టీడీపీ నేత కాగిత వెంకట్రావ్‌ కు అస్వస్థత | tdp leader kagita venkata rao hospitalised | Sakshi

టీడీపీ నేత కాగిత వెంకట్రావ్‌ కు అస్వస్థత

Jun 9 2014 12:25 PM | Updated on Sep 2 2017 8:33 AM

టీడీపీ నేత కాగిత వెంకట్రావ్‌ కు అస్వస్థత

టీడీపీ నేత కాగిత వెంకట్రావ్‌ కు అస్వస్థత

కృష్ణా జిల్లా టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌ అస్వస్థతకు గురయ్యారు.

పెడన: కృష్ణా జిల్లా టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌ అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్ ఉన్న ఆయన నిన్న ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆస్పత్రిపాలయ్యారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గుయ్యారు. ఈసారి తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనుకున్న ఆయన ఆశలు ఫలించలేదు.

బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన కాగిత వెంకట్రావ్ గతంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. అప్పట్లోనే కేబినెట్ మంత్రి పదవి వస్తుందని భావించారు. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా ఆయన్ను పక్కనపెట్టడంతో ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌కు మంత్రి వర్గంలో బెర్త్ దొరకలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement