'అఖిలకు మంత్రి పదవి ఆశచూపారు' | tdp offered cabinet berth for akhila priya, says bhuma nagireddy | Sakshi
Sakshi News home page

'అఖిలకు మంత్రి పదవి ఆశచూపారు'

Published Wed, Dec 17 2014 2:26 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

'అఖిలకు మంత్రి పదవి ఆశచూపారు' - Sakshi

'అఖిలకు మంత్రి పదవి ఆశచూపారు'

హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకే అధికార పార్టీపై తనపై అక్రమ కేసులు బనాయించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు.  అయితే తానేమి కేసులకు భయపడటం లేదని స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో జరిగిన గొడవ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్ని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భూమా నాగిరెడ్డి ప్రకటించారు.

వాస్తవానికి తన కూతురు అఖిల ప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే... మంత్రి పదవి కూడా ఇస్తామని ఆపార్టీ తనకు ఆశ చూపిందని ఆయన వెల్లడించారు.  తాను తిరస్కరించడంతో.. ఆ కక్షతో తనపై కేసులు మోపారని భూమా నాగిరెడ్డి  ఆరోపించారు. మనుషులే శాశ్వతం కానప్పుడు...పదవులు శాశ్వతమా అని ఆయన అన్నారు. పదవి పోతే చంద్రబాబు నాయుడు కూడా మాజీ ముఖ్యమంత్రే అవుతునారని భూమా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement