సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలంగాణలో ఉచిత కరెంట్ అంశంపై పొలిటికల్ హీట్ నడుస్తోంది. అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని తేలిందన్నారు.
కాగా, రేవంత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ కొనుగోలులో భారీ అవినీతి జరిగింది. కేసీఆర్ అవినీతి బయటపెడతాం.. జైలుకు పంపిస్తాం. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్‌స్టేషన్ల పర్యటనల్లో ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడంలేదని తేలింది. సబ్‌స్టేషన్ల సవాల్‌ను స్వీకరించే ధైర్యం బీఆర్‌ఎస్‌కు ఉందా?. ఏం చేసినా మోటర్లకు మీటర్లు పెట్టం అన్న కేసీఆర్.. ఇప్పుడు మీటర్లు పెడతామని ఒప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారనే భయం కేసీఆర్‌కు పట్టుకుంది.
ప్రతిపక్షం ఎలా ఉండాలో బీఆర్‌ఎస్ నేతలు ట్రయల్ వేస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా మేము ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. నిన్నటి(బుధవారం) నిరసనలతో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల పోలరైజేషన్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌కు కూడా గజ్వేల్‌లో నెగిటివ్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తామని చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
మరోవైపు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం. 11 గంటల విద్యుత్‌లో కూడా కోతలే ఉన్నాయి. ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితి ఉంది. తెలంగాణలో 11 గంటల కంటే విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం అని సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment