న్యూఢిల్లీ: తెలంగాణలో బర్డ్ ఫ్లూతో ఇబ్బందుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్రాన్ని కోరారు.
బర్డ్‌ఫ్లూతో ఇటీవల రెండు లక్షల కోళ్లు చనిపోయాయని, ఈ పరిశ్రమకు గుర్తింపునిచ్చి వ్యవసాయ రంగంతో సమానంగా రుణాలు లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ పిల్లలు, గర్భిణులకు గుడ్లను పంపిణీ చేయాలన్నారు. కోళ్ల పరిశ్రమలో పనిచేసే కార్మికులకు బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులతో సమానంగా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు.
'కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలి'
Published Thu, May 7 2015 1:16 AM | Last Updated on Thu, Aug 9 2018 5:32 PM
Advertisement