ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలన మూడు మోసాలు, ఆరు అబద్దాలుగా సాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. బుధవారం ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్యాలెండర్లు మారుతున్నా, చంద్రబాబు మాత్రం మారడం లేదని ఎద్దేవా చేశారు.