‘రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ యూటర్న్ కనిపించినా.. చంద్రబాబే గుర్తొస్తున్నారు. యూటర్న్ తీసుకోవాల్సి వచ్చినా.. ఇది చంద్రబాబు రహదారి, మనకెందుకులే అని ముందుకు వెళ్లాలని అనిపిస్తోంది. యూటర్న్ అంకుల్ ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ ఆయనకు క్రెడిబిలిటీ లేదు. రహదారిలో యూటర్న్ ఉన్న ప్రతిచోట ఆయన బొమ్మలు ఉంచాలి. అప్పుడైనా ఆయన జ్ఞానోదయం అవుతుందేమో’ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
అధికార అంతమందు చూడవలేరా అయ్యగారి సొబగులు అన్నట్టు చంద్రబాబు పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. దావోస్‌కు వెళ్లి సదస్సు పేరిట ఇడ్లీ, వడ, పొంగల్ పేరిట ఆంధ్ర వంటలను చంద్రబాబు ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద, కిక్కిరిసిన బస్సుల్లో నూరు, యాబై అని బ్లాక్‌టిక్కెట్టులు అమ్ముతారని, అదేవిధంగా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరిస్తూ.. చంద్రబాబు కలిసేందుకు వీలు కల్పించాలని పలు పార్టీల నేతలను బతిమిలాడుకుంటున్నారని విమర్శించారు. సినిమా షూటింగ్ తరహాలో రెడీ.. క్లాప్.. 1, 2, 3.. అనగానే చంద్రబాబు పోజులు ఇచ్చారని, ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండి.. ఈరకంగా ప్రవర్తిస్తున్న మహానుభావుడు ఆయన అని అన్నారు.