిరుగుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో కూడా పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ సరైన సమయంలో బయటికి వస్తారు. వీళ్ళ బండారాన్ని బయటపెడతారు. ఇంకొన్ని రోజుల్లో రైతులే మిమ్మల్ని ఉరికించి కొడతారు’అని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. -
మరో మంత్రి పదవి!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పదవి దక్కనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. పలు సందర్భాల్లో తన మనసులోని మాటను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. ఎంపీ ఎన్నికల్లో అన్ని బాధ్యతలు తానే తీసుకొని చామల కిరణ్కుమారెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేసిన రాజగోపాల్‌రెడ్డి.. రెండు రోజుల క్రితం డీసీసీబీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి సీఎం రేవంత్‌రెడ్డి అభిమానాన్ని చూరగొన్నారు.లైన్ క్లియర్ అయినట్లేనా..ఎంపీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేలా గతంలోనే అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని చెప్పినా అందుకు ఆయన అంగీకరించలేదన్న చర్చ అప్పట్లో జరిగింది. పార్టీ సర్వేల ప్రకారం ఆమె పోటీలో ఉంటే భారీ మెజారిటీతో గెలుస్తారన్న చర్చ సాగడంతో అధిష్టానం లక్ష్మిని పోటీ చేయించాలని రాజగోపాల్‌రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. అయితే, అటు లక్ష్మిని ఎంపీగా పోటీలో నిలిపి, ఇటు మంత్రి పదవి అడిగితే పార్టీ పరంగా విమర్శలు వస్తాయనే భావనతో లక్ష్మిని పోటీచేయించేందుకు ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు తాము ఎంపీ టికెట్ అడుగడంలేదని, తమ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీలో ఉండరని పలు సందర్భాల్లో ఆయన ప్రకటించారు. పార్టీ ఎవరిని బరిలో నిలిపినా భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదన మేరకు అధిష్టానం చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించించింది. ఆ ఎన్నికల్లో అన్నీ తానై భారీ మెజారిటీతో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కేబినెట్ విస్తరణలో ఆయన పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.అమాత్య పదవి వస్తుందని ధీమాలో..అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత రాజకీయ సమీకరణల్లో భాగంగా రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. తరువాత తనకు మంత్రి పదవి వస్తుందని అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనూ రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఎన్నికల తరువాత విస్తరణ ఉంటుందని పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈసారి తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.మంత్రి పదవిపై ముగ్గురి ఆశలు?ఉమ్మడి జిల్లా నుంచి రాజగోపాల్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. లంబాడా కోటాలో తనకు మంత్రి పదవి కావాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా తన సతీమణి పద్మావతి రెడ్డికి మంత్రి పదవి అడుగుతున్నట్లు తెలిసింది. అయితే, అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేబినెట్లో బెర్త్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి మూడో మంత్రి పదవిని కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.ముచ్చటగా మూడు..!కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అవుతారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అవకాశం కల్పించారు. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తే ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కినట్లు అవుతుంది. -
TN: మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా
చెన్నై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. మరో రెండు రోజుల్లో మద్రాస్ హైకోర్టులో బాలాజీ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్ 14న మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అరెస్టు చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ బాలాజీని అరెస్టు చేసింది. అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్ మంత్రివర్గంలోనే కొనసాగించారు. పోర్ట్‌ఫోలియో మాత్రం కేటాయించలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్‌కు కోర్టు సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇదీ చదవండి.. హస్తినలో హై టెన్షన్ -
మంత్రి పదవిపై సీతక్క ఎమోషనల్..
-
ఉద్యమంలో ఉన్నా..మంత్రి అవుతున్నా
-
మంత్రి పదవిపై శ్రీధర్ బాబు ఫస్ట్ రియాక్షన్
-
సీతక్కకు మంత్రి పదవి !
-
ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలి
చిక్కబళ్లాపురం: చింతామణి ఎమ్మెల్యే ఎంసీ సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని తాను ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాసినట్లు చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ తెలిపారు. సోమవారం ఆయన నగరంలో నమస్తే చిక్కబళ్లాపురం కార్యక్రమంలో భాగంగా శిడ్లఘట్ట రోడ్డులో దళిత కాలనీలోని సమస్యలను ఆలకించడానికి వచ్చారు. అక్కడే అల్పాహారం తీసుకుని వారి సమస్యలను విన్నారు. ఈ కాలనీలో ఆరుగురు హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారని, వారిని జయదేవ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తానని ప్రదీప్ తెలిపారు. ఇక్కడ తాగునీటి సమస్య ఉందని, త్వరలో పరిష్కరిస్తానన్నారు. మునపటి ఎమ్మెల్యేలు కనీసం ఓట్లు అడగటానికి కూడా దళిత కాలనీలో అడుగు పెట్టలేదని అన్నారు. అంతకు ముందు ఆయన అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం మునియప్ప, నగరసభ సభ్యుడు వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
Punjab: ఆప్ నేతపై అవినీతి ఆరోపణలు.. మంత్రి పదవికి రాజీనామా
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఆహారశుద్ధి, ఉద్యానవన శాఖ మంత్రి ఫౌజా సింగ్ సరారీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు తెలుపుతూ తన రాజీనామా లేఖను సమర్పించారు సరారీ. తాను పార్టీకి నమ్మకమైన సైనికుడినని, పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే, తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల్లోనే రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి ఫౌజా సింగ్ సరారీపై నాలుగు నెలల క్రితం అవినితీ ఆరోపణలు వచ్చాయి. ఆయన ఓఎస్డీ తర్సెమ్ లాల్ కపూర్‌తో మాట్లాడిన ఓ ఆడియో వెలుగులోకి రావటం మంత్రిని ఇరుకునపెట్టింది. ఆహారధాన్యాల కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకునే విషయంపై ఇరువురు మాట్లాడుకున్నట్లు ఆ ఆడియోలో బయటపడింది. దీంతో మంత్రితో పాటు ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఫౌజాను మంత్రివర్గం నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఆ ఆరోపణలను ఖండించారు ఫౌజా. మంత్రి రాజీనామా చేసిన క్రమంలో శనివారం సాయంత్రం పంజాబ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. సరారీ స్థానంలో పాటియాలా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ బల్బీర్ సింగ్ లేదా జాగ్రాన్ ఎమ్మెల్యే సరవ్‌జిత్ కౌర్ మనుకే మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా! -
ఆస్ట్రేలియాలో 13 మంది మహిళా మంత్రులు
కెన్బెరా: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసె తన కేబినెట్లో మహిళలకు పెద్ద పీట వేశారు. రికార్డు స్థాయిలో 13 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఆనీ అలీ అనే ముస్లిం కూడా ఉన్నారు. దేశ చరిత్రలో తొలి ముస్లిం మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. అయ్యారు. కెన్బెరాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లీ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. లేబర్ పార్టీకి చెందిన ఆంటోని ప్రధాని అయిన 11 రోజుల తర్వాత 30 మందితో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. ఇలాంటి ఒక సమీకృత ప్రభుత్వానికి సారథిగా ఉండడం గర్వంగా ఉందని ఆంటోని ట్విటర్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఎంత భిన్నత్వంతో కూడుకొని ఉందో, తన కేబినెట్ కూడా అంతే భిన్నంగా ఉందన్నారు. -
బీజేపీలో చేరితే దావూద్‌కూ మంత్రి పదవి: ఠాక్రే
ముంబై: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. -
మంత్రి పదవి రాలేదని కాస్త బాధపడ్డాను: సామినేని
-
మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల
ఇల్లందకుంట (హుజురాబాద్): పదవుల కోసం పెదవులు మూసుకోలేదని, రైతులు, ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు తనను పార్టీ నుంచి పంపించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం విలాసాగర్లో సోమవారం పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తాను రాజీనామా చేస్తేనే సీఎం ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చారని, దళిత బంధు, పెన్షన్లు వచ్చాయన్నారు. ఎంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినా తన మీద ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానం తీసుకుపోలేరన్నారు. చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం చదవండి: తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించొద్దు -
‘రాజు’ మంత్రి అయ్యారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైద్య వృత్తిలో సీదిరి అప్పలరాజుకు మంచి పేరు ఉంది. ఆయన వైద్యమందిస్తే జబ్బు వేగంగా నయమవుతుందని చెబుతుంటారు. ఆయన హస్తవాసి బాగుంటుందని అంటుంటారు. అది మరింత నిజమని అనిపించేలా తొలిసారి ఎమ్మెల్యే అయినా సీదిరికి మంత్రి పదవి దక్కుతోంది. పలాస నియోజకవర్గం ఏర్పడ్డాక ఎవరికీ మినిస్టర్ చాన్స్ దక్కలేదు. ఆ ఘనత ఎమ్మెల్యే అప్పలరాజుకు దక్కుతుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ ప్రవేశమే అనూహ్యం అసలు ఆయన రాజకీయ ప్రవేశమే అనూహ్యం. వైద్య వృత్తిలో ఉంటూ 2017లో వైఎస్సార్సీపీ ఆహ్వానం మేరకు రాజకీయ అరంగేట్రం చేశారు. యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సీదిరి అప్పలరాజు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరడమే తరువాయి క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. కిడ్నీ రోగుల బాధలు తెలుసుకునేందుకు కవిటి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి, ఆ తర్వాత పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులై రాజకీయాల్లో దూసుకుపోయారు. నియోజకవర్గంలో ఎదురే లేకుండా పోయింది. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషపై 16,247 ఓట్ల ఆధిక్యంతో తొలి పర్యాయంలోనే రికార్డు విక్టరీసాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నియోజకవర్గంలో ఆయన చూపిన చురుకుదనం, సమస్యలపై అవగాహన, వాక్ చాతుర్యం, పార్టీకి విధేయత ఇవన్నీ ఆయన రాజకీయ ఎదుగదలకు దోహదపడ్డాయి. పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ తనదైన గుర్తింపు పొందారు. రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, ఇతరత్రా పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా మంత్రి అయ్యే చాన్స్ కొట్టేశారు. శాసనమండలి రద్దు తీర్మానం నేపథ్యంలో ఎమ్మెల్సీ హోదాతో మత్స్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణ తదనంతర రాజకీయ పరిణామాల్లో రాజ్య సభకు ఎంపికవ్వడం, అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేయడం, అదే సామాజిక వర్గం నుంచి ఆ కొలువును భర్తీ చేయా ల్సి రావడంతో సీదిరి అప్పలరాజుకు ఆ అదృష్టం వరించబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1.29గంటలకు అమరావతిలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆయన అమరావతికి చేరుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి.. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో మత్స్యకార కుటుంబంలో జన్మించిన సీదిరి అప్పలరాజు వైద్య విద్య అభ్యసించారు. సొంతగ్రామం ఎంపీయూపీ స్కూల్ 1నుంచి 7వ తరగతి వరకు, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు సింహాచలం(అడివి వరం స్కూల్) గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. పదో తరగతిలో స్టేట్ నాలు గో ర్యాంకు సాధించారు. గాజువాక మార్గదర్శి ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి, ఓపెన్ కేటగిరిలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వెంటనే ఎంట్రన్స్ పరీక్షలో పాసై కేజీహెచ్‌లో ఓపెన్ కేటగిరిలో పీజీ సీటు సాధించారు. ఎండీ జనరల్ మెడిసిన్ చేసి పదేళ్లకు పైగా పలాసలో వైద్య సేవలందించారు. నిత్యం ప్రజలలో ఉంటూ, పేదవారికి తక్కువ ధరకే వైద్య సేవలందించారు. క్రీడలకు కిట్లు పంపిణీ, బహుమతులు అందించడం వంటివి చేసేవారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంపై నియోజకవర్గంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అమరావతి చేరుకున్నసీదిరి కాశీబుగ్గ : పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు మంగళవారం అమరావతి చేరుకున్నారు. బుధవారం కేబినెట్లో జరగనున్న మంత్రివర్గ విస్తరణకు కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సోమవారం రాత్రి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు జిల్లా, పలాస నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఉన్నారు. -
ప్రజల పక్షపాతి జగన్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయ న కుమారుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రజల పక్షపాతి. మాట మార్చ రు, మడమ తిప్పరు అనేది వైఎస్ వంశంలోనే ఉంది’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామా త్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ‘ఇన్నాళ్లూ హామీలు ఇచ్చి మరచిపోయే ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాటన్నింటినీ రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో జగన్ చూశారు. తమ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఇచ్చిన ప్రతి హామీ, ప్రతి వాగ్దానమూ నెరవేర్చే దిశగా యువ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుం టున్నారు. అందులో భాగంగానే గత వారం రోజుల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో సోమవారం జరిగిన క్యాబినెట్ తొలి సమావేశమే అద్భుతం. ఆ మంత్రివర్గంలో సభ్యుడిగా నేనూ పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది’ అని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉద్వేగంతో చెప్పారు. బుధవారం అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... ‘మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయే నాయకుడు కాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ, వాగ్దానాన్నీ అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదీ పూర్తి పారదర్శక విధానంతో అవినీతికి ఆస్కారం లేకుండా పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానంలోనే తమ ప్రభుత్వం పనిచేస్తుం దని ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారం రోజునే జగన్ విస్పష్టంగా ప్రకటించారు. శాసనసభాపక్ష సమావేశంలోనూ, క్యాబినెట్ మీటింగ్‌లోనూ మాకు కూడా అదే దిశానిర్దేశం చేశారు. మరో విశేషమేమిటంటే జగన్ మంత్రివర్గ కూర్పు. బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన మాదిరిగానే తు.చ తప్పకుండా అమలుచేయడం ఆయన విశ్వసనీయతకు అద్దం పడుతోంది. నవరత్నాలు అమలు మా పార్టీ వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోలో జగన్ రూపకల్పన చేసి నవరత్నాల్లాంటి పథకాలను పొందుపరిచారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటిని అమలు చేసేందుకు ఆయన కనబరుస్తున్న శ్రద్ధాసక్తులు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన వారి జీవితాలను మెరుగుపరుస్తుంది. 2004 సెప్టెంబరు తర్వాత ఉద్యోగాలు పొందినవారికి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌ను దూరం చేసే సీపీఎస్ విధానం రద్దుకు తీసుకున్న నిర్ణయం అద్భుతం. రైతులపై మమకారం.. వ్యవసాయం దండగని తన మనసులో మాటను బయటపెట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతుల పట్ల వివక్షనే చూపించారు. కేవలం అధికారంలోకి రావడానికే రైతు రుణాలన్నీ మాఫి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి గత ఐదేళ్లలో చూశాం. అందుకు భిన్నం మా ప్రభుత్వం. రైతులపై గౌరవం ఉంది. వ్యవసాయం అంటే మమకారం ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రకటించారు. ఆయనకంటే అన్నదాత అభిమాని ఇంకెవరూ ఉండరు. విప్లవాత్మకమైన మార్పులు.. అమ్మ ఒడి పథకం నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ వరకూ అన్ని అంశాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయన పరిపాలనలో రాష్ట్ర ప్రజలు నిజమైన, మెరుగైన జీవన ప్రమాణాలు పొందుతారనడంలో సందేహం లేదు. ప్రభుత్వపరంగా అనవసర ఖర్చులకు, ఆడంబరాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు చేయాలనే సంకల్పం ఆయనది. ప్రతిపక్షం నుంచి మాటల్లేవ్.. రాష్ట్ర శాసనసభ బుధవారం కొలువుదీరుతున్న వేళ యువ ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చూసి ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నోట మాటే కరువైంది. ఒకప్పుడు జగన్ ఇస్తున్న హామీలను ఎద్దేవా చేసింది వారే. ఆ హామీలు సాకారమవుతుంటే ఏమంటారని ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మూలాలతో సహా పెకిలించి త్వరలోనే ఆయా నాయకుల జాతకాలు బయటపెడతాం. ప్రజా సంక్షేమ ప్రభుత్వం మాది.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల వరకూ జీతాలు, వేతనాల్లో ఒకేసారి మార్పుతీసుకొచ్చిన ప్రభుత్వం మాది. బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి జగన్ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గొప్ప విజన్ ఉన్న నాయకుడు జగన్. ఆయన మంత్రివర్గంలో నాకు చోటుదక్కడం నా జీవితంలో ఓ అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నా. నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా. జిల్లా అభివృద్ధికి నా వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తా.’ -
ఈసారైనా పదవొచ్చేనా?
జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు అమాత్య యోగం అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఈ నియోజకవర్గంనుంచి గెలిచినవారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్ సింధే వరుసగా మూడుసార్లు గెలిచి నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్ సాధించారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, వెనకబడిన ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. పిట్లం: జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ మూడు రా ష్ట్ర సంస్కృతులు పరిడవిల్లుతున్నాయి. 1957లో జుక్కల్ నియోజకవర్గం ఏర్పాటైంది. తొలి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థి మాధవరావు దేశాయి ఎన్నికయ్యారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్థి నాగనాథ్రావు విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విఠల్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1972లోనూ ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1978లో జుక్కల్‌ను ఎస్సీ రిజర్వ్డ్గా మార్చారు. సౌదాగర్ గంగారాం కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1983లోనూ గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పండరి ఎమ్మెల్యే అయ్యారు. 1989లో జరిగిన ఎన్నికలలో తిరిగి సౌదాగర్ గంగారాం గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ అభ్యర్థి పండరిని గెలిపించారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరుణతార విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి హన్మంత్ సింధే గెలుపొందారు. ఆయన 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేసిన సింధే.. వరుసగా మూడోసారి విజయబావుటా ఎగురవేశారు. తొలి హ్యాట్రిక్.. జుక్కల్ నియోజక వర్గం ఏర్పాటైనప్పటినుంచి 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి హ్యాట్రిక్ మాత్రం హన్మంత్ సింధేదే.. సౌదాగర్ గంగారాం నాలుగుసార్లు విజయం సాధించానా.. ఆయన వరుసగా మూడుసార్లు గెలుపొందలేదు. విఠల్‌రెడ్డి రెండుసార్లు మాత్రమే గెలిచారు. పండరి కూడా రెండు విజయాలే నమోదు చేశారు. హన్మంత్ సింధే మాత్రం 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఆయన మూడు దఫాలూ 30 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. 2004లో మొదటిసారి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన సింధే.. 1,241 ఓట్ల తేడాతో సౌదాగర్ గంగారాం చేతిలో పరాజయం చవిచూశారు. 2009నుంచి వెనుదిరిగి చూడలేదు. 2009లో తెలుగుదేశం నుంచి రెండోసారి పోటీ చేసిన సింధే.. 34058 ఓట్ల మెజారిటీతో గంగారాంపై గెలుపొందారు. తరువాత తెలంగాణ ఉద్యమం ప్రభావంతో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2014లో జరిగిన ఎన్నికల్లో గంగారాం సతీమణి సావిత్రిబాయిపై 35,007 వేల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గంగారాంపై 35,624 ఓట్ల తేడాతో గెలిచారు. అవకాశం దక్కేనా? జుక్కల్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్కసారి కూడా మంత్రి పదవి లభించలేదు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం జుక్కల్ నియోజక వర్గం. ఈ నియోజకవర్గంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారైనా సింధేకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎవరికో చాన్స్..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ సారి రాష్ట్ర మంత్రి వర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాధాన్యం దక్కనుందా.. గెలిచిన ఎమ్మెల్యేల్లో సీనియర్లు ఉన్నారు.. వీళ్లలో ఎవరెవరికి బెర్తులు దొరుకుతాయి..? ఇలా ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన నాటి నుంచి జిల్లావ్యాప్తంగా వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. మనుసులో మాటను వివిధ మార్గాల ద్వారా టీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ మాత్రం రాష్ట్ర అభివృద్ధి, సామాజిక వర్గాల లెక్కలు, భౌగోళిక అంశాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలు స్తోంది. పాలకుర్తి ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు.. డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు ‘గులాబీ’ దళపతి మంత్రి వర్గంలో బెర్తు ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సామాజిక వర్గాల లెక్కలతోపాటు త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి ఆశీస్సులు బలంగా ఉండడంతో ఎర్రబెల్లికి.. టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గాన్ని పార్లమెంట్ ఎన్నికల నాటికి గాడిలో పెట్టడంలో భాగంగా రెడ్యానాయక్‌కు కేసీఆర్ మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. తీవ్ర కసరత్తు.. కొత్త జట్టు కూర్పుపై సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ కూర్పు పూర్తయిన తర్వాత ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో మిగిలిన మంత్రుల ప్రమాణస్వీకారం జరగొచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం తెలంగాణలో సీఎం, మరో 17 మంది మంత్రులు ఉంటారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలమలు బలంగా ఉండడం.. ఈ ఎన్నికల్లో వారందరూ గంపగుత్తగా టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్, హరీష్‌రావు కాకుండా అదే సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు మంత్రులుగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు ఇద్దరు కూడా ఓడిపోయారు. ఈ సామాజిక వర్గం నుంచి స్పష్టమైన ఖాళీలు ఉండడంతో ఆ స్థానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం కల్పించేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు మొదటి నుంచి త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి భక్తుడు. ఆయన మీద విపరీతమైన గురి. అదే సమయంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా చినజీయర్ స్వామి భక్తుడే. ఈ నేపథ్యంలో దయాకర్‌రావును బాగా చూసుకొమ్మని కేసీఆర్‌కు చినజీయర్ స్వామి చెప్పినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఎంపీ నియోజకవర్గ రిపేర్ కోసం.. ఎస్టీ రిజర్వ్ విభాగం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెడ్యానాయక్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా గుర్తింపు ఉండడంతో పాటు కేసీఆర్ తరానికి చెందిన నేతగా ఆయనకు కలిసి వచ్చే అంశం. ఇది కాకుండా మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉంది. ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మహబూబాబాద్‌ను పార్టీ పరంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని.. అదీ రెడ్యానాయక్‌కు ఇవ్వడం మంచిదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో ఇద్దరికి గౌరవప్రద పోస్టులు జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పై వరుసగా రెండు సార్లు గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్ పశ్చిమ నుంచి నాలుగు సార్లు గెలిచిన దాస్యం వినయ్ భాస్కర్‌కు మంత్రి వర్గంలో స్థానం కాకుండా గౌరవ ప్రదమైన పోస్టులు ఇవ్వాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. -
జలీల్‌ఖాన్‌కు ఝలక్!
సాక్షి, విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు సీఎం ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఆశపడి, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి పచ్చ కండువా కప్పుకున్నా ఆశించిన ప్రయోజనం దక్కని పరిస్థితి ఎదురైంది. మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి చుట్టూ పలుమార్లు కాళ్లరిగేలా తిరిగారు. మంత్రి వర్గ విస్తరణ సమయం ఆసన్నమవ్వడంతో మైనార్టీ కోటాలో మంత్రి పదవి పొందేందుకు శనివారం ఉండవల్లిలో మరోసారి ముఖ్యమంత్రిని కలిశారు. మంత్రి పదవి పొందుతున్న ఎన్ఎండీ ఫరూక్ కంటే తాను సీనియర్‌నని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అందువల్ల తనకే మంత్రి పదవి ఇవ్వాలంటూ సీఎం వద్ద పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఫరూక్ పేరు ఖరారు చేశామని, ఇద్దరు మైనార్టీలకు మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యపడదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అలిగినా పెద్దగా ప్రయోజనం ఉండబోదని, కనీసం బుజ్జగించే ప్రయత్నాలు కూడా బాబు చేయరని భావిం చిన జలీల్ మౌనంగా ఇంటిదారి పట్టినట్టు తెలుస్తోంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా వివాదాస్పద నిర్ణయాలు మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా, ఇక మంత్రివర్గ విస్తరణ ఉండదు. జలీల్‌ఖాన్ వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు మంత్రి పదవి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదంటూ జలీల్‌ఖాన్ సరిపుచ్చుకుంటున్నారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఆయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్లే ముఖ్యమంత్రి ఆయన్ను దూరంగా పెడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాలను ముస్లిం మత పెద్దలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాళేశ్వరరావు మార్కెట్ ఎదురుగా ఉన్న జమ్మా మసీద్ వక్ఫ్ భూమిని ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. భవానీపురంలో మరో భూమి విషయంలోనూ ఆయనకు చుక్కెదురైంది. జలీల్‌కు మంత్రి పదవి వస్తే పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోయేదని ఆయన నియోజకవర్గం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూ.. జలీల్‌ఖాన్ మాట్లాడే విధానమే ఆయన్ను ఇబ్బందుల్లో పడవేస్తోందని, అదే మంత్రి పదవికి దూరం చేసిందని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు. ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పడంతో ఆయన నవ్వులపాలయ్యారు. పార్టీ మారినందుకు చంద్రబాబు డబ్బులు ఇస్తామని చెప్పినా తాను తీసుకోలేదంటూ బహిరంగంగా చెప్పడం ద్వారా చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని చెప్పకనే చెప్పారు. ఈ వీడియో రాష్ట్రమంతా వైరల్ అయ్యింది. దీనికి తోడు పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల్నే ఆయన కలుపుకొని ముందుకు వెళ్లడం లేదు. ఆయన నోటి దురుసుతనం వల్ల తన ప్రతిష్టతో పాటు పార్టీ పరువు తీస్తున్నందున చంద్రబాబు ఆయనకు మంత్రి పదవికి దూరంగా ఉంచారని నియోజకవర్గంలోని పలువురు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మూడు పార్టీలు మారినా.. జలీల్‌ఖాన్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయనకు రాజకీయ జీవితం ప్రసాదించి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్రతోనే ఆయన విభేదించారు. నాటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి పార్టీకి దూరమయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరినా ప్రయోజనం లేకపోయింది. రాజకీయ జీవితం ముగిసిపోయిందన్న దశలో 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆయనకు పశ్చిమ నియోజకవర్గ సీటు ఇచ్చి గెలిపించారు. అయితే మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించినా ఫలితం మాత్రం దక్కలేదు. -
ఎమ్మెల్యేలకు యడ్డి ఆఫర్?
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు మంత్రి పదవి ఆశ చూపించి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపు విడుదల చేసింది. కొచ్చికి వెళ్లవద్దని, తనపై నమ్మకం లేదా అంటూ యడ్యూరప్ప అందులో మాట్లాడారు. బీజేపీకి మద్దతిస్తే తనకొచ్చే లాభం ఏమిటని పాటిల్ ప్రశ్నిస్తూ, తనతో పాటు మరో ముగ్గురు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారిని కూడా తీసుకు రమ్మని యడ్యూరప్ప కోరారు. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే మంత్రి పదవి ఇస్తానని, ఒక్కసారి కొచ్చికి వెళితే తిరిగి రావడం కుదరదని యడ్యూరప్ప చెబుతారు. మంత్రి పదవితో పాటు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతామని హామీ ఇచ్చారు. యడ్యురప్ప కుమారుడు విజయేంద్ర కూడా తమ ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు డబ్బు, మంత్రి పదవి ఆశ చూపించారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు విజయేంద్ర మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. -
మంత్రి పదవి చేపడతా
పాలకుర్తి: రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవి చేపడుతానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నల్ల నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ తాను ఇతర నియోజకవర్గాలకు వెళ్లిపోతానని, అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కష్టకాలంలో పాలకుర్తి ప్రజలు ఆదరించారన్నారు. పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకోవడానిఇక ఆశించిన విధంగా అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు. ఈ నెల 22న సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో టెక్స్ టైల్ పార్కు నిర్మాణం శంకుస్థాపనకు వస్తున్నారని, ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 20 వేల మందిని తరలిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీరు అందుబాటులోకి వస్తుండటంతో 90 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు ముస్కు రాంబాబు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతరావు, వైస్ ఎంపీపీ గూడ దామోదర్, ఎంపీటిసిలు, సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అఖిలప్రియకు పదవీ గండం?
సాక్షి, అమరావతి: కొత్తగా మంత్రివర్గంలో చేరిన ఆ యువ మహిళా మంత్రికి పదవీ గండం పొంచిఉందనే వార్తలు ఏపీ తెలుగుదేశంలో గుప్పు మంటున్నాయి. విధులను సక్రమంగా నిర్వహించట్లేదనే నెపంతో బాధ్యతలనుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. సమీక్షా సమావేశాల్లో ఆ యువ మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయంట. అయితే కొత్త మోజు పాత బూజు అన్న చందంగా అఖిల ప్రియ పనితీరు ఉందని పార్టీ అధిస్టానంతో పాటు, సీనియర్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా అఖిల ప్రియ బాధ్యతలను సరిగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి కార్యాలయంలో ఫైళ్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు నంద్యాల ఉపఎన్నికల ప్రచార, నిర్వహణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనుకుంటే, ఎన్నికలు అయిపోయి ఒకటిన్నర నెలలవుతున్నా చేయాల్సిన పనులపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని సమాచారం. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, పనులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాదు పార్టీలో సీనియర్ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని, మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ప్రారంభంలో ప్రసంశించిన ముఖ్య మంత్రి సైతం అఖిల ప్రియ తీరుపై కోపంగా ఉన్నారని సమాచారం. కాన్ఫరెన్స్ మీటింగులకు కూడా మొక్కుబడిగా హాజరవుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయి. దీంతో అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే భూమా వర్గం వాదన మరోలా ఉంది. బెదిరించి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న అధినేత తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏమాత్రం విలువ లేని శాఖను అఖిల ప్రియకు ఇచ్చారని విమర్శించారు. పార్టీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఆ అసంతృప్తితోనే అఖిల ప్రియ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతోందని చెబుతున్నారు. ఏరు దాటాక తెప్ప తగలెస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికార పార్టీ వేధింపులు, ప్రలోభాలకు పార్టీ మారిన భూమానాగిరెడ్డి మంత్రిపదవి రాకుండానే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పార్టీలో చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియకు మంత్రివర్గ విస్తరణలో పర్యాటక శాఖ కేటాయించారు. పదవి చేపట్టిన తొలినాళ్లలో శాఖా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అఖిలప్రియను మెచ్చుకున్నారు. -
పరకాల ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరల టోకరా
-
పరకాల ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరల టోకరా
వరంగల్ : వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పూజలు చేస్తే పదవి వస్తుందంటూ ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరలు టోకరా వేశారు. పూజలు చేస్తే తన తండ్రికి మంత్రి పదవి వస్తుందని... ఎమ్మెల్యే కుమార్తె శ్యాంరెడ్డి మానస రెడ్డి... కరీమాబాద్‌కు చెందిన ఇద్దరు కోయదొరలను సంప్రదించారు. కాశీలో పూజలు చేస్తే మంత్రి పదవి వస్తుందని, అక్కడకు వెళ్ళి పూజలు చేస్తామని అందుకోసం కోసం ఖర్చు అవుతుందని కోయదొరలు నమ్మించారు. ఈ క్రమంలో మానస నుంచి సుమారు రూ.57 లక్షలు వసూలు చేసి, ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. చివరికి మోసపోయామని గుర్తించిన ఆమె ఈ విషయాన్ని ఇంట్లోవారికి తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసిన కోయదొరలు లక్ష్మణరాజు, వంశీరాజులపై 420, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రా మజాకా.. పదవీ రక్షణ పూజలు
చెన్నై : తన పదవికి ఎలాంటి గండం రాకూడదన్న భావనతో ఓ మంత్రి ఏకంగా పదవీ రక్షణ పూజలు సాగించారు. వరుణ యాగం నినాదం తెర మీదకు తెచ్చినా, వెను వెంటనే పదవీ రక్షణ పూజలు చేయడం గమనార్హం. నాగపట్నం జిల్లా వేదారణ్యం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఓఎస్ మణియన్‌కు మంత్రి పదవిని దివంగత సీఎం జయలలిత కేటాయించారు. అమ్మ మరణంతో చిన్నమ్మ శశికళకు విశ్వాసపాత్రుడిగా ఈ మంత్రి ఉన్నారని చెప్పవచ్చు. చిన్నమ్మ ప్రతినిధి దినకరన్‌కు మద్దతుగా కూడా వ్యవహరించారు. సీఎం పళనిస్వామి శిబిరంతో అంటీఅంటనట్టుగా ఉన్న ఆయన తన పదవికి గండం సృష్టిస్తారేమోనన్న ఆందోళనలో పడ్డట్టుంది. దీంతో ఆదివారం ఏకంగా 50 మేకపోతుల్ని బలి ఇచ్చి పూజలు చేయడం గమనార్హం. వేదారణ్యంలోని ప్రసిద్ధి చెందిన వేదారణేశ్వరర్ ఆలయంలో వరుణ యాగంకు ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు. అయితే, ఈ యాగంకు మంత్రి, అన్నాడీఎంకే వర్గాలు తప్ప, బయటకు వ్యక్తులు ఎవ్వరు లేరు. ఇక్కడ యాగం అనంతరం నేరుగా మంత్రి మునీశ్వర ఆలయానికి చేరుకుని 50 మేక పోతుల్ని బలి ఇచ్చి, తన బంధువులు, సహచరులకు విందుతో పూజలు సాగించారు. తన పదవికి ఎలాంటి గండం రాకూడదన్న భావనతో మంత్రి ఈ పూజలు సాగించినట్టుగా చర్చ ఊపందుకుంది. -
అలక పాన్పుపైనే..
♦ ఇద్దరు గన్మెన్లను వెనక్కి పంపిన చింతమనేని ♦ ప్రభుత్వ ఆదేశాల అనంతరమే నిర్ణయమన్న ఎస్పీ సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రి పదవి ఇవ్వలేదని అలకపాన్పు ఎక్కిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా దిగిరాలేదు. తనకు ఇద్దరు గన్మెన్లు చాలంటూ.. ఇద్దర్ని వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చింతమనేనికి 2+2 పద్ధతిలో నలుగురు గన్మెన్లు భద్రతగా ఉన్నారు. వీరిలో ఇద్దరు విధుల్లో ఉంటే.. ఇద్దరు విశ్రాంతిలో ఉంటారు. తనకు ఇద్దరు గన్మెన్లు చాలని, మిగిలిన ఇద్దరిని వెనక్కి పంపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేనందున ఆ ఇద్దరిని కూడా విధులు నిర్వహించాలంటూ జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తిరిగి చింతమనేని వద్దకు తిప్పి పంపారు. ప్రభుత్వం నుంచి అదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, ఆదేశాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంతో తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన చింతమనేని నేరుగా అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ పంపించిన విషయం విదితమే. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన ఆయన పార్టీకి కట్టుబడి ఉంటానని, నిబద్ధతతో పనిచేస్తానంటూ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఇది జరిగిన 24 గంటలకే తనకు కల్పించిన భద్రతను సగానికి తగ్గించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో ఆయన మరో పరిణామానికి తెరతీయడంతో వ్యవహారం మొదటికొచ్చినట్టయ్యింది. అసలు చింతమనేని ఏం చేయాలనుకుంటున్నారు, తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఏవిధంగా ముందుకు వెళతారనే అంశాలపై చిక్కుముడి వీడటం లేదు. ఇద్దరు గన్మెన్లను ఉపసంహరించుకోవడంపై చింతమనేని ప్రభాకర్ స్పందిస్తూ తనకు ప్రజలే రక్షణగా ఉంటారని, గన్మెన్లు అవసరం లేదని నిశ్చయించుకున్నట్టు వ్యాఖ్యానించారు. -
రాజకీయ ‘చెద’రంగం!
► పార్టీలో నిబద్ధతకు గుర్తింపు లేదన్న గౌతు శివాజీ ► అధిష్టానం తీరుతో మీడియా ముందు కంటతడి ► సీనియర్ నేత కళా వెంకటరావుకు ‘ఎనర్జీ’ ► రవాణా శాఖతో అచ్చెన్నాయుడికి ప్రమోషన్ ► కార్మిక, క్రీడా శాఖల్లో విఫలమైనా కీలక శాఖ బాధ్యతలు ‘ఇది రాజకీయ‘చెద’రంగం... దీన్ని ఆడలేకపోయా... అందుకే మంత్రి పదవి రాలేదేమో! నా సీనియార్టీని చంద్రబాబు గుర్తించి ఆ మంత్రి పదవి ఇస్తారేమోనని భావించా! కానీ ఆశపడలేదు! పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా! దానికి గుర్తింపు రాలేదు...’ ఇదీ జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు గౌతు శ్యామసుందర శివాజీ ఆవేదన! జిల్లాలో తన సమకాలీనుడైన కిమిడి కళావెంకటరావు పార్టీ మారొచ్చినా పెద్దపీట వేయడం, మరో సమకాలీన నేత ఎర్రన్నాయుడి తమ్ముడు అచ్చెన్నాయుడికి ప్రాధాన్య శాఖలతో ప్రమోషన్ ఇవ్వడం శివాజీ కన్నీటికి కారణమైందనే చర్చ మొదలైంది! కార్మిక, క్రీడా శాఖల్లో విఫలమైనా రవాణా, బీసీ సంక్షేమం వంటి కీలక శాఖలు అచ్చెన్నకు ఇవ్వడంలో అంతరార్థం బాగా పనిచేయడం కన్నా చంద్రబాబు మెచ్చిన సుగుణమేదో ఆయనలో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పార్టీలో తొలి నుంచి కష్టపడినవారి కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరినవారికే పెద్దపీట వేయడం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ సీనియర్ నాయకులకు మింగుడుపడట్లేదు. జిల్లాలో పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కంటతడి పెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో సేవలందించినా గుర్తించకుండా అధిష్టానం మొండిచేయి చూపడాన్ని జీర్ణించుకోలేకపోయారు. మూడేళ్ల క్రితమే శివాజీకి మంత్రిమండలిలో చోటుదక్కుతుందని ఆశించినా వివిధ కారణాలు చూపించి తనకన్నా జూనియర్ నాయకుడైన అచ్చెన్నాయుడి వైపే చంద్రబాబు మొగ్గు చూపించారు. అప్పట్లో శివాజీ కుమార్తె శిరీషను పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌కు మంత్రి పదవి కల్పించడం కోసం ఎప్పటికైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ఏడాది క్రితం నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటి నుంచే ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మంత్రి పదవి కోసం చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించారనేది బహిరంగ రహస్యమే! పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు కలిసొచ్చిన ప్రతి అంశాన్ని చక్కగా వినియోగించుకొని లోకేశ్‌కు సన్నిహితులుగా మారిపోయారు. చివరకు లోకేశ్ సిఫారసుతోనే ఇంధన వనరులు (ఎనర్జీ) వంటి ప్రాధాన్యం ఉన్న శాఖతో జిల్లాలో రెండో మంత్రిగా అడుగుపెట్టగలిగారు. అయితే కళా పార్టీ మారొచ్చిన నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే జిల్లా సీనియర్‌గా తనకే మంత్రి పదవి వస్తుందని శివాజీ ఆశించారు. చివరకు తన తండ్రికి మంత్రిగా అవకాశం కల్పించడానికి ఒకవేళ తన పార్టీ పదవే అడ్డొస్తే వదులుకోవడానికీ సిద్ధమేనని శిరీష జిల్లాలో ఓ ముఖ్య నేత వద్ద చెప్పినా సదరు నేత ఆ విషయాన్ని అధిష్టానం దృష్టి తీసుకెళ్లలేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తన కుమార్తె తప్ప జిల్లాలో టీడీపీ నాయకులెవ్వరూ తనకు మద్దతుగా నిలవకపోవడం కూడా శివాజీని కలిచివేసి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాకు మూడేళ్లలో ఒరిగిందేమిటి? చంద్రబాబు మంత్రివర్గంలో గత మూడేళ్లుగా అచ్చెన్నాయుడు కార్మిక, ఉపాధి, యువజన, క్రీడా శాఖలను నిర్వహించారు. అయితే ఆయా శాఖల బాధ్యతలు గాకుండా జిల్లాపై ఆధిపత్యం కోసం, ఇరిగేషన్ వంటి ఇతర శాఖల విషయాల్లో జోక్యం చేసుకోవడంతోనే ఆయన కాలం గడిపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిలో అట్టడుగునున్న జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా సొంత ప్రాంతానికి చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. సిక్కోలుతో పాటు ఉత్తరాంధ్రలో దాదాపు లక్ష మంది కార్మికులకు ఏకైక ఆధారమైన జూట్ మిల్లులకు లాకౌట్ ప్రకటించారు. అనేక చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ మూడేళ్ల కాలంలో జిల్లాకు ఒక్క పరిశ్రమనూ తేలేకపోయిన అచ్చెన్న కనీసం ఆ మూతపడిన పరిశ్రమలనైనా తెరిపించలేక కార్మిక మంత్రిగా విఫలమయ్యారు. ఇక క్రీడా, యువజన సర్వీసుల శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నా జిల్లాలో క్రీడల ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలు లేవు. చివరకు జిల్లా కేంద్రంలో కూల్చేసిన కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసి దాదాపు ఏడాదైపోతున్నా మోక్షం కలగలేదు. ఇటీవల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో ఆగమేఘాలపై ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే జిల్లా క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లభించలేదు. ఇటీవల దివ్యాంగుల క్రికెట్లో ఇటీవల పాకిస్తాన్ జట్టును చితక్కొట్టి ప్రపంచకప్‌ను సాధించిన భారతజట్టులోని కీలక సభ్యుడు దున్న వెంకటేశ్వరరావు జిల్లావాసే! అతనికి భారీ నజరానా కాదుకదా కనీసం క్రీడాశాఖ తరఫున సన్మానం కూడా చేయలేదు. పదవులతో మేలు జరిగేనా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అచ్చెన్నాయుడికి రవాణా, బీసీ సంక్షేమ, చేనేత, వస్త్ర మంత్రిత్వశాఖలు దక్కాయి. అలాగే కళావెంకటరావుకు ఎనర్జీ మంత్రిత్వశాఖ లభించింది. ఈ ఇద్దరు మంత్రులతో జిల్లాకు ఇకనైనా మేలు జరుగుతుందేమోనని సిక్కోలు ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాలో 80 శాతం పైగా బీసీలే! కానీ వారి జనాభా దామాషా ప్రతిపాదికన చూస్తే బీసీ రుణాలు ఏమూలకు సరిపోవట్లేదు. వంద వరకూ బీసీ సంఘాలు ఏర్పాటు చేయాల్సివున్నా జిల్లాకు ప్రస్తుతం 35కి మించి కులసంఘాలు లేవు. ఆయా సంఘాలను ఏర్పాటు చేసి, సంక్షేమానికి తగినట్లుగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అలాగే జిల్లాలో చేనేత కార్మికులున్న గ్రామాలు వంద వరకూ ఉన్నాయి. పొందూరు, నరసన్నపేట మండలాల్లో చేనేత క్లస్టర్లు ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా వాటికి అతీగతీ లేదు. ఇక పొందూరు ఖాదీ ప్రపంచ ఖ్యాతిగాంచినా అక్కడి ఖాదీ సంఘం, చేనేత కార్మికుల పరిస్థితి దీనావస్థలో ఉంది. చివరకు శ్రీకాకుళంలోనున్న ఖాదీ గ్రామోద్యయ సంఘాన్ని నిర్వీర్యం చేసేసి, సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సంఘం స్థలంలో నిర్మించిన భవనాన్నీ అద్దెకు ఇచ్చేసిన ఘనత కూడా టీడీపీ ప్రభుత్వానిదే. వీటన్నింటినీ అచ్చెన్న చక్కదిద్దుతారో లేదో వేచి చూడాల్సిందే! కళాతో ‘ఎనర్జీ’వచ్చేనా? జిల్లాలో కొవ్వాడ అణువిద్యుత్తు పార్కుతో పాటు కాకరాపల్లి, పొలాకిలో ధర్మల్ విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు ఇంధన వనరుల మంత్రిగా కళా వెంకటరావు ఏమేరకు కృషి చేస్తారనేదీ చర్చనీయాంశమైంది. కాకరాపల్లిలో ఈస్ట్‌కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భరించలేక ప్రైవేట్ యాజమాన్యం అర్ధంతరంగా చేతులెత్తేసింది. దీనికి రుణం ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జెన్కోకు భారీ మొత్తానికి అప్పగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించినా ఫలించలేదు. ఇక పోలాకిలో జపాన్ ఆర్థిక సహాయంతో నిర్మించ తలపెట్టిన ధర్మల్ విద్యుత్తు కేంద్రం కూడా ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. ఇక గుజరాత్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కళా సొంత నియోజకవర్గంలోని కొవ్వాడకే తరలివచ్చిన అణువిద్యుత్తు పార్కు పనులు ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా సంస్థ వెస్టింగ్ హౌస్ ఇటీవలే దివాళా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఇవన్నీ అధిగమించి కళా జిల్లాకు ఎంత ‘ఎనర్జీ’ తీసుకువస్తారో వేచిచూడాల్సిందే! -
రావెలకు మంత్రిపదవి ఇవ్వాలని..
గుంటూరు: రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా ఓ అభిమాని సెల్‌టవర్ ఎక్కాడు. గుంటూరుకు చెందిన ఒక ఆటోడ్రైవర్ సోమవారం మధ్యాహ్నం అరండల్‌పేట 16వ లైను వద్ద ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. రావెలను తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేకుంటే కిందికి దూకుతానని బెదిరించసాగాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ సరిత అక్కడికి చేరుకుని అతని డిమాండ్‌ను పైఅధికారులకు తెలుపుతామని, కిందికి దిగాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి కిందకి దిగిరావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. -
వాళ్లు చేస్తే తప్పు... తాను చేస్తే ఒప్పు...
♦ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి ♦ సీఎం తీరుపై విమర్శల వెల్లువ సాక్షి, అమరావతి: ‘‘తలసాని శ్రీనివాస యాదవ్ ఏ పార్టీలో గెలిచాడు? ఏ పార్టీలో మంత్రిగా ఉన్నాడో ఆయన సమాధానం చెప్పాలి. తెలుగుదేశంలో పోటీచేసి గెలిచి, కనీసం రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మనల్ని తిడుతూ వేరేపార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? తమ్ముళ్లూ అని అడుగుతున్నా! ఇది న్యాయమా! ప్రజలకు ఆమోదమా?’’ ‘‘మా ఎమ్మెల్యేని ఎన్నికలకు ముందు మీ ఫామ్ హౌస్‌కు తీసుకుపోయి డబ్బులిచ్చి ఏమాత్రం సిగ్గుపడకుండా పోలీసు ప్రొటక్షన్‌తో తీసుకువెళ్లిన నీకు (కేసీఆర్‌కు) నీతి గుర్తుకు రాలేదా? అని అడుగుతున్నా. నాకు ఒక ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు సిద్ధాంతం ముఖ్యం. నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.’’ .... జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా, కూకట్పల్లి ఎమ్మెల్యే పార్టీ మారిన సందర్భంలో చంద్రబాబు మాటలివి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవి ఇస్తే తప్పుగా, రాజకీయ వ్యభిచారంగా ఆయన అభివర్ణించారు. తమపార్టీ ఎమ్మెల్యేలను సంతలో సరుకుల్లా కొన్నారని, దమ్ముంటే రాజీనామా చేయించి పోటీ చేయాలని సవాళ్లు విసిరారు. ఇప్పుడా మాటలన్నీ మరచి తానే రాజకీయ వ్యభిచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, వారితో రాజీనామా చేయించకుండానే నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై మేధావులు, రాజకీయ నిపుణులు మొదలు సామాన్య ప్రజలు సైతం విమర్శిస్తున్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాల్కల ధోరణి మరోసారి రుజువైందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో తప్పన్నదే ఏపీలో ఒప్పుగా భావించడం ఆయన ధోరణికి నిదర్శనమని దుయ్యబడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవులు కట్టబెట్టడంపై చంద్రబాబు చేసిన తీవ్ర దూషణలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే పార్టీ మారిన సందర్భంలోనూ కేసీఆర్‌పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సత్యహరిశ్చంద్రుడి మాదిరిగా మాట్లాడిన చంద్రబాబు ఇపుడు ఏపీలో తాను స్వయంగా చేస్తున్న ఫిరాయింపుల అరాచక పరాకాష్ట చర్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు రాజ్యాంగం విలువలు, సిద్ధాంతాలు, నీతి నియామాలంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్నాధ్రెడ్డి, సుజయకృష్ణ రంగారావులకు ఏపీ కేబినెట్లో చోటుకల్పించడంపై ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. విపక్షం, రాజకీయ నిపుణులే కాకుండా సొంతపార్టీ వారినుంచి కూడా బాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నెహ్రూకు మొండిచేయి
♦ మోకాలొడ్డినపార్టీ సీనియర్లు ♦ రెంటికీ చెడ్డరేవడిగా జ్యోతుల ♦ ఆయన అనుచరుల్లో అయోమయం సాక్షి ప్రతినిధి, కాకినాడ : మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు చోటుచేసుకోలేదు. జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంత్రివర్గంలో యథాతథంగా కొనసాగనుండడంతో కొత్తవారికి నో ఛాన్స్ బోర్డు పెట్టేశారు. శనివారం అర్ధరాత్రి వరకూ మంత్రి వర్గ విస్తరణౖపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పాతవారిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మంత్రి పదవి కోసం ఆశావహులు ఎక్కువగా ఉండటం, సామాజిక సమీకరణల నేపథ్యంలో కొత్తగా ఎవరికి ఇచ్చినా తేనెపుట్టను కదిలించినట్టవుతుందన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మెట్ట ప్రాంతంలో తలపండిన రాజకీయ నాయకులుగా ముద్ర పడిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. వైరి వర్గమే కొరివి పెట్టిందా...? చిరకాల కోరికైన మంత్రి పదవి ఈసారి కూడా నెహ్రూకు దూరమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నెహ్రూ మంత్రి పదవి కోసమే టీడీపీలోకి ఫిరాయించినట్టు చెప్పుకుంటూ వచ్చారు. విస్తరణలో బెర్త్ ఖాయమని అనుచరులు విస్తృతమైన ప్రచారం కూడా చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి ముఖ్య అనుచరులతోపాటు పలువురు పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కూడా శనివారం విజయవాడ తరలివెళ్ళారు. తీరా చంద్రబాబు వద్ద సీన్ రివర్స్ అయింది. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచీ నెహ్రూకు రాజకీయంగా వైరి వర్గంగా ఉన్న యనమల రామకృష్ణుడు తెర వెనుక జరిపిన మంత్రాంగం ఫలితంగానే నెహ్రూ ఆశలు ఆవిరయ్యాయని పలువురు భావిస్తున్నారు. నమ్మి టిక్కెట్ ఇచ్చి, ఎమ్మెల్యేను చేసిన వైఎస్సార్ పార్టీని కాదని ప్రలోభాలతో పార్టీ ఫిరాయించినా చివరకు ఫలితం దక్కలేదని నెహ్రూ వర్గం డీలా పడింది. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను మార్చి అదే సామాజిక వర్గానికి చెందిన నెహ్రూకు మంత్రి పదవి కట్టబెడతారని విస్త్రృతమైన ప్రచారం జరిగింది. కానీ రాజప్పను కదిపి నెహ్రూకు పట్టం కడితే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని బాబు వెనుకడుగు వేశారు. కాపు సామాజిక వర్గం నుంచి నెహ్రూ, రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గొల్ల పల్లి సూర్యారావు, కమ్మ సామాజిక వర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవులు ఆశించారు. సామాజిక సమతూకంలో భాగంగా ఒకిరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కొత్త సమస్యలు వచ్చిపడతాయని యనమల తదితర నాయకులు సూచించడంతో విస్తరణలో జిల్లా నుంచి ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా పూర్వ స్థితినే కొనసాగించారు. పార్టీని కాదనుకుని రెండు పార్టీలు మారి నిన్నగాక మొన్న తిరిగి వచ్చిన నెహ్రూకు మంత్రి పదవి ఇస్తే సీనియర్లు ఏమైపోతారని నెహ్రూ వ్యతిరేకవర్గం గట్టి వాదనను వినిపించింది. ప్యాకేజీ పాత్ర ఎంత...? పార్టీ ఫిరాయించిన సందర్భంలోనే నెహ్రూకు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు నిర్ధిష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదన్న వాదన ఉంది. పార్టీ మారడం వెనుక ప్యాకేజీయే కీలకపాత్ర పోషించిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో నెహ్రూకు స్థానం లభించలేదంటున్నారు. నెహ్రూతో పాటు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేలకు స్థానం దక్కినప్పటికీ నెహ్రూకు దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర నిరాశ నిస్పృహకు లోనయ్యారు. ఈ పరిణామాలు పార్టీలో ఎక్కడకు దారితీస్తాయన్నది వేచి చూడాల్సిందే. -
‘దేశం’లో ‘ఆది’ చిచ్చు!
సాక్షి ప్రతినిధి, కడప: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య చీలిక తెచ్చింది. మొదటి నుంచి ఉన్నవారిని కాదని ఎమ్మెల్యే ఆదికి మంత్రి పదవి ఇస్తామనడంపై పార్టీ జిల్లా అధ్యక్షుడితో సహా నేతలందరూ భగ్గుమంటున్నారు. అందరూ రాష్ట్ర రాజధానిలో తిష్టవేసి ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయానికి ప్రత్యేకత ఉంది. గుండ్లకుంట వర్సెస్ దేవగుడి గ్రామాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. దేవగుడి కుటుంబం వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపికైంది. ఈక్రమంలో మాజీమంత్రి, టీడీపీ నేత పి.రామసుబ్బారెడ్డి పరాజయం పాలయ్యారు. కాగా ఈమారు అధికారం టీడీపీకి దక్కింది. ఆధిపత్యం చలాయించవచ్చనే ధీమా అక్కడి టీడీపీ నేతలకు ఎంతోసేపు నిలవలేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలో చేరిపోయారు. నాడు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రధాన ప్రత్యర్థి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అధినేత చంద్రబాబు భరోసాతో శాంతించారు. కాగా తాజాగా మంత్రి పదవి రేసులో ఎమ్మెల్యే ఆది ముందంజలో నిలవడంతో మరోమారు తాడోపేడో తేల్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భగ్గుమంటున్న నేతలు ఎమ్మెల్యే ఆదినారాయణరెడికి మంత్రి పదవిపై జిల్లా టీడీపీ నేతలంతా మండిపడుతున్నారు. నిన్నమొన్నటి వరకూ కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేశారు. అంతలోనే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆది పేరు తెరపైకి రాగానే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో సహా ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. పార్టీని బలోపేతం చేయాలంటే టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన రాజంపేట ఎమ్మెల్యే మేడాకి కేటాయించాలని ముక్తకంఠంతో కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని ఎమ్మెల్యే మేడా సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విజయవాడలో జిల్లా నేతలంతా తిష్టవేసి ఆదికి పీఠం ఇవ్వడంపై ఇన్‌చార్జులంతా వ్యతిరేకిస్తూ మంతనాలు చేపట్టారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి మినహా తక్కిన నాయకులంతా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని వీడేందుకు కూడా వెనుకాడేది లేదు ఎమ్మెల్యే ఆదికి మంత్రి పదవి కేటాయిస్తే కన్నతల్లిలాంటి టీడీపీని వీడేందుకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు విన్నవించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కేబినేట్ ర్యాంకు హోదా కల్గిన నామినేటెడ్ పదవి అప్పగిస్తానని సీఎం బుజ్జగించినట్లు సమాచారం. అందుకు ససేమిరా అనడంతో జిల్లా టీడీపీ నేతలను ఒప్పించాలని ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు టీడీపీ నేతలతో మంత్రి గంటా తన గృహాంలో తిష్టవేసి మంతనాలు జరిపారు. ఎంపీ రమేష్ సైతం బుజ్జగించే పనిలో ఉండిపోయారు. రాత్రి పొద్దుపోయే వరకూ వ్యవహారం కొలిక్కి రాలేదని తెలుస్తోంది. కాగా ఇన్చార్జి మంత్రి సమక్షంలో సైతం టీడీపీ జమ్మలమడుగు ఇన్చార్జి రామసుబ్బారెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. అందుకు మరికొందరు నాయకులు జతకట్టడంతో వ్యవహారం జఠిలంగా మారినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిలతో సీఎం చంద్రబాబు మంతనాలు చేసినట్లు సమాచారం. వారు సైతం ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ఆదికి మంత్రి పదవి కట్టబెడితే టీడీపీలో చీలికలు తప్పవని పేర్కొన్నట్లు సమాచారం. లోకేష్ అభయం.... జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిసినా ఎమ్మెల్యే ఆది వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభయం ఉందని, మరోవైపు రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు బలపరుస్తున్నారనే కారణంగా టీడీపీ నేతలను ఏమాత్రం ఖాతరు చేయలేదని సమాచారం. 2వతేదీ ఉదయం 9.22 నిమిషాలకు వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముహుర్తం సైతం ఖరారైందని, పాసులు సైతం జారీ అయ్యాయని ఎమ్మెల్యే ఆది వర్గీయులు భరోసాగా ఉన్నట్లు సమాచారం. ఊహించని మలుపు తిరిగేతప్పా మంత్రి పదవి అడ్డగించే పరిస్థితులు లేవని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. కాగా నమ్మకాన్ని నట్టేట ముంచుతున్నారని, అవకాశవాదాన్ని అందలం ఎక్కిస్తున్నారని జిల్లా టీడీపీ నేతలు మదనపడుతున్నారు. ఈ పరిస్థితిలో రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పు సంభవించే అవకాశాలు ఉన్నాయని పలువురు వివరిస్తుండడం విశేషం. -
సోమిరెడ్డి చివరి ప్రయత్నం
► మంత్రి పదవిపై సోమిరెడ్డి వర్గంలో ధీమా ► అన్నీ రెడ్డి సామాజిక వర్గానికేనా అని హై కమాండ్ వద్ద వాదన వినిపించిన బీద ► సోమిరెడ్డిని మండలి చైర్మన్ చేసి బీదను మంత్రిని చేద్దామని బాబుకు నారాయణ ప్రతిపాదన ► జిల్లా టీడీపీలో వేడెక్కిన రాజకీయం సాక్షి ప్రతినిధి – నెల్లూరు : మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే వార్తలు రావడంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో హడావుడి మొదలైంది. మంత్రి వర్గంలో స్థానం కోసం ఇంత కాలం ఎదురు చూసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చివరి ప్రయత్నం ముమ్మరం చేశారు. బీసీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తన వాదన గట్టిగా వినిపించేందుకు సిద్ధమయ్యారు.జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ అటు పాలనా యంత్రాం గం మీద, ఇటు పార్టీ శ్రేణుల మీద పట్టు సాధించలేక పోయారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2019ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జరిపే మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అవకా శం కల్పించొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తూ వచ్చా యి. దశాబ్దం తర్వాత వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సోమిరెడ్డి తన వ్యవహార శైలి మార్చుకుని అందరితో స్నేహంగా మెలుగుతూ వస్తున్నారు. అటు చంద్రబాబుతోపాటు ఇటుచినబాబు లోకేష్ వద్దకూడా ఆయన ఆర్నెల్ల నుంచి పదవీ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.విస్తరణ జరిగి తే సోమిరెడ్డికి బెర్త్ ఖాయం అనే వాతావరణం ఏర్పరిచారు. ఈ నేపథ్యంలోనే బీద రవిచంద్ర సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మంత్రి నారాయణ మద్దతు కూడగట్టి జిల్లాలో బీసీలకు అవకాశం కల్పించాలనే వాదన లేవదీశారు. జిల్లాలో పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నాయనీ, టీడీపీకి ఎప్పటి నుంచో బలమైన మద్దతు దారులుగా ఉన్న బీసీలను కూడా గుర్తించాలని ఆయన కోరుతున్నారు. జిల్లా రాజకీయ సమీకరణల్లో భాగంగా మంత్రి నారాయణ ఒక దశలో సోమిరెడ్డిని శాసన మండలి చైర్మన్ చేసి రవిచంద్రకు మంత్రిగా అవకాశం కల్పించాలని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఊహించిన విధంగానే ఏప్రిల్ 2వ తేదీ మంత్రి వర్గ విస్తరణ, మార్పులు,చేర్పులు ఉంటాయనే విష యం బయట కొచ్చింది. దీంతో జిల్లా టీడీపీ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. సోమిరెడ్డి వర్గీయులు మాత్రం తమ నాయకుడికి ప దవి రావడం ఖాయమని ధీమాగా ఉ న్నారు. రవి చంద్ర మద్దతు దారులు మాత్రం తమ వాద న వినిపించామని, మంత్రి పదవి కాక పోతే మరో కీలకపదవైనా రావడం ఖాయమని చెబుతున్నారు. -
రెండు మంత్రి పదవులిస్తే సరి... లేదంటే రచ్చరచ్చే!
⇔ సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తే తమ పరిస్థితేంటని వ్యతిరేకుల్లో ఆందోళన ⇔ టార్గెట్ అయిపోతామన్న భయం ⇔ రెండో మంత్రి పదవికోసం లలిత, గీతల ఆశలు ⇔ కన్పించని సానుకూల సంకేతాలు ⇔ నాయకులతో పాటు అధికారుల్లో ఆందోళన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారవ్వడంతో జిల్లా నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా నాడు బయటపడినవారంతా ఇప్పుడు భయపడుతున్నారు. తాము కాదన్నవారికి మంత్రిపదవి దక్కుతుందన్న సంకేతాలు రావడమే దానికి కారణం. బయటపడినవారిలో ఒక్కరికైనా స్థానం కల్పించకుంటే ఇక పార్టీలో అంతర్గత పోరు ఖాయమన్న భావన కనిపిస్తోంది. వ్యతిరేకించినవారిని అణగదొక్కే ప్రయత్నాలు మొదలవుతాయన్న వాదన వినిపిస్తోంది. అంతేనా...అధికారుల్లోనూ అభద్రతా భావం మొదలైంది. సురక్షిత స్థానాలకు చేరుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి బాహాటంగానే చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడ్ని కలిసి కూడా తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఓసీకిస్తే బీసీలంతా దూరమవుతారని పరోక్షంగా హెచ్చరించారు. జిల్లాలోని బీసీ సంఘాలు కూడా వీరి అభిప్రాయానికి మద్దతు పలికి, గొంతు కలిపారు. కానీ అదిష్టానం పట్టించుకున్నట్టుగా లేదు. సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తున్నామన్న సంకేతాలిస్తోంది. అదే జరిగితే బహిరంగంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి ఇబ్బంది కరంగా మారనుంది. వారిలో అంతర్మధనం మొదలయ్యింది. తాము కాదన్న వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే తప్పనిసరిగా టార్గెట్ అవుతామని టెన్షన్ పడుతున్నారు. లలిత, గీత ఆశలు ఫలించేనా? మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, మీసాల గీత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రి మృణాళినిని తప్పిస్తే వెలమ, మహిళ సామాజిక వర్గ సమీకరణాల్లో తనకొస్తుందని కోళ్ల లలితకుమారి, కాపు సామాజిక వర్గం నుంచి తనకొస్తుందని మీసాల గీత ఆశించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు నేరుగా కోళ్ల లలితకుమారిని కలసి మంత్రి పదవిని ఆశించొద్దని, సుజయకృష్ణకు ఇచ్చేందుకు ఇప్పటికే ఖరారైపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె అవాక్కై... తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో చెప్పుకుని బాధపడ్డారు. అంతకుముందు మీసాల గీత పేరు కూడా తెరపైకి వచ్చింది. కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చేశాయి. దాంతో ఆమెకు ఆశలు చిగురించాయి. కానీ, కొద్ది రోజుల్లోనే ఆ వాదన కనుమరుగైపోయింది. తాజాగా కోళ్ల లలితకుమారి పేరు కూడా పరిశీలిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. జిల్లా నుంచి ఇద్దరికి అవకాశమిస్తే లలితకుమారికి బెర్త్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇదేదీ కాదని ఒక్క సుజయ్‌కే మంత్రి పదవి ఇస్తే ఆయన్ను వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ గడ్డు కాలమే. అంతర్గతంగా ఇబ్బందులు పడక తప్పదు. ఈ మేరకు ఇప్పటికే బొబ్బిలి రాజుల శిబిరం నుంచి రాజకీయంగా పావులు కదులుతున్నట్టు తెలుస్తోంది. తమ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న ద్వారపురెడ్డి జగదీష్‌ను జిల్లా అధ్యక్ష పదవినుంచి తప్పించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇదే తరహాలో మిగతా ఎమ్మెల్యేలను కూడా లక్ష్యం చేసుకోవచ్చని అసమ్మతి నేతల అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మృణాళినిని తప్పిస్తే... మంత్రి పదవి నుంచి మృణాళినిని తప్పిస్తే ఆమెను నమ్ముకున్న నాయకులంతా ఇబ్బందులు పడక తప్పదు. రెండు మూడు నియోజకవర్గాల్లో మృణాళిని మద్దతుతో రాజకీయాలు చేస్తున్న నాయకుల భవిష్యత్ అగమ్య గోచరం కానుంది. అంతేకాదు ఆమెను నమ్ముకుని వచ్చిన అధికారులు సైతం ఇబ్బందులు పడేలా ఉన్నారు. మృణాళినిని నమ్ముకునే వారితో పాటు అసమ్మతి స్వరం విన్పిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంబంధాలున్న అధికారులు సైతం ఆందోళనలో ఉన్నారు. మంత్రి కానున్నామన్న అభిప్రాయంతో ఇప్పటికే తనకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల జాబితాను ఓ ఎమ్మెల్యే వర్గం తయారు చేస్తున్నది. తామొచ్చేలోపు వెళ్లిపోతే సరి... లేదంటే తాము సాగనంపాల్సి వస్తుందన్న సంకేతాలను ఇప్పటికే పంపించారు. దీంతో ఆ అధికారులు ముందస్తు జాగ్రత్తగా దార్లు వెతుక్కుంటున్నారు. -
మంత్రి పదవి రాకుండా చేసింది మీరే!
ఎంపీ జితేందర్‌రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలు సాక్షి, మహబూబ్‌నగర్: ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య విభేదాలు మరోసారి పొడచూపాయి. తమ మధ్య విభేదాలు లేవంటూనే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జితేందర్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అక్కడ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు. మొదట జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, మీడియా కావాలని లేనిపోని కథనాలు సృష్టిస్తోందని ఆరోపించారు. శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి రాకుండా తాను అడ్డుకున్నట్లు ప్రచారం చేయడం తగదన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి రాకుండా మీరే అడ్డుకున్నారని.. సదరు విషయాన్ని ఓ మంత్రి చెప్పారని వ్యాఖ్యానించారు. మంత్రి పదవిని తాను అడ్డుకున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే తప్పుకుంటానని జితేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. అయినా, మంత్రి పదవి అనేది తలరాత ఉంటేనే దక్కుతుందని.. ఎవరో అడ్డుపడితే ఆగేది కాదన్నారు. అయినా, సీఎం కేసీఆర్ ఒకరు చెప్తే వింటారా? అందులోనూ మంత్రి పదవుల విషయంలో వింటారా? అని ఎదురు ప్రశ్నించారు. 14 ఏళ్లు ఆయనను దగ్గరుండి చూశానంటున్న శ్రీనివాస్‌గౌడ్.. ఇతరులు చెప్తే ఎట్లా నమ్ముతారని చెప్పారు. ఈ విషయంలో చాలెం జ్ చేస్తున్నా.. ‘ఏ మంత్రి చెప్పాడో అతన్ని సీఎం దగ్గరికి తీసుకెళ్దాం. నేను అడ్డుపడ్డట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచే తప్పుకుంటా’ అని సవాల్ చేశారు. ఇరువురి మధ్య వేడి రగులుతుండటంతో పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో విషయం సద్దుమణిగింది. -
మంత్రి పదవి రాకుండా చేసింది మీరే!
-
‘అందుకే లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం లేదు’
-
‘అందుకే లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వడం లేదు’
తిరుమల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలన మూడు మోసాలు, ఆరు అబద్దాలుగా సాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. బుధవారం ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్యాలెండర్లు మారుతున్నా, చంద్రబాబు మాత్రం మారడం లేదని ఎద్దేవా చేశారు. యూపీ రాజకీయాలు చూసి ఏపీలో చంద్రబాబుకు బీపీ వచ్చిందని, అక్కడ అఖిలేష్‌లాగానే ఇక్కడ లోకేష్ కూడా తనను ఎక్కడ అధికారంలో నుంచి దింపేస్తారనే భయం పట్టుకుందని రోజా వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే లోకేష్‌ను మంత్రిని చేయడానికి చంద్రబాబు వెనుకాడుతున్నారన్నారు. సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు లేవన్న చంద్రబాబు... పులివెందులకు ఇస్తామంటే జనం నమ్ముతారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాయలసీమకు నిధులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అన్యాయం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. -
తిరకేసు!
ఆశల పల్లకీలో భూమా – టీడీపీలో చిచ్చురేపుతున్న మంత్రి పదవి – కష్టమేనంటున్న వ్యతిరేక వర్గం – రౌడీషీట్ చుట్టూ రాజకీయం – తెరపైకి తెలంగాణ వ్యవహారం – రోజురోజుకు ముదురుతున్న వివాదం – ఆసక్తికరంగా మారిన చర్చ సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో పదవుల పందేరం కాస్తా మరోసారి చిచ్చురేపుతోంది. తమ నేతకు మంత్రి పదవి దక్కుతుందంటూ భూమా నాగిరెడ్డి అనుచరులు వాదిస్తుండగా.. అదేమీ లేదని మరో వర్గం పేర్కొంటోంది. మంత్రి పదవి ఇవ్వడంలో భాగంగానే రౌడీషీట్ ఎత్తివేసే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతోంది. అయితే.. అదేమీ లేదని మరో వర్గం కొట్టి పాడేస్తోంది. ఇందుకోసం వీరు తెలివిగా తెలంగాణలో తలసానికి మంత్రి పదవి ఇవ్వడంపై జరిగిన గొడవను తెరమీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా.. పార్టీ మారినప్పటికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెబుతున్నారు. దసరా తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ నేపథ్యంలో జిల్లాలో ఈ చర్చ కాస్తా ఆసక్తికరంగా మారింది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా భూమాకు మంత్రి పదవి అప్పగించే విషయంలో అధికార పార్టీలోని నేతలే కొత్త చర్చను లేపుతున్నారు. ఒకపార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారిన తర్వాత.. కనీసం పదవులకు రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చారని పక్క రాష్ట్రంలో మన పార్టీనే గోల చేస్తున్న విషయాన్ని వీరు పేర్కొంటున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారంలో మనమే రచ్చ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అదే తరహాలో పార్టీ మారిన వ్యక్తికి మంత్రి పదవి అప్పగిస్తే పార్టీ వాదనకు ఏం బలం ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా మంత్రి తలసాని వ్యవహారంలో ఏకంగా గవర్నర్ వ్యవస్థనూ కించపరిచిన నేపథ్యంలో ఇక్కడ పార్టీ మారిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే.. అదే గవర్నర్‌ను ప్రమాణ స్వీకారం చేయించాలని కోరేందుకు తమకు మోహం ఎలా వస్తుందని అంటున్నారు. ఈ చర్చ అధికార పార్టీ నేతలతో పాటు అధినేతను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. రౌడీషీట్ ఎత్తేస్తారా? అసలు రౌడీషీట్ ఎత్తివేసే విషయంలోనే అధికార పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదంత సులువైన వ్యవహారమేమీ కాదనే వాదన వినిపిస్తోంది. కేవలం ఆయన పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి అభిప్రాయం తెలపాలని మాత్రమే జిల్లా పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి లేఖ వచ్చిందని ఆయన వ్యతిరేక వర్గం వాదిస్తోంది. అయితే, అసలు మంత్రి పదవి వరించేందుకు ముందుగానే రౌడీషీట్ ఎత్తివేస్తారని భూమా అనుచరులు బలంగా పేర్కొంటున్నారు. మొత్తం మీద మంత్రిపదవుల వ్యవహారం కాస్తా జిల్లాలో మరోసారి ఇరువర్గాల మధ్య ఆసక్తికర పోరుకు తెరలేపినట్లు తెలుస్తోంది. -
నారాయణ.. నీ పదవి కాపాడుకో
పార్టీ భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయించేది ప్రజలే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు(మినీబైపాస్): గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ చూసి మంత్రి నారాయణకు దిక్కుతోచని స్థితిలో వైఎస్సార్సీపీపై మాట్లాడుతున్నాడని, ముందు నీకు మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలుసుకుని జాగ్రత్తపడమని మంత్రి నారాయణకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిశ్రీధర్‌రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ రూరల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి విలేకరుల సమావేశం మాట్లాడారు. రాష్ట్ర మంత్రుల సమర్థత, పని తీరులో మంత్రి నారాయణకు ఆఖరి స్థానం దక్కడం ఆయన చేత గాని పనికి నిదర్శనమన్నారు. మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్ గురు శిష్యులిద్దరూ అసమర్థ పాలనతో కార్పొరేషను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కార్పొరేషన్‌ను రూ.1200 కోట్ల అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ కనుమరుగు కావాలంటే కాలేజీలు ప్రారంభించి ఎత్తేయడం అంత సులభతరం కాదని ఎద్దేవ చేశారు. వైఎస్సార్సీపీ భవిష్యత్‌ను నిర్దేశించేది నీలాంటి అసమర్థులు కారని, విజ్ఞులైన ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మంత్రిగా చేతనైతే వైఎస్సార్‌నగర్‌లో పేదలకు నిర్మించి ఇస్తానన్న ఇళ్లను పూర్తి చేయాలని, సమ్మర్ స్టోరీజీ ద్వారా మంచినీటిని అందించాలని కోరారు. నగరంలో ఇష్టానుసారంగా ఆక్రమణల పేరుతో ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చడం దారుణమన్నారు. ఇళ్లు నిర్మించమని ప్రజలు అడుగుతుంటే ఉన్న వాటిని తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను, సంక్షుమ పథకాలను అమలు పరచడంలో విఫలం కావడంతో ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సమావేశంలో 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
రాజీనామాకు సిద్ధం!
సాక్షి, చెన్నై: కులచల్ హార్బర్ ప్రాజెక్టు సాధన కోసం అవసరం అయితే, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాటాలకు సిద్ధమని పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. డీఎంకే, అన్నాడీఎంకేలు ఐక్యతతో పనిచేసి, రాష్ట్ర ప్రగతి మీద దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. కన్యాకుమారి జిల్లా కులచల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వర్తక రీత్యా హా ర్బర్ నిర్మాణానికి కసరత్తుల్లో నిమగ్నమైంది. ఇందుకు తగ్గ ప్రకటనను ఎన్నిక ల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. అయితే, ఈ ప్రకటన తరువాయి, ప్రజల్లో ఆందోళన రేకెత్తించే రీతిలో సముద్ర తీరాల్లో ప్రచారం సాగుతున్నది. ప్రజల స్థలాల్ని బలవంతంగా లాక్కుంటారని, హార్బర్ పేరిట తీర వాసుల్ని బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయని, గోడౌన్ల పేరిట వ్యవసాయ భూముల్ని లాక్కునే ప్రమాదం ఉందన్న ప్రచారం బయలు దేరింది. దీనిని పనిగట్టుకుని కొన్ని పార్టీలు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ గురువారం నాగుర్ కోయిల్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొందరు ఆరోపణలు గుప్పిస్తూ , ప్రజల్ని రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం అవసరం అయితే, తన మంత్రి పదవికి రాజీనామా చేసి పోరుబాట సాగించేందుకు సైతం తాను సిద్ధం అని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాలు ఆర్థిక ప్రగతిని సాధిస్తాయని, అయితే, దీనిని అడ్డుకోవడం లక్ష్యంగా కుట్రలు సాగుతున్నామని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో తిరుగుతూ, ఆయా దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాల మేరకు కొత్త ప్రాజెక్టుల్ని దేశంలోకి తీసుకు వస్తున్నారని వివరించారు. డీఎంకే, అన్నాడీఎంకేలు సమిష్టిగా, ఐక్యతతో వ్యవహరించి కేంద్రం నుంచి పథకాలు, ప్రాజెక్టుల్ని రాష్ట్రంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రగతికి రెండు పార్టీలు కేంద్రంతో కలిసి ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ బీజేపీ మీద నిందలు వేయడం మానుకుని, కాంగ్రెస్ బలోపేతం మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికే కాంగ్రెస్ చతికిలబడిందని, విస్మరిస్తే అథోగతి తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న పుణ్యమా డీఎంకే ఇబ్బందుల్లో పడాల్సి వ చ్చిందని వ్యాఖ్యానించారు. -
'నేను చచ్చినా చంద్రబాబు నాకు పదవి ఇవ్వరు'
బెళుగుప్ప(అనంతపురం): వివాదాస్పద వ్యాఖ్యలు అలవాటుగామారిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అదేపని చేశారు. సంక్షేమ పథకాలకు తాను వ్యతిరేకినని, కూలీ పనికి వెళ్లేవాళ్లు కూడా రోజుకు ఐదారు సార్లు టీ తాగుతున్నారని, అలాంటివారికి రూపాయికే కిలో బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా సకాలంలో పూర్తచేయలేరని, పోలవరం ప్రాజెక్టు గురించి పుట్టినప్పటినుంచి వింటున్నానని, అది పూర్తవుతుందన్న నమ్మకం తనకు లేదని జేసీ వ్యాఖ్యానించారు. బుధవారం అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వరని, 'నేను చస్తేగానీ నాకు మంత్రి పదవి ఇవ్వరా?' అని చంద్రబాబుతో సరదాగా అన్నానని గుర్తుచేస్తూ.. తనకు అదృష్టం లేనందున మంత్రినికాలేకపోయానని, బాబుకు లక్ ఉంది కాబట్టే సీఎం అయ్యారని జేసీ చెప్పుకొచ్చారు. -
'మంత్రి పదవి కావాలని బాబును అడగలేదు'
గుత్తి: ‘కాంగ్రెస్ హయాంలో కూడా పేదలకు ఉచితంగా పండుగ సరుకులను అందజేశాము. అయితే అప్పుడు ఇంతగా ప్రచారం చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం చంద్రన్న కానుక సరుకులపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది..’ అని అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ‘చంద్రన్న కానుక’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సరుకుల గురించి ఇప్పుడింతగా ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తానెప్పుడూ మంత్రి పదవి ఆశించలేదని చెప్పారు. ఇప్పించండని చంద్రబాబును అడగలేదని, భవిష్యత్తులో కూడా అడగబోనని పేర్కొన్నారు. చంద్రబాబుతో మాట్లాడే ధైర్యం తనకు తప్ప మరెవరికీ లేదన్నారు. ‘రాష్ట్రంలో ఖజానా దివాళా తీసింది. రాష్ట్రం విడిపోయాక ఆర్థిక ఇక్కట్లు ఎక్కువయ్యాయి. రాజకీయ పరిస్థితుల కారణంగానే చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారు. అయితే.. వాటిని దశల వారీగా అమలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబును కలిసి పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యికి ఎందుకు పెంచావని అడిగా. పింఛన్ రాలేదని చాలామంది మథనపడుతున్న విషయాన్నీ చెప్పా. రూ.500కు పెంచి ఉంటే అందరికీ ఇచ్చే అవకాశం ఉండేది..’ అని పేర్కొన్నారు. తన ప్రసంగంలో జేసీ పదేపదే ‘మా కాంగ్రెస్ పార్టీ’ అనడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. -
అఖిలకు మంత్రి పదవి ఆశ చూపారు!
-
'అఖిలకు మంత్రి పదవి ఆశచూపారు'
హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే అధికార పార్టీపై తనపై అక్రమ కేసులు బనాయించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అయితే తానేమి కేసులకు భయపడటం లేదని స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన గొడవ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్ని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భూమా నాగిరెడ్డి ప్రకటించారు. వాస్తవానికి తన కూతురు అఖిల ప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే... మంత్రి పదవి కూడా ఇస్తామని ఆపార్టీ తనకు ఆశ చూపిందని ఆయన వెల్లడించారు. తాను తిరస్కరించడంతో.. ఆ కక్షతో తనపై కేసులు మోపారని భూమా నాగిరెడ్డి ఆరోపించారు. మనుషులే శాశ్వతం కానప్పుడు...పదవులు శాశ్వతమా అని ఆయన అన్నారు. పదవి పోతే చంద్రబాబు నాయుడు కూడా మాజీ ముఖ్యమంత్రే అవుతునారని భూమా వ్యాఖ్యానించారు. -
రెండో చాన్స్.. ఎవరికో...?
- మలివిడత విస్తరణలో జిల్లాకు అవకాశం దక్కేనా - ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు - తెరపైకి ఏనుగు, గంప, బాజిరెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా 11 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. జిల్లా నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు ప్రయత్నం చేసినా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కడికే వ్యవసాయశాఖ మంత్రిగా చాన్స్ లభించింది. మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న ప్రకటన వెలువడటంతో జిల్లా నుంచి ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సామాజిక వర్గం పరిగణనలోకి.. రెండోదఫా విస్తరణలో ఇతర జిల్లాల నాయకుల ప్రాధాన్యత, సామాజిక వర్గం, సీనియారిటీ తదితర కోణాల్లో పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలో సీనియర్ రాజకీయవేత్త, ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ ఎస్‌లో కొనసాగు తూ నాలుగు పర్యాయాలు గెలుపొందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి అవకాశం లేకుండా పోయింది. కామారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్‌సింధేలతో పాటు ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రయత్నం చేసినా.. మొదటి విడతలో చాన్స్ దక్కలేదు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు మన జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారంతో మరోసారి ఆశావహులు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావుతో పాటు శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి దక్కితే.. ఇక్కడ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చాన్స్ ఉంటుందంటున్నారు. లేదంటే జూపల్లితో పాటు లక్ష్మారెడ్డికి ఇస్తే.. జిల్లాలో గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్‌లలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందూరుకు ఇద్దరు మంత్రులు ఎంపీటీసీలు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు.. జడ్పీటీసీల నుంచి జడ్పీ చైర్మన్ వరకు... నిజామాబాద్ నగర మేయర్, రెండు మున్సిపాలిటీలో విజయభేరీ మోగించిన ఇందూరు జిల్లాకు రెండు మంత్రి పదవులు ఖాయమన్న ఆశాభావాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మంత్రి వర్గంలోకి తీసుకునే వారిలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ల పేర్లను ప్రకటించినప్పటికీ పోచారానికి మొదటి విడతలోనే అవకాశం కల్పించారు. ఆ తర్వాత మళ్లీ విస్తరణ జరిగితే రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను అందించిన జిల్లాకు రెండు మంత్రి పదవులు, స్పీకర్ పదవులు దక్కుతాయన్న ప్రచారం జరిగింది. అయితే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరికే మంత్రి పదవి దక్కగా, రెండో మంత్రి, విప్‌లపై సస్పెన్స్ నెలకొంది. -
నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించాలి
కర్నూలు(న్యూసిటీ): నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను రాష్ట్ర నూతన మంత్రివర్గం నుంచి తొలగించాలని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి సునిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంతో కార్పొరేట్ విద్యావ్యవస్థకు మరింత ఆయువు పోసినట్లవుతుందన్నారు. కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు పెరిగిపోయాయని, దీని కారణంగా ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయని వివరించారు. ఎంసెట్, ఇంటర్ వార్షిక ప్రశ్నాపత్రాల లీకేజీలలో నారాయణ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సూర్యకుమార్, నగర సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, నగర సంఘటనా కార్యదర్శి రంజిత్, రాజేష్, సుభాకర్, సాయి, జనార్ధన్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకుల అరెస్టు, విడుదల... ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులు సునిల్‌రెడ్డి, సూర్యకుమార్, ప్రశాంత్, రంజిత్, రాజేష్, జనార్దన్, శివ, సతీష్, నంద, ప్రతాప్, సందీప్‌ను పోలీసులు అరెస్టు చేసి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ ఎదుట 144వ సెక్షన్ అమలులో ఉందని, ధర్నాలు చేయరాదని పోలీసులు చెప్పారని సునిల్‌రెడ్డి వివరించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. -
టీడీపీ నేత కాగిత వెంకట్రావ్ కు అస్వస్థత
పెడన: కృష్ణా జిల్లా టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్ ఉన్న ఆయన నిన్న ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆస్పత్రిపాలయ్యారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గుయ్యారు. ఈసారి తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనుకున్న ఆయన ఆశలు ఫలించలేదు. బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన కాగిత వెంకట్రావ్ గతంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. అప్పట్లోనే కేబినెట్ మంత్రి పదవి వస్తుందని భావించారు. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా ఆయన్ను పక్కనపెట్టడంతో ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌కు మంత్రి వర్గంలో బెర్త్ దొరకలేదు. -
'మంత్రి పదవి వద్దు... నిధులిస్తే చాలు'
అనంతపురం: తనకు మంత్రి పదవి వద్దని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తే చాలని అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు హామీలు నెరవేర్చడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబుతో పాటు ఈ నెల 8న 10 నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి స్పందించారు. మంత్రి పదవులకు విన్పిస్తున్న 15 మందిలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం -
శిద్దాకు మంత్రి పదవి ఖరారు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొత్తగా ఏర్పడనున్న తెలుగుదేశం ప్రభుత్వంలో దర్శి ఎమ్మెల్యే శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. బుధవారం తిరుపతిలో జరిగిన తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం అనంతరం శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ మేరకు ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. గురువారం ఉదయం కూడా చంద్రబాబునాయుడుతో శిద్దా సమావేశమైనట్టు తెలిసింది. ఆయనకు వాణిజ్య శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాఘవరావుకు సీనియర్ నాయకుడిగా తెలుగుదేశంలో గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై వెయ్యికిపైగా ఓట్లతో గెలుపొందినా, సీనియర్ నాయకుడిగా ఆయనకు అవకాశం కల్పించడానికి సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో పాటు అధికారంలో లేని కాలంలో ఆయన పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా నిలిచారని పార్టీ నాయకులు తెలిపారు. ఆయనతో పాటు టీడీపీకి మరో పెద్దదిక్కయిన మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా కోరుతున్నట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు సుముఖంగా లేరని అంటున్నారు. జిల్లాకు మరో మంత్రి పదవి కూడా ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఒంగోలు దిగ్గజంగా పేరుపొందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలిచిన దామచర్ల జనార్దన్‌కు మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలూరి సాంబశివరావు, చంద్రబాబు తనయుడు లోకేష్ ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. లోకేష్‌కు, ఏలూరి సాంబశివరావుకు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీంతో లోకేష్ ఏలూరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. జనార్దన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్నికల సమయంలో తన సమర్ధతను నిరూపించుకున్నారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమే సముచితమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ కరణం బలరామకృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసు కోవాల్సిన ఆవశ్యకత లేదని అన్నారు. దీనికి చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఆయనకు ఇస్తే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. దివి శివరాం, కందుల నారాయణరెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారని, వారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవులు కట్టబెట్టాల్సి ఉంటుందని అన్నారు. ఏది ఏమైనా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం శిరోధార్యమని అన్నారు. -
సిరిసిల్లకు మంత్రి యోగం
రాష్ట్ర ఐటీ, పీఆర్ మంత్రిగా కేటీఆర్ - సిరిసిల్ల చరిత్రలో తొలిసారి మంత్రి పదవి - 38 ఏళ్లకే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఇప్పటి వరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎమ్మెల్యే కేటీఆర్ మంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడిగా నియోజకవర్గంలో అడుగిడిన కేటీఆర్ తిరుగులేని నేతగా ఎదిగారు. రాజకీయ విశ్లేషణలు, వాగ్ధాటితో తనదైన ముద్ర వేశారు. 2009లో తొలిసారిగా సిరిసిల్లలో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో కేటీఆర్ పిన్నవయస్కుడు. 38 ఏళ్లకే రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. నేరెళ్ల నియోజకవర్గం ఉండగా.. అక్కడ గెలిచిన పాటి రాజం, సుద్దాల దేవయ్య రాష్ట్ర మంత్రులుగా పని చేశారు. నేరెళ్ల నియోజకవర్గం ఆనవాయితీ.. సిరిసిల్లకు కలిసి వచ్చింది. కేటీఆర్ కీలకమైన రెండు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగుపడ్డాయి. కీలక మంత్రిత్వ శాఖలు.. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటీఆర్ దక్కించుకున్నా రు. గ్రామీణాభివృద్ధిని పరుగు పెట్టించే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐటీ రంగంలోని ఆయనకున్న అపార అనుభవంతో తెలంగాణలో ఐటీ పరిశ్రమల విస్తరణ జోరందుకునే అవకాశం ఉంది. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణాన్ని అభివృద్ధి ఫలాలతోనే తీర్చుకుంటానంటూ.. కేటీఆర్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో అభివృద్ధి మంత్రించినట్లేనని స్థానికుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దశాబ్దం తర్వాత బుగ్గ కారు
- హరీష్‌రావుకు మంత్రి పదవి - క్యాబినెట్లో సిద్దిపేటకు సముచిత స్థానం - భారీ నీటిపారుదల శాఖ కేటాయింపు సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి రాజయోగం పట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం తొలివిడత ప్రమాణం చేసిన 11 మంది మంత్రుల్లో ఎమ్మెల్యే హరీష్‌రావుకు అవకాశం దక్కింది. భారీ నీటి పారుదల శాఖను హరీష్‌రావుకు కేటాయించించారు. సిద్దిపేట నియోజకవర్గానికి పది సంవత్సరాలుగా మంత్రి పదవి కరువైంది. ఈ క్రమంలో హరీష్‌రావుకు తొలివిడతలో మంత్రివర్గంలో బెర్తు ఖాయం కావడంతో నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. సిద్దిపేట శాసనసభకు 2004 ఉప ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన హరీష్‌రావు అప్పట్లోనే దివంగత నేత వైఎస్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పక్షాన హరీష్‌రావు ఎమ్మెల్యే కాకుండానే వైఎస్ కేబినెట్లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు. తొలిసారి మంత్రి హోదాలోనే అప్పట్లో నియోజకవర్గ అభివృద్ధికి పుష్కలంగా నిధులను విడుదల చేయించుకున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుచిత వైఖరిని నిరసిస్తూ కొద్ది నెలల తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. దీంతో హరీష్‌రావు తన మంత్రి పదవిని వదులుకున్నారు. కాలక్రమేనా 2009 సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన హరీష్‌రావు టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా శాసనసభలో పార్టీ పక్షాన కీలక పాత్ర పోషించారు. ఈ పదేళ్ల పాటు శాసన సభ్యుని హోదాలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడే తొలి మంత్రివర్గ కూర్పులో సిద్దిపేటకు సముచిత స్థానం దక్కింది. తెలంగాణ ప్రాంతంలో జలవనరుల అభివృద్ధిని మరింత పెంపొందించే దిశగా కేసీఆర్ తన మేనల్లుడు హరీష్‌రావుకు భారీ నీటి పారుదల శాఖతో పాటు అదనంగా మరో శాఖను కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
‘రాధా’కు పదవి!
సాక్షి,చెన్నై: రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌కు కేంద్రంలో పదవి దక్కిం ది. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవి ఆయన్ను వరించింది. దీంతో రాష్ట్రంలోని కమలనాథుల్లో ఆనందోత్సాహాలు నిండాయి. సంబరాల్లో మునిగి తేలారు.పదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ చతికిలపడిన విషయం తెలిసిందే. ద్రవిడ పార్టీలు చీదరించుకోవడంతో ఆ పార్టీని అక్కున చేర్చుకున్న వాళ్లు లేరు. చిన్నా, చితక పార్టీలతో కలసి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చతికిలపడిన పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన పొన్ రాధాకృష్ణన్ శ్రమించారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా మెగా కూటమిని ఏర్పాటు చేయడంలో పొన్ రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో తమ కూటమికి అత్యధిక స్థానాల్లో ఓటమి ఎదురైనా రెండు సీట్లు దక్కించుకోవడం బీజేపీలో ఆనందాన్ని నింపింది. కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్ విజయ ఢంకా మోగించారు.కేంద్రంలో పదవి : ఎంపీ గెలుపొందిన పొన్ రాధాకృష్ణన్‌కు బీజేపీ అధిష్టానం గుర్తింపును ఇచ్చింది. రాష్ట్ర పార్టీ బలోపేతానికి శ్రమించిన ఆయన్ను గౌరవించే విధంగా కేంద్ర సహాయ మంత్రి పదవిని అప్పగించింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర సహాయ మంత్రిగా పొన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. పదేళ్ల తర్వాత రాష్ట్రం నుంచి తమ ప్రతినిధి ఎన్నిక కావడంతో పాటుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి పదవి రావడంతో బాణ సంచాలు పేల్చుతూ పండుగ చేసుకున్నారు. రెండో సారి మంత్రిగా: పొన్ రాధాకృష్ణన్‌ను రెండో సారి కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. బ్రహ్మచారిగా ఉన్న రాధాకృష్ణన్ తొలుత హిందూ మున్ననిలో చురుగ్గా రాణించారు. హిందూ మున్నని నుంచి ఆర్ఎస్ఎస్లోకి వెళ్లిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగారు. కన్యాకుమారి జిల్లా పరిధిలో పూర్వం ఉన్న నాగుర్కోయిల్ లోక్‌సభ నుంచి 1999లో ఎన్నికయ్యారు. ప్రధాని వాజ్పాయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ సహాయ మంత్రి పదవి ఆయన్ను వరించింది. 2004లో అదే స్థానం బరిలో మళ్లీ నిలబడ్డా ఓటమి తప్పలేదు. 2009లో నాగుర్ కోయిల్ గల్లంతై, కన్యాకుమారి ఆవిర్భవించడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. అయితే, ద్రవిడ పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారేగానీ, విజయాన్ని అందుకోలేకపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకాతో కేంద్రంలో మళ్లీ మంత్రి పదవిని కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో అత్యధిక భూ భాగం సముద్ర తీరం ఉండటం, ఇక్కడి హార్బర్ల ద్వారా అత్యధిక ఆదాయం కేంద్రానికి వస్తుండటంతో ఆయనకు కేంద్ర నౌకాయన శాఖ సహాయ మంత్రి పదవిని అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్భుమణికి భంగ పాటు: కేంద్రంలో పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న అన్భుమణి రాందాసుకు భంగ పాటు తప్పలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పీఎంకే బరిలోకి దిగింది. ఎంపీగా గెలిస్తే అన్భుమణికి చోటు కల్పిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సీట్ల పందేరం సమయంలో సంకేతాలు వెలువడ్డాయి. ఆ పార్టీ 8 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టింది. పార్టీ అధినేత రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు ధర్మపురి నుంచి తొలి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో కేంద్రంలో తమకు పదవి దక్కుతుందన్న ఆశ పీఎంకే వర్గాల్లో నెలకొంది. అన్భుమణి రాందాసు గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కేబినెట్ హోదాతో పనిచేసినదృష్ట్యా, ఈ సారి అదే హోదాతో ఏదేని పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న అన్భుమణికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఆయనకు మొదటి విడతలో పదవి దక్కలేదు. కేబినెట్ విస్తరణలో ఏమైనా అవకాశాలున్నాయేమో వేచిచూడాల్సిందే! -
అమాత్య పదవిపై ఆశల మోసులు
- రేసులో యనమల, గోరంట్ల, చినరాజప్ప! - ఎస్సీ కోటా నుంచి గొల్లపల్లి, పులపర్తి! - తానూ ఉన్నానంటున్న పిల్లి అనంతలక్ష్మి! సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో టీడీపీ తరఫున 13 మంది ఎమ్మెల్యేలు కాగా వారిలో సగం మంది కన్నా ఎక్కువే మంత్రి పదవిని ఆశిస్తున్నారు. దశాబ్దం తర్వాత పార్టీకి అధికారంలోకి రావడంతో ఎవరికి వారు అవకాశాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అదే కేబినెట్ కూర్పులో అధినాయకత్వానికి చిక్కుసమస్యలా మారేలా ఉంది. అసలు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయి, ఏ సామాజికవర్గానికి అవకాశం దక్కుతుంది అన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాకున్న ప్రాధాన్యం, ఎమ్మెల్యేల సంఖ్య ప్రాతినిధ్యం ప్రాతిపదికన మూడుకు తక్కువ గాకుండా మంత్రి పదవులు రావచ్చని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈలోగా.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఆశలపల్లకీలో ఊరేగుతున్నారు. జిల్లా నుంచి మంత్రి పదవుల రేసులో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పల పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీరిలో రాజ్యసభకు వెళ్లాలనుకున్న యనమల చివరికి ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవలసి వచ్చిం ది. మండలిలో విపక్షనేతగా వ్యవహరిస్తున్న ఆయన గతంలో ఆర్థికశాఖ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఈసారి ఎమ్మెల్సీగా మంత్రి పదవి దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆయనకు వరుసకు సోదరుడైన కృష్ణుడు తుని నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అదే యనమలకు మైనస్ అవుతుందని భావిస్తున్నారు. అయితే దాంతో సంబంధం లేకుండానే పార్టీలో సీనియారిటీ, మంత్రిగా పనిచేసిన అనుభవంతో తిరిగి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. పార్టీలో మరో సీనియరైన గోరంట్ల కూడా మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ కేబినెట్లో పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేసిన గోరంట్ల.. ఆ అనుభవం, పార్టీలో సీనియారిటీతో పదవి వరిస్తుందనే ధీమాతో ఉన్నారు. చంద్రబాబు సామాజికవర్గం నుంచి ఎన్నికైన పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావుల కన్నా తానే సీనియర్ కావడంతో అవకాశం తనదేనని భావిస్తున్నారు. అయితే పార్టీలో ఆది నుంచీ గోరంట్లకు ప్రత్యర్థిగా ఉన్న గన్ని కృష్ణ ఆయనకు చెక్ పెట్టేందుకు తెరవెనుక గట్టి ప్రయత్నాల్లో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. రెండోసారి గెలిచిన వారిలోనూ ఆశలు.. కాగా సామాజికంగా బలమైన వర్గం నుంచి ఎన్నిక కావడం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రికార్డు స్థాయిలో పనిచేయడం తనకు సానుకూలమవుతాయని చినరాజప్ప ఆశిస్తున్నారు. కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ పదవిపై కూడా రాజప్ప ఆశ పెట్టుకున్నారని అంటున్నారు. పార్టీలోకి తన కంటే వెనుక వచ్చిన వారు పెద్ద, పెద్ద పదవులు నిర్వర్తించారని, ఈసారి తనకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతుందన్న నమ్మకంలో ఉన్నారని అంటున్నారు. కాగా ఎస్సీ సామాజికవర్గం నుంచి సీనియర్ అయిన తనకు అవకాశం ఖాయమని రాజోలు నుంచి ఎన్నికైన గొల్లపల్లి సూర్యారావు ఆశ పడుతున్నట్టు సమాచారం. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, ఎంపీ టిక్కెట్టు ఇస్తానని చివరి నిమిషంలో రాజోలు నియోజకవర్గానికి పంపినా గెలుపొందడం తనకు అనుకూలంగా కాగలవని అంచనా వేస్తున్నట్టు చెపుతున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, మహిళ అందునా బీసీ కావడం తనకు అవకాశం తెచ్చి పెడతాయని కాకినాడ రూరల్ నుంచి ఎన్నికైన పిల్లి అనంతలక్ష్మి ఆశిస్తున్నారు. రామచంద్రపురం నుంచి గెలిచిన తోట త్రిమూర్తులు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నా.. పార్టీలు మారి, మారి వచ్చిన ఆయనకు అవకాశం కష్టమేనంటున్నారు. వీరితో పాటు రెండోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కూడా అమాత్యయోగంపై మక్కువ పడుతున్నారు. -
అక్కడ గెలిస్తే మంత్రి పదవి బోనస్..
రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్లు రాజ్యమేలుతుంటాయి. నరసరావుపేట నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ బహుళ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఖాయం అనేది ఆ సెంటిమెంటు. గతంలో చాలాసార్లు ఆ విధంగా జరిగింది. ఈసారి అందరూ కొత్తవారే పోటీచేస్తున్న నేపథ్యంలో తొలిసారి గెలవగానే ఈ సెంటిమెంట్ ప్రకారం మంత్రి కూడా అయ్యే అదృష్టం ఉందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో గెలిచిన వారిలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు వెంటనే మంత్రులైన ఘనత ఉంది. రాజకీయ ఉద్దండుల కోటగా పేరొందిన నరసరావుపేట నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఇది. అక్కడి నుంచి గెలిచిన వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఏడున్నరేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇంకో విశేషమేమిటంటే నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురు దానికి ముందో, తర్వాతో ముఖ్యమంత్రులుగా కూడా చేసిన చరిత్ర ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆ కోవలోకి వస్తారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి 1983లో జరిగిన ఎన్నికలలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి పదవిని అలంకరించారు. అంతేకాదు గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సారి రాష్ట్ర హోం మంత్రి పదవి పొందిన వ్యక్తిగా కోడెల రికార్డుల్లోకి ఎక్కారు. అక్కడి నుంచి వరుసగా మరో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్లలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. కోడెలకు ప్రత్యర్ధిగా ఉన్న కాసు వెంకటకృష్ణారెడ్డి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో మంత్రిగా కొనసాగారు. అయితే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు రాజకీయాలకు కొత్తవారు కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే సెంటిమెంట్ ప్రకారం ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అయినట్టేనని నియోజకవర్గ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ అదృష్టజాతకుడెవరో వేచి చూడాలి.