
'మంత్రి పదవి వద్దు... నిధులిస్తే చాలు'
అనంతపురం: తనకు మంత్రి పదవి వద్దని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తే చాలని అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు హామీలు నెరవేర్చడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుతో పాటు ఈ నెల 8న 10 నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి స్పందించారు. మంత్రి పదవులకు విన్పిస్తున్న 15 మందిలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం