ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. నిప్పు-పప్పు అంటూ.. వారి తుప్పు వదలగొట్టారు. తనపై అర్థంలేని విమర్శలు చేస్తున్న లోకేశ్ తీరును ఎండగట్టారు. మొదట ప్యాకేజ్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకున్నారని, అందుకే అందరూ ఆయనను యూటర్న్ అంకుల్ అంటున్నారని విమర్శించారు. మంగళవారం పార్లమెంటు సమావేశాలు వాయిదాపడిన అనంతరం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.