![Old Women Questions To Prabhakar Chowdary In The Constituency - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/10/ppp.jpg.webp?itok=DGNiSF6M)
ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని ప్రశ్నిస్తున్న వృద్ధురాలు రంగమ్మ
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశావయ్యా? రోడ్లు లేవు. కాలువల్లేవ్. గలీజు నీళ్లలతో తిరుగుతున్నామయ్యా అంటూ’ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిని రంగమ్మ అనే వృద్ధురాలు నిలదీసింది. మంగళవారం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, కార్యకర్తలతో కలిసి 20వ డివిజన్ మిస్మమ్మ కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉండే మిసమ్మ కాలనీలో వృద్ధురాలు ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు. మేయర్, కార్యకర్తలు సైతం ఏమీ మాట్లాడలేకపోయారు. అభివృద్ధి ఏం చేయలేదో చెప్పాలని ఎమ్మెల్యే వృద్ధురాలిని ప్రశ్నించాడు. పింఛన్ ప్రతి నెలా రూ. 2వేలు ఇస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ వృద్ధురాలు ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించింది. పింఛన్ ఎవరికి కావాలని, కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోతే ఎలాగన్నారు. వృద్ధురాలు.. అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టడంతో ఎమ్మెల్యే, మేయర్ అక్కడి నుంచి జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment