urges centre
-
మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని తమకూ వర్తింపచేయాలని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని ఆట వస్తువుల పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులను పెంచేందుకు ఇవి దోహదపడగలవని పేర్కొన్నాయి. ఇటు దేశీయంగా తయారీకి, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీము ప్రస్తుతం ఫార్మా తదితర 14 రంగాలకు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో టాయ్స్ పరిశ్రమ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. (Hero Motocorp: విడా ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు సహాయకరంగా ఉంటున్నప్పటికీ పీఎల్ఐ స్కీము, ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తే మరింత తోడ్పాటు లభించగలదని లిటిల్ జీనియస్ టాయ్స్ సీఈవో నరేశ్ కుమార్ గౌతమ్ చెప్పారు. అలాగే పరిశ్రమ భవిష్యత్ వృద్ధికి దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం జాతీయ టాయ్ పాలసీ రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రస్తుతం టాయ్స్ పరిశ్రమను హస్తకళలు లేదా క్రీడా వస్తువుల కింద వర్గీకరిస్తున్నారని అలా కాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఎగుమతి మండలిని ఏర్పాటు చేస్తే మరింత ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం ఉంటుందని నట్‌ఖట్ టాయ్స్ ప్రమోటర్ తరుణ్ చేత్వాని అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు భారీ అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమ ప్రస్తతుం తయారీపై దృష్టి పెడుతుండటంతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఎగుమతులు 61 శాతం అప్.. గడిచిన మూడేళ్లలో ఆటవస్తువుల ఎగుమతులు 61 శాతం పెరిగాయని ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. ఇవి 2018–19లో 202 మిలియన్ డాలర్లుగా ఉండగా 2021–22లో 326 మిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. మరోవైపు గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గాయని, 371 మిలియన్ డాలర్ల నుంచి 110 మిలియన్ డాలర్లకు దిగి వచ్చాయని వాణిజ్య శాఖ గణాంకాలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. చాలా మటుకు దిగుమతిదారులు దిగుమతులను తగ్గించుకుని, స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలు సహాయపడుతున్నాయని చెప్పారు. -
మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్ : ఢిల్లీ సీఎం
సాక్షి,న్యూఢిల్లీ: ఒక వైపు కరోనా వైరస్ అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంటే, మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. అందరికీ టీకాలు వేయడానికి కేంద్రం అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన టీకాల సరఫరా తమకు లభిస్తే తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఢిల్లీలో టీకాల కార్యక్రమం మొత్తాన్ని పూర్తి చేస్తామన్నారు. కోవిడ్ -19 టీకాల వేగాన్ని పెంచాలని ఢిల్లీ సర్కార్ పెంచాలని యోచిస్తోంది. రోజుకు 30-40వేల వ్యాక్సిన్లు ఇస్తున్నామనీ, దీన్ని త్వరలో 1.25 లక్షల మందికి పెంచుతామని కేజ్రీవాల్ తెలిపారు..అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని అర్హతగల లబ్ధిదారులందరికీ టీకా డ్రైవ్‌ను విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగింది, కాబట్టి టీకాలు అందించే కార్యక్రమాన్ని కూడా మరింతగా విస్తరించాలన్నారు. అంతేకాదు టీకా తీసుకునేందుకు అర్హుల జాబితా తయారుచేసే బదులు అందరికీ అవకాశం కల్పించాలన్నారు. అలాగే టీకా ధరలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వికేంద్రీకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్రాలు తమదైన రీతిలో యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయడానికి అనుమతించాలని ఢిల్లీ సీఎం కోరారు. టీకా కేంద్రాలకు సంబంధించిన కేంద్రం అమలు చేస్తున్న ప్రస్తుత మార్గదర్శకాలు చాలా కఠినంగా ఉన్నాయని అభి ప్రాయపడిన ఆయన దీ న్ని సరళీకరించి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. టీకా విషయంలో 2 నెలల అనుభవం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాల్లో టీకాలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా భారతదేశంలో మళ్లీ కోవిడ్-19 విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 35,871 తాజా కేసులు నమోదయ్యాయి. ఇది 3 నెలల్లో అత్యధికమని అధికార గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 500కి పైగా కేసులు కొత్తగా నమోదుతో మొత్తం సంఖ్య 644,489 కు చేరుకుంది. గత 24 గంటల్లో ఒక మరణంతో మరణించిన వారి సంఖ్య 10,945 గా ఉంది. -
బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ మండిపడుతోంది. నూతనంగా ప్రవేశపెట్టిన నోట్లను తగినంతగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఎఫ్ఐ) కోరింది. బీఎఫ్ఎఫ్ఐ 12 వ రాష్ట్ర సదస్సు సందర్భంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు టి నరేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ రద్దుతో నకిలీ కరెన్సీ, నల్లధనం వెలికి వస్తుందన్న ప్రభుత్వ వాదనను కొట్టిపారేసిన ఆయన ఈ చర్య పేదల కష్టాలను మరింత పెంచిందని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఏర్పడిన పరిస్థితులపై కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. కరెన్సీ లభ్యతను మెరుగుపర్చి ప్రజలకు మరింత భరోసా ఇవ్వాలని కోరారు. కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంలో, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలోపంతో కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ వైఫల్యం బహిర్గతమైందన్నారు నరేంద్రన్. ప్రయివేటీకరణ, బడాబాబులకు వత్తాసు పలికే చర్యల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. .ప్రయివేట్ కాంట్రాక్టర్ ఏజెన్సీల కారణంగా ప్రజలు ఏటీఎంల నుంచి నగదును పొందలేకపోతున్నారని మండిపడ్డారు . దీంతో దేశంలో అప్రకటిత ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యామ్నాయ చర్యలు, కరెన్సీలు లభ్యతపై భరోసా లేకుండా తీసుకున్న నిర్ణయంతో ప్రజల అవసరాలను తీర్చలేని పరిస్థితికి బ్యాంకులు నెట్టబడ్డాయనీ, దీంతో ప్రజలకు, బ్యాంకు ఉద్యోగులకు మధ్య లేనిపోని విభేదాలు తలెత్తుతున్నాయని నరేంద్రన్ వ్యాఖ్యానించారు. కరెన్సీ బ్యాన్ తదనంతర పరిణమాలపై సరైన హోంవర్క్ లేకుండానే ఆర్థిక వ్యవస్థలో 6 శాతా వాటా ఉన్న పెద్ద కరెన్సీ నోట్ల రద్దును ప్రకటించారని ఆయన విమర్శించారు. -
'కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలి'
న్యూఢిల్లీ: తెలంగాణలో బర్డ్ ఫ్లూతో ఇబ్బందుల్లో ఉన్న కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్రాన్ని కోరారు. బర్డ్‌ఫ్లూతో ఇటీవల రెండు లక్షల కోళ్లు చనిపోయాయని, ఈ పరిశ్రమకు గుర్తింపునిచ్చి వ్యవసాయ రంగంతో సమానంగా రుణాలు లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ పిల్లలు, గర్భిణులకు గుడ్లను పంపిణీ చేయాలన్నారు. కోళ్ల పరిశ్రమలో పనిచేసే కార్మికులకు బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులతో సమానంగా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు.