'టీడీపీ ఆటలు సాగనివ్వం' | botsa satyanarayana slams tdp | Sakshi
Sakshi News home page

'టీడీపీ ఆటలు సాగనివ్వం'

Published Sat, Jul 4 2015 2:28 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

'టీడీపీ ఆటలు సాగనివ్వం' - Sakshi

'టీడీపీ ఆటలు సాగనివ్వం'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్యే భూమాపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని బొత్స తప్పుబట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన బొత్స.. కర్నూలులో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూమా నాగిరెడ్డిని పోలీసు అధికారి ఉద్దేశపూర్వంగానే నెట్టారన్నారు.

 

తన నెట్టవద్దన్నందుకు భూమాపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా? అని ప్రశ్నించారు. టీడీపీ ఆటలు సాగనివ్వమని బొత్స హెచ్చరించారు. భూమాకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఎస్కార్ట్ లేదని భూమాను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించలేదని.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ఎమ్మెల్యే అఖిల ప్రియపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని జగన్  ప్రశ్నిస్తే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నట్లా? అని బొత్స ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement