
సాక్షి,సూర్యాపేటజిల్లా: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వట్టి దద్దమ్మ అని, ఆయనకు రైతుల బాధలు తెలియవని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్‌నేత జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్‌రెడ్డి అన్‌ఫిట్ అని మండిపడ్డారు. ‘కనీస అవగాహన లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఉత్తంకుమార్ రెడ్డినే.
నాగార్జునసాగర్ పరిధిలో కూడా పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నాడు. రాష్ట్రంలో డెకాయిట్ల పాలన నడుస్తున్నది. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులే పెద్ద డెకాయిట్లు. చేయి తడపనిదే ఏ పని కావట్లేదని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. కేసీఆర్ ని డెకాయిట్ అనెంత మొగోడీవా నువ్వు.
పనిచేతగాక హెలికాప్టర్లలో తిరుగుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో కూడా పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ సరైన సమయంలో బయటికి వస్తారు. వీళ్ళ బండారాన్ని బయటపెడతారు. ఇంకొన్ని రోజుల్లో రైతులే మిమ్మల్ని ఉరికించి కొడతారు’అని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment