నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌కు 5.59 లక్షల మెజారిటీ
పోలైన మొత్తం ఓట్లలో 33.50% ఓట్లు హుజూర్‌నగర్, కోదాడ నుంచే
దేశంలో కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాల్లో మూడో అతిపెద్ద మెజార్టీ గా రికార్డు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యూహం ఫలించింది. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా గెలిచిన నియోజకవర్గాల్లో రెండో అతి పెద్ద మెజార్టీని కైవసం చేసుకుని నల్లగొండ లోక్‌సభ స్థానం రికార్డు సృష్టించింది.
అసోంలోని ధుబ్రీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హసన్‌కు 9.8 లక్షలకు పైగా మెజార్టీ రాగా, ఆ తర్వాత కేరళలోని తిరువల్లూర్‌లో శశికాంత్ సెంథిల్ 5.7 లక్షల మెజార్టీ సాధించారు. ఆ తర్వాత నల్లగొండలోనే రఘువీర్‌రెడ్డి 5.59 లక్షల అత్యధిక మెజార్టీ సాధించగలిగారు.
పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నికల ఇన్‌చార్జి గా వ్యవహరించిన ఉత్తమ్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక వ్యూ హం రచించారు. రఘువీర్‌రెడ్డిని అభ్యరి్థగా ప్రకటించినప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించారు. దాదాపు నెలరోజులకు పైగా నియోజకవర్గంలోనే పనిచేసి కేడర్‌ను కదిలించగలిగారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, పార్టీ మండల, గ్రామ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో గెలుపు వ్యూహాన్ని అమలు చేశారు.
ఎక్కడికక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మిగతా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోగా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌తో పాటు తన సతీమణి పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ నియోజకవర్గం నుంచి మెజారిటీ ఓట్లు వచ్చేలా ఉత్తమ్ కసరత్తు చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఆ రెండు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో రఘువీర్‌కు అత్యధికంగా ఓట్లు లభించాయి.
కోదాడ నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు 1,25,472 ఓట్లు రాగా, హుజూర్‌నగర్‌లో 1,33,198 ఓట్లు వచ్చాయి. పోలైన మొత్తం ఓట్లలో 33.50 శాతం ఓట్లు ఈ రెండు నియోజకవర్గాల్లోనే లభించడం విశేషం. దేవరకొండ, మిర్యాలగూడ, సాగర్, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాలను మించి ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వచ్చాయి. హుజూర్‌నగర్‌లో 1.05 లక్షలు, కోదాడలో 95 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ లభించింది. హుజూర్‌నగర్‌లో వచ్చిన మెజార్టీ రాష్ట్రంలోని ఏ అసెంబ్లీ పరిధిలోనూ రాకపోగా, దేశంలోని టాప్–5 స్థానాల్లోనూ హుజూర్‌నగర్ ఉంటుందని టీపీసీసీ అంచనా వేస్తోంది.
అత్యధిక మెజార్టీపై ఉత్తమ్ హర్షం
హుజూర్‌నగర్: నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి దాదాపు 5.50 లక్షలకు పైగా మెజార్టీ తో విజయం సాధించడంపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1.05 లక్షల మెజార్టీ , తన సతీమణి పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 95 వేల మెజార్టీ ని ప్రజలు కాంగ్రెస్ అభ్యరి్థకి ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీ ఇచి్చన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment